Weight loss : కడుపు మాడ్చుకోకుండానే 25 కేజీలు తగ్గిన ఫిట్​నెస్​ కోచ్! ఎలా సాధ్యమైంది?

కఠినమైన డైటింగ్‌లు, కష్టతరమైన వ్యాయామాలు చేయకుండానే కేవలం ఆరు నెలల్లో 25 కిలోల బరువు తగ్గానని ఫిట్‌నెస్ నిపుణుడు జీ అలీ వెల్లడించారు. 101 కిలోల నుంచి 76 కిలోలకు తగ్గేందుకు తనకు సహాయపడిన ఆ మూడు జీవనశైలి అలవాట్లను ఆయన పంచుకున్నారు. అవి..

Published on: Jun 29, 2026, 07:28:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బరువు తగ్గడం అనగానే చాలామంది నోరు కట్టేసుకోవాలని, గంటల తరబడి జిమ్‌లో చెమటలు చిందించాలని భావిస్తారు. కానీ, ఎటువంటి కఠినమైన నియమాలు లేకుండా, సులభమైన అలవాట్లతోనే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణుడు జీషాన్ అలీ. తన 46 ఏళ్ల వయసులో కేవలం 24 వారాల్లో (6 నెలలు) ఏకంగా 25 కిలోల బరువు తగ్గి.. మరింత ఫిట్‌గా, ఆరోగ్యంగా మారారు.

24 వారాల్లో 25 కేజీలు తగ్గిన జీషాన్ అలీ.. (Instagram/@_zeeali1)
24 వారాల్లో 25 కేజీలు తగ్గిన జీషాన్ అలీ.. (Instagram/@_zeeali1)

"కడుపు నిండిన భావన కలగకపోతే లేనిపోని క్రేవింగ్స్ వస్తాయి. ఆ క్రేవింగ్స్ వల్ల జంక్ ఫుడ్ తింటాం, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే నేను ఆకలిని నియంత్రించే మూడు సులువైన సూత్రాలను పాటించాను," అని జీ అలీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

24 కేజీలు తగ్గిన ఫిట్​నెస్​ కోచ్- ఏం చేశారంటే..

1. నిద్రకు ప్రాధాన్యత.. తగినంత నీరు

బరువు తగ్గడంలో నిద్ర, నీరు అత్యంత శక్తివంతమైన ఆయుధాలని జీ అలీ చెప్పారు. ఆయన రోజూ రాత్రి 10:30 గంటలకల్లా పడుకునేవారు. అలాగే రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగేవారు. తగినంత నిద్రపోవడం వల్ల శరీరానికి పూర్తి శక్తి లభిస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల అనవసరపు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం.

2. క్రమశిక్షణతో కూడిన దినచర్య

జీవితంలో ప్లానింగ్ ఉంటేనే అనుకున్నది సాధించగలమని ఆయన నమ్ముతారు. మన దినచర్యను ముందుగానే ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ పనులను క్రమం తప్పకుండా చేయగలుగుతాము అని అంటున్నారు. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు జిమ్‌కు వెళ్లాలి, ఎప్పుడు వాకింగ్ చేయాలి అనేది ఒక డైరీలో రాసుకుని పెట్టుకోవడం వల్ల రోజువారీ పనులపై పూర్తి నియంత్రణ ఉంటుందని చెబుతున్నారు.

3. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం

ఆకలిని నియంత్రించడంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. జీ అలీ బరువు తగ్గే క్రమంలో ఆహారం పరిమాణాన్ని తగ్గించినప్పటికీ, ప్రొటీన్ శాతాన్ని మాత్రం తగ్గించలేదు. ఆయన ప్రతిరోజూ 180-200 గ్రాముల ప్రొటీన్ తీసుకునేవారు. ఇది కండరాలు కరిగిపోకుండా కాపాడటమే కాకుండా, క్రేవింగ్స్‌ను తగ్గించి, మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది.

ఎలాంటి కఠినమైన డైటింగ్ చేయకుండా, ఆకలితో అలమటించకుండా కేవలం ఒకే రొటీన్‌ని ప్రతిరోజూ అనుసరించడం ద్వారానే తాను 101 కిలోల నుంచి 76 కిలోలకు తగ్గానని, 46 ఏళ్ల వయసులో ఎంతో సంతోషంగా, దృఢంగా ఉన్నానని అలీ వివరించారు.

గమనిక: జీ అలీ అనుభవం నిద్ర, నీరు, ప్రొటీన్ ప్రాధాన్యతను తెలియజేస్తున్నప్పటికీ.. ప్రతి వ్యక్తి వయసు, శరీర బరువు, శారీరక శ్రమను బట్టి ప్రొటీన్ అవసరాలు మారుతుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఒకసారి క్వాలిఫైడ్ డైటీషియన్ లేదా హెల్త్‌కేర్ నిపుణులను సంప్రదించి సరైన ప్లాన్ తీసుకోవడం మంచిది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More