ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లలో విడుదల కాగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు చెప్పుకునే సినిమా మాత్రం ఏకంగా 8 వారాలకు ఓటీటీ రిలీజ్ కానుంది. ఆ సినిమానే తు యా మై. తెలుగులో నువ్వా నేనా అనే అర్థం వస్తుంది.
సర్వైవల్ హారర్ థ్రిల్లర్

తు యా మై ఒక రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ యూట్యూబ్ ప్రేమ జంటగా నటించారు. తు యా మై సినిమాకు వెరైటీ సినిమాలను అందించే డైరెక్టర్ బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు.
తు యా మై సినిమా 2018లో వచ్చిన థాయ్ మూవీ ది పూల్ ఆధారంగా తెరకెక్కింది. తు యా మై వాలంటైన్స్ డే కానుకగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, షనయ, ఆదర్శ్ గౌరవ్ నటనకు మాత్రం ప్రశంసలు కురిశాయి.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ముఖ్యంగా భయంతో వణికే సన్నివేశాల్లో స్టార్ కిడ్ షనయ కపూర్ ఇమిడిపోయి నటించిందని కామెంట్స్ వినిపించాయి. ట్రైలర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న తు యా మై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి ఏకంగా 8.4 రేటింగ్ సంపాదించుకుంది తు యా మై సినిమా.
తు యా మై కథలోకి వెళితే.. అవని షా (షనయ కపూర్) మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా (ఆదర్శ్ గౌరవ్) నలసోపారాకు చెందిన అప్‌కమింగ్ రాపర్. వీరిద్దరు యూట్యూబ్‌లో డిఫరెంట్ వీడియోలు చేస్తూ పాపులర్ అవ్వాలనుకుంటారు.
వెంటాడే ప్రాణాంతక మొసలి
{{/usCountry}}తు యా మై కథలోకి వెళితే.. అవని షా (షనయ కపూర్) మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా (ఆదర్శ్ గౌరవ్) నలసోపారాకు చెందిన అప్‌కమింగ్ రాపర్. వీరిద్దరు యూట్యూబ్‌లో డిఫరెంట్ వీడియోలు చేస్తూ పాపులర్ అవ్వాలనుకుంటారు.
వెంటాడే ప్రాణాంతక మొసలి
{{/usCountry}}భిన్నమైన లోకాల్లో బతికే వీరిద్దరు ఓ కొలాబరేషన్ వీడియో ద్వారా కలుసుకుంటారు. ఈ యూట్యూబ్ జంట మధ్య ప్రేమ చిగురిస్తుంది. అవని షా లగ్జరీ లైఫ్ మారుతిని అట్రాక్ట్ చేస్తే.. అతడిలో ఉండే నిజాయితీని అవని ఇష్టపడుతుంది. ఈ క్రమంలో గోవా వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఒక పాడుబడిన హోటల్‌లో ఈ జంట చిక్కుకుపోతుంది.
ఆ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేద్దామనుకున్న ఈ జంట మొసలి బారిన పడుతుంది. ఈ యూట్యూబ్ జంటను ఆ స్విమ్మింగ్ పూల్‌లో ప్రాణాంతకమైన మొసలి చంపేందుకు వెంటాడుతుంది. ఆ మొసలి నుంచి ఆ ప్రేమ జంట ప్రాణాలతో బయటపడిందా? లేదా మొసలికే బలి అయ్యారా? అనేదే ఈ సినిమా కథ.
తు యా మై ఓటీటీ స్ట్రీమింగ్
ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన తు యా మై ఓటీటీలోకి వచ్చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తు యా మై ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో తు యా మై ఓటీటీ రిలీజ్ అవనుంది.
ఇప్పుడున్న సమాచారం వరకు కేవలం హిందీ భాషలో మాత్రమే తు యా మై ఓటీటీ ప్రీమియర్ కానుందని సమాచారం. రొమాంటిక్, హారర్, లవ్, అడ్వెంచర్, సర్వైవల్ అంశాలున్న తు యా మై మూవీని మిస్ అయిన వాళ్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇంకో 20 రోజుల్లో ఎంచక్కా చూసేయొచ్చు.