Weight Loss : 6 నెలల్లో 32 కేజీలు తగ్గిన 48ఏళ్ల వ్యక్తి! ఈ టిప్స్​ ఫాలో అయితే మీరు కూడా..

Weight loss tips : 48ఏళ్ల వ్యక్తి కొన్ని మార్పులతో 6 నెలల్లో ఏకంగా 32 కేజీల బరువు తగ్గారు. ఫలితంగా ఆయన తన లైఫ్​ని ప్రశాంతంగా ఎంజాయ్​ చేస్తున్నారు. ఆ వయస్సులో అంత వెయిట్​లాస్​ ఎలా సాధ్యమైంది? ఆయన ఏం చేశారు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Apr 14, 2026, 11:21:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Diet plan for Weight loss : బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది! వ్యాయామాలు చేయకపోవడం, ఫుడ్​ క్రేవింగ్స్​ని కంట్రోల్​ చేసుకోలేకపోవడం వంటివి ఇప్పుడు చాలా మందిలో సర్వసాధారణ విషయాలు. ఫలితంగా ఇంకా బరువు పెరిగిపోతుంటారు. కానీ వాటన్నింటినీ దాటుకుని పట్టుదలతో శ్రమిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో నిరూపించారు ఓ 48 ఏళ్ల అమెరికన్ కేవలం ఆరు నెలల్లో 128 కిలోల నుంచి 96 కిలోలకు తగ్గి తన జీవితాన్నే మార్చుకున్నారు!

6 నెలల్లో 32 కేజీలు తగ్గిన వ్యక్తి..
6 నెలల్లో 32 కేజీలు తగ్గిన వ్యక్తి..

వ్యాపార పనుల్లో బిజీగా ఉంటూ, పిల్లల స్పోర్ట్స్ టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నా.. డేవిడ్ తన ఆరోగ్యం విషయంలో అసంతృప్తిగా ఉండేవారు. 128 కిలోల బరువుతో ప్రయాణాలు చేయడం, విమానంలో కూర్చోవడం, నచ్చిన బట్టలు వేసుకోవడం అతనికి ఒక పీడకలలా మారాయి. ఒత్తిడి పెరిగినప్పుడల్లా జంక్ ఫుడ్ తినడం అతనికి అలవాటుగా మారింది. కానీ, ఫిట్​నెస్ కోచ్ కెవ్ మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు.

డేవిడ్ 6 నెలల్లో 32 కేజీల బరువు ఎలా తగ్గారు? ఇక్కడ తెలుసుకోండి..ే

బరువు తగ్గడానికి కోచ్ కెవ్ సూచించిన ‘గ్రోసరీ లిస్ట్’..

సరైన ఆహారం ఎంచుకోవడమే బరువు తగ్గడంలో తొలి అడుగు. కోచ్ కెవ్ సూచించిన కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఇవే:

ప్రోటీన్లు: చికెన్ బ్రెస్ట్, సాల్మన్ చేపలు, గుడ్లు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్​, వే ప్రోటీన్.

కార్బోహైడ్రేట్లు: తెల్ల అన్నం, చిలగడదుంపలు, ఓట్స్, లో-కేలోరీ టోర్టిల్లాలు.

కూరగాయలు: బ్రోకలీ, మిర్చి, పాలకూర, బీన్స్ (వీటిని ఎంతైనా తినవచ్చు).

సప్లిమెంట్స్: క్రియేటిన్, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్.

బరువు తగ్గేందుకు రోజువారీ ఆహార ప్రణాళిక..

అధిక ప్రోటీన్, సమతుల్య ఆహారమే ఈ విజయానికి కీలకం:

మీల్ 1 (ఉదయం): ప్రోటీన్ షేక్‌తో గ్రీక్ యోగర్ట్ లేదా 3 గుడ్లు.

మీల్ 2 (మధ్యాహ్నం): అన్నం, బ్రోకలీతో చికెన్ లేదా వెజిటబుల్స్‌తో సాల్మన్ చేపలు.

మీల్ 3 (రాత్రి): పొటాటోస్, సిర్లాయిన్ స్టీక్ లేదా మిక్స్డ్ వెజిటబుల్స్‌తో రొయ్యలు.

ఫలితాల కోసం పాటించాల్సిన నియమాలు..

నిలకడైన మార్పు కోసం ఈ రోజువారీ దినచర్యను పాటించాలని కోచ్ కెవ్ సూచిస్తున్నారు:

నిద్ర: రాత్రి 10 గంటలకల్లా నిద్రపోయి, ఉదయం 5:30 కల్లా నిద్రలేవాలి.

అలవాట్లు: మద్యపానానికి దూరంగా ఉండాలి. రాత్రి 7 గంటల తర్వాత ఆహారం తీసుకోకూడదు.

వ్యాయామం: రోజుకు కనీసం 8,000 అడుగులు నడవాలి. వారానికి 3-4 సార్లు 45 నిమిషాల పాటు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయాలి.

సూర్యరశ్మి: ఉదయం 30 నిమిషాల పాటు ఎండలో గడపాలి, రోజుకు రెండుసార్లు బయట నడవాలి.

హైడ్రేషన్: శరీరానికి సరిపడా నీరు, ఎలక్ట్రోలైట్స్ అందేలా చూసుకోవాలి.

డేవిడ్ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ట్రిప్స్​కి వెళుతున్నప్పుడు తనకి నచ్చిన బట్టలు వేసుకుని, విమానంలో ఎలాంటి ఆందోళన లేకుండా ప్రయాణించడం తనకి దక్కిన అతిపెద్ద విజయమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. 48 ఏళ్ల వయసులో ఇంత వేగంగా బరువు తగ్గడం సాధ్యమేనా?

అవును. డేవిడ్ ఉదాహరణే అందుకు సాక్ష్యం. క్రమశిక్షణ కలిగిన ఆహారం, నిలకడైన వ్యాయామంతో వయసుతో సంబంధం లేకుండా ఫలితాలు సాధించవచ్చు.

2. బరువు తగ్గడానికి ప్రోటీన్ ఎందుకు ముఖ్యం?

ప్రోటీన్ కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తుంది. దీనివల్ల అనవసరమైన జంక్ ఫుడ్ తినడం తగ్గుతుంది.

3. వ్యాయామం లేకుండా కేవలం డైట్‌తో బరువు తగ్గొచ్చా?

డైట్‌తో బరువు తగ్గొచ్చు, కానీ శరీర ఆకృతి సరిగ్గా ఉండాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్, నడక చాలా అవసరం.

4. రాత్రి 7 గంటల తర్వాత ఆహారం ఎందుకు తినకూడదు?

పడుకునే ముందు భారీగా తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. త్వరగా తినడం వల్ల శరీరం కొవ్వును కరిగించడానికి ఎక్కువ సమయం కేటాయించగలుగుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More