Weight loss : 2 నెలల్లో 22 కేజీల బరువు తగ్గడం ఎలా? ‘హై-ప్రోటీన్’ వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే..
కేరళకు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ షిబిన్ మాథ్యూ కేవలం 2 నెలల్లో 22 కిలోల బరువు తగ్గి వార్తల్లో నిలిచారు. 110 కేజీల నుంచి 88 కేజీలకు తగ్గేందుకు ఆయన అనుసరించిన ‘హై-ప్రోటీన్ డైట్ ప్లాన్’ వివరాలు, ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు ఇక్కడ తెలుసుకోండి..
బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు.. దానికి పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ ఎంతో అవసరం. అయితే, ఎలాంటి షార్ట్‌కట్లు లేకుండా కఠినమైన నియమాలు పాటిస్తూ ఊహించని రీతిలో బరువు తగ్గి ఆశ్చర్యపరిచారు కేరళకు చెందిన యువ వ్యాపారవేత్త, డాక్టర్ షిబిన్ మాథ్యూ. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆయన ఏకంగా 22 కిలోల బరువు తగ్గి అందరినీ షాక్‌కు గురిచేశారు.

110 కిలోల బరువున్న షిబిన్.. కేవలం 60 రోజుల్లో 88 కిలోలకు చేరుకున్నారు. తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంతో తాను సాధించిన ఈ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని, అందుకు పాటించిన రోజువారీ డైట్ చార్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఈ క్రమశిక్షణను పాటించడం చాలా కష్టంగా అనిపించింది, కానీ రిజల్ట్ మాత్రం కళ్లముందే ఉంది," అంటూ ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
డాక్టర్ షిబిన్ మాథ్యూ ‘హై-ప్రోటీన్’ డైలీ డైట్ చార్ట్:
60 రోజుల ట్రాన్స్‌ఫార్మేషన్ సమయంలో తాను ప్రతీరోజు తీసుకున్న ఆహార వివరాలను ఆయన వివరించారు:
ఉదయం (టిఫిన్): ఒక కప్పు కాఫీ, 2 గుడ్లు, దీనికి తోడు కొంత చిల్లీ ఆయిల్ జోడించిన 2 స్కూప్స్ హై-ప్రోటీన్ యోగర్ట్ .
మధ్యాహ్నం (లంచ్): ఒక చికెన్ బ్రెస్ట్ పీస్, ఒక గుడ్డు, ఒక స్కూప్ హై-ప్రోటీన్ పెరుగు, కొద్దిగా తాజా కీర దోసకాయ ముక్కలు.
సాయంత్రం: ఒక కప్పు కాఫీ.
రాత్రి (డిన్నర్): కేవలం ఒక యాపిల్ మాత్రమే.
తన ఫిట్‌నెస్ మంత్రాన్ని చెబుతూ.. "కఠినమైన క్యాలరీ డిఫిసిట్, ఎక్కువ ప్రోటీన్, నెపాలు వెతుక్కోకపోవడం.. ఇవే నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. మరి మీ ట్రాన్స్‌ఫార్మేషన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు?" అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.
గుడ్డిగా ఫాలో కాకండి!
తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి షిబిన్ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. ఈ డైట్ ప్లాన్ తన వ్యక్తిగత శరీర తత్వానికి, లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించుకున్నదని, అందరికీ ఇది సరిపోకపోవచ్చని స్పష్టం చేశారు. "ఇది నా కోసం నేను అనుసరించిన అత్యంత వేగవంతమైన, కఠినమైన డైట్. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ, ఎలాంటి ఎక్స్‌ట్రీమ్ డైట్ మొదలుపెట్టినా నిపుణుల సలహా తప్పక తీసుకోండి," అని కోరారు.
వైద్య నిపుణులు కూడా ఇలాంటి క్రాష్ లేదా ఎక్స్‌ట్రీమ్ క్యాలరీ డిఫిసిట్ డైట్లను నేరుగా అనుసరించవద్దని సూచిస్తున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతున్నాయా లేదా చూసుకుంటూ, సమతుల్యాహారం ద్వారా నిలకడగా బరువు తగ్గడమే ఆరోగ్యకరమైన పద్ధతి అని చెబుతున్నారు. ఏదైనా పెద్ద మార్పులు చేసే ముందు క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ లేదా డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని స్పష్టం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


