...
...
Next Story

Mouni Roy: భర్తతో విడాకులు, కారులో ఎక్కిన వదలని కెమెరామెన్- వేలు చూపిస్తూ విశ్వంభర నటి మౌనీ రాయ్ వార్నింగ్

Mouni Roy Warning To Photographers: ముంబై వీధుల్లో పాపారాజీల అత్యుత్సాహంపై చిరంజీవి విశ్వంభర నటి మౌనీ రాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కారులోకి వెళ్లినా వదలకుండా కెమెరాలను మొహానికి గురిపెట్టడంతో కోపంతో ఊగిపోతూ వేలు చూపిస్తూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Published on: Jul 16, 2026, 20:50:20 IST
Advertisement

Mouni Roy Warning To Photographers: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం, వారిని అనుక్షణం కెమెరాల్లో బంధించాలని చూడటం ముంబై పాపారాజీలకు (కెమెరామెన్) అలవాటుగా మారింది. అయితే, కొన్నిసార్లు ఈ అత్యుత్సాహం శ్రుతి మించుతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి మౌనీ రాయ్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

వీడియో వైరల్

భర్తతో విడాకులు, కారులో ఎక్కిన వదలని కెమెరామెన్- వేలు చూపిస్తూ విశ్వంభర నటి మౌనీ రాయ్ వార్నింగ్
భర్తతో విడాకులు, కారులో ఎక్కిన వదలని కెమెరామెన్- వేలు చూపిస్తూ విశ్వంభర నటి మౌనీ రాయ్ వార్నింగ్

ముంబై వీధుల్లో మీడియా ప్రతినిధులు హద్దులు దాటి ప్రవర్తించడంతో మౌనీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా మందలించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హద్దులు దాటిన ఫొటోగ్రాఫర్లు.. కారులోనూ వదల్లేదు!

ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఒక రెస్టారెంట్‌కు తన స్నేహితురాలు, వీజే అనుషా దండేకర్‌తో కలిసి మౌనీ రాయ్ వెళ్లారు. విందు ముగించుకుని బయటకు వచ్చే క్రమంలో అక్కడే వేచి ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. మొదట్లో మౌనీ రాయ్ శాంతంగానే కారు వైపు నడిచారు.

అయితే, ఆమె కారులో కూర్చున్న తర్వాత కూడా విపరీతంగా ఫ్లాష్ లైట్లు వేస్తూ, కిటికీ అద్దాల గుండా కెమెరాలను లోపలికి పెట్టి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రవర్తనతో తీవ్ర అసౌకర్యానికి గురైన మౌనీ రాయ్ సహనం కోల్పోయారు. కోపంతో ఊగిపోతూ, కారు కిటికీలోంచి ఫొటోగ్రాఫర్ల వైపు చూస్తూ గట్టిగా అరిచారు.

బంద్ చేయండి..

"కెమెరాలు బంద్ చేయండి" అని మౌనీ రాయ్ వేలు చూపిస్తూ గట్టిగా హెచ్చరించారు. అయినప్పటికీ వారు ఫొటోలు తీయడం ఆపలేదు. పరిస్థితిని గమనించిన ఆమె స్నేహితురాలు అనుషా దండేకర్ మధ్యలో జోక్యం చేసుకున్నారు. మౌనీని శాంతింపజేసే ప్రయత్నం చేస్తూనే, కెమెరాలను ఆపివేయాల్సిందిగా ఫొటోగ్రాఫర్లకు సైగలు చేశారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా మౌనీ రాయ్ సుపరిచితమే. బుల్లితెరపై సంచలనం సృష్టించిన 'నాగిని' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా దగ్గరయ్యారు. అలాగే రణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర' సినిమాలో విలన్‌గా ఆమె చూపించిన అద్భుత నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో కూడా మౌనీ రాయ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

విడాకుల ప్రకటన.. కెరీర్ అప్‌డేట్స్

ఇక మౌనీ రాయ్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె ఇటీవల వరుణ్ ధావన్ సరసన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించారు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.

అలాగే ఓటీటీ వేదికగా విడుదలైన 'అబ్ హోగా హిసాబ్' అనే వెబ్ సిరీస్‌లోనూ, సంజయ్ దత్ నటించిన 'ది భూత్నీ' అనే చిత్రంలోనూ మౌనీ రాయ్ మెరిశారు. ప్రస్తుతం మధుర్ భండార్కర్ దర్శకత్వంలో 'ది వైవ్స్' అనే సినిమాలో నటిస్తున్నారు.

నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి

వ్యక్తిగత జీవితంలోనూ మౌనీ రాయ్ ఇటీవల కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తన భర్త, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

విడాకుల నేపథ్యంలో ఇలా

పరస్పర అవగాహనతోనే విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత ప్రైవసీని గౌరవించాలని కోరిన కొద్దిరోజుల్లోనే ముంబై వీధుల్లో ఆమెకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం గమనార్హం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe