...
...
Next Story

OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- సమంత మా ఇంటి బంగారం నుంచి హారర్ థ్రిల్లర్ వరకు!

OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఎన్నో సినిమాలు, సిరీస్‌లు రానున్నాయి. కానీ, వాటిలో చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాల జాబితాను ఇక్కడ తెలుసుకుందాం. అందులో సమంత మా ఇంటి బంగారం నుంచి హారర్ థ్రిల్లర్స్ వరకు ఉన్నాయి. మరి ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Published on: Jul 14, 2026, 13:38:29 IST
Advertisement

Top 7 OTT Movies To Watch This Week: థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, వారాంతంలో ఇంట్లోనే కూర్చుని ప్రశాంతంగా వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ఓటీటీ ప్రియుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జూలై రెండో వారంలో డిజిటల్ స్క్రీన్లపై సందడి చేసేందుకు విభిన్న జోనర్ల చిత్రాలు సిద్ధమయ్యాయి.

వివిధ ఓటీటీల్లో

ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- సమంత మా ఇంటి బంగారం నుంచి హారర్ థ్రిల్లర్ వరకు- ఎక్కడంటే?
ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- సమంత మా ఇంటి బంగారం నుంచి హారర్ థ్రిల్లర్ వరకు- ఎక్కడంటే?

వాటిలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి తెలుసుకుందాం. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఎమ్ఎక్స్ ప్లేయర్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ

సెకండ్ లవ్: స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తున్న తొలి తమిళ డేటింగ్ రియాలిటీ ఓటీటీ షో సెకండ్ లవ్. జియో హాట్‌స్టార్ ఓటీటీలో జూలై 13 నుంచి సెకండ్ లవ్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో సెకండ్ లవ్ అందుబాటులో ఉంది.

పవిత్రం 2: మలయాళంలో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ పవిత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. దీనికి అనుబంధంగా పవిత్రం 2 హాట్‌స్టార్‌ ఓటీటీలోకి వచ్చేయనుంది. జూలై 13న పవిత్రం 2 ఓటీటీ రిలీజ్ అయింది.

రెడీ ఆర్ నాట్ 2- హియర్ ఐ కమ్: హాలీవుడ్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా రెడీ ఆర్ నాట్ 2. డార్క్ కామెడీ, ఒళ్లు గగుర్పొడిచే వయోలెన్స్‌తో రూపొందిన ఈ సినిమా జూలై 16 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుంది. తెలుగులో కూడా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అవనుంది.

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్స్‌లో కోట్లు కొల్లగొట్టిన సినిమా బ్యాక్‌రూమ్స్. సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ మిస్టరీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేటి (జూలై 14) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే రెంటల్ విధానంలో బ్యాక్‌రూమ్స్ ఓటీటీ రిలీజ్ అయింది.

రక్తాంచల్ సీజన్ 3 ఓటీటీ

హిందీలో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సూపర్ హిట్ అయిన సిరీస్ రక్తాంచల్. రివేంజ్, యాక్షన్, డ్రామాతో కట్టిపడేసే ఈ ఓటీటీ సిరీస్ నుంచి మూడో సీజన్ కూడా వచ్చేయనుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో రక్తాంచల్ సీజన్ 3 రిలీజ్ కానుంది. జూలై 16 నుంచి అమేజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో రక్తాంచల్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ

టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. కాప్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రాశి సింగ్ హీరోయిన్‌గా చేసింది. జీ5 ఓటీటీలోకి జూలై 17 నుంచి ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు స్ట్రీమింగ్ అవనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks