Virender Sehwag Host Rise And Fall Season 2 OTT Streaming: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్' రెండో సీజన్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
వీరేంద్ర సెహ్వాగ్ హోస్టింగ్ బాధ్యతలు

మొదటి సీజన్‌లో అశ్నీర్ గ్రోవర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఈసారి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ హోస్టింగ్ బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది.
ఆ ముగ్గురు టీవీ స్టార్లతో పాటు రాజకీయ నాయకుడు!
వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ ఈ ఓటీటీ షోపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది ప్రముఖులు పోటీ పడనున్నారు. తాజాగా విడుదల చేసిన రైజ్ అండ్ ఫాల్ 2 ప్రోమోలో మేకర్స్ మొదటి నలుగురు కంటెస్టెంట్లను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక చాహర్ చౌదరి, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్, ప్రముఖ బుల్లితెర నటుడు కరణ్ పటేల్, రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనావల్లాలను ఈ సీజన్‌లో రంగంలోకి దించారు. ఈ నలుగురు ప్రోమోలోనే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ల్యాండ్ అయ్యారు.
రూలర్ నుంచి వర్కర్ వరకు
"నేను ఇప్పటివరకు రకరకాల రియాలిటీ షోలు చేశాను. కానీ 'రైజ్ అండ్ ఫాల్' సరికొత్త అనుభూతిని ఇస్తుంది. లగ్జరీ హౌజ్‌లో ఉండే రూలర్ నుంచి బేస్‌మెంట్‌లో కష్టపడే వర్కర్‌గా మారే కాన్సెప్ట్ నన్ను బాగా ఆకట్టుకుంది" అని సల్మాన్ ఖాన్‌తో ప్రశంసలు అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక చాహర్ చౌదరి చెప్పారు.
{{/usCountry}}"నేను ఇప్పటివరకు రకరకాల రియాలిటీ షోలు చేశాను. కానీ 'రైజ్ అండ్ ఫాల్' సరికొత్త అనుభూతిని ఇస్తుంది. లగ్జరీ హౌజ్‌లో ఉండే రూలర్ నుంచి బేస్‌మెంట్‌లో కష్టపడే వర్కర్‌గా మారే కాన్సెప్ట్ నన్ను బాగా ఆకట్టుకుంది" అని సల్మాన్ ఖాన్‌తో ప్రశంసలు అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక చాహర్ చౌదరి చెప్పారు.
{{/usCountry}}తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పే నటి స్వర భాస్కర్ స్పందిస్తూ.. "భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకే చోట చేరినప్పుడు వ్యూహాలు, అధికార పోరాటాలు కలగలసి డ్రామా పండుతుంది. ఈ ఆట ఎలా సాగుతుందో చూడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని వ్యాఖ్యానించారు.
గెలుపే లక్ష్యంగా దిగుతున్న కంటెస్టెంట్లు
తనలోని పోటీ తత్వాన్ని బయటకు తీయడానికే ఈ షోకు వచ్చానంటున్నారు బుల్లితెర హీరో కరణ్ పటేల్. "ఇన్నాళ్లూ నటుడిగా రకరకాల పాత్రల్లో నన్ను చూశారు. ఇప్పుడు నిజమైన కరణ్ పటేల్‌గా నా సత్తా చాటే అవకాశం వచ్చింది. ఇదొక పెద్ద సవాలు, కచ్చితంగా నా అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తాను" అని సీరియల్ హీరో కరణ్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ వేదికలపై వాగ్ధాటితో ఆకట్టుకునే షెహజాద్ పూనావల్లా తన ఎంట్రీపై స్పందిస్తూ.. "నా జీవితమే ఎత్తుపల్లాల కలయిక. భారత్‌ను, మన చరిత్రను తక్కువ చేసి మాట్లాడే వారిని నేను అసలు సహించను. అపరిచితులతో కలిసి వ్యూహాలు పన్నడం ఆసక్తికరంగా ఉంటుంది. రాబోయే ఆరు వారాల పాటు నాకు అద్దె భారం తగ్గడం సంతోషంగా ఉంది" అంటూ సరదాగా నవ్వేశారు.
ఏంటి ఈ గేమ్ షో కాన్సెప్ట్? ఎప్పటినుంచి ఓటీటీ స్ట్రీమింగ్?
బానిజయ్ ఆసియా సంస్థ నిర్మిస్తున్న ఈ షో కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంటుంది. పోటీదారులను 'రూలర్స్' (పాలకులు), 'వర్కర్స్' (శ్రామికులు) అనే రెండు వర్గాలుగా విభజిస్తారు. రూలర్స్ పెంట్‌హౌస్‌లో రాజభోగాలు అనుభవిస్తే, వర్కర్లు బేస్‌మెంట్‌లో ఉంటూ కష్టపడాల్సి ఉంటుంది.
వ్యూహాల ఆధారంగా స్థానాల మార్పు
ఆటలో వారు తీసుకునే నిర్ణయాలు, వేసే వ్యూహాల ఆధారంగా స్థానాలు మారుతుంటాయి. మొదటి సీజన్‌లో ప్రముఖ బుల్లితెర హీరో అర్జున్ బిజ్లానీ విజేతగా నిలిచారు. ఇకపోతే అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్ వంటి రెండు ఓటీటీల్లో రైజ్ అండ్ ఫాల్ 2 స్ట్రీమింగ్ కానుంది.
రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్
సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎమ్ఎక్స్ ప్లేయర్‌లలో రైజ్ అండ్ ఫాల్ 2 ఉచితంగా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీంతో క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాహ్ హోస్ట్‌గా చేస్తున్న ఈ షోను ఎంచక్కా ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు.