Weight loss tips : 92 టు 60- ఏకంగా 32 కేజీలు తగ్గిన మహిళ! ఈ ఐదు ఫుడ్స్‌కి దూరంగా ఉండటం వల్లే..
Wight loss diet : ఎలాంటి ఖరీదైన డైట్ ప్లాన్స్ లేకుండా కేవలం ఇంట్లో వండే భోజనంతోనే ఒక సాధారణ గృహిణి 32 కిలోల బరువు తగ్గి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆమె తన ఆహార అలవాట్ల నుంచి దూరం పెట్టిన ఐదు ముఖ్యమైన పదార్థాల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాము..
బరువు తగ్గడం అనేది నేటి కాలంలో చాలామందికి ఒక పెద్ద సవాలుగా మారింది. జిమ్‌లలో గంటల తరబడి చెమటోడ్చడం, వేల రూపాయలు ఖర్చు చేసి డైటీషియన్ల చుట్టూ తిరగడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. అయితే, బరువు తగ్గాలనే ప్రయాణం మన ప్లేటులో ఉండే ఆహారాన్ని మార్చడంతోనే మొదలవుతుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతుంటారు. పెద్ద పెద్ద ఖరీదైన ప్లాన్లు లేకుండా, కేవలం మన వంటగదిలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు గురుగ్రామ్‌కు చెందిన దీప్తి హర్షానా అనే ఓ సాధారణ తల్లి.

ఇటీవల ఇన్స్టాగ్రామ్ రీల్‌లో ఆమె పంచుకున్న తన వెయిట్ లాస్ జర్నీ ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం 11 నెలల వ్యవధిలోనే ఆమె ఏకంగా 32 కిలోల బరువు తగ్గారు. ఒకప్పుడు 92 కిలోల బరువుతో ఉన్న దీప్తి, ఏడాది తిరక్కుండానే 60 కిలోల నాజూకైన రూపానికి వచ్చేశారు!
ఇందుకోసం ఆమె డైట్ నుంచి పూర్తిగా తొలగించిన ఆ ఐదు సాధారణ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము.
1. పంచదార పానీయాలు..
బరువు తగ్గడానికి దీప్తి తీసుకున్న మొదటి నిర్ణయం తీపి పానీయాలను పూర్తిగా పక్కన పెట్టడం! కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, శీతల పానీయాలలో క్యాలరీలు విపరీతంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును పెంచడమే కాకుండా, వాటర్ రిటెన్షన్ (శరీరంలో నీరు నిలిచిపోవడం) సమస్యకు దారితీస్తాయి. దీనివల్ల ముఖం ఉబ్బినట్లు తయారవుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా ఆమె నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను అలవాటు చేసుకుంది.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేసవిలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ లభించే కొబ్బరి నీళ్లు బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి.
2. వైట్ బ్రెడ్..
ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌గా చాలామంది వైట్ బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ, మైదాతో తయారయ్యే ఈ వైట్ బ్రెడ్‌లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచి, కొవ్వు నిల్వలు పేరుకుపోయేలా చేస్తాయి. అందుకే దీప్తి వైట్ బ్రెడ్‌ను పూర్తిగా మానేసి, దాని స్థానంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, ఓట్స్ వంటి పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకున్నారు.
3. ప్యాకేజ్డ్ స్నాక్స్..
చిరుతిళ్ల రూపంలో తినే పొటాటో చిప్స్, కుర్కురే, బిస్కెట్లు వంటి ప్యాక్ చేసిన స్నాక్స్‌కు దీప్తి రెడ్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు (సోడియం), క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరానికి కారణమవ్వడమే కాకుండా, పదే పదే ఆకలి వేసేలా చేస్తాయి. వీటికి బదులుగా ఆమె వేయించిన శనగలు, డ్రై ఫ్రూట్స్, తామర గింజలు తినడం ప్రారంభించింది. ఇవి తక్కువ క్యాలరీలతో ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచుతాయి.
4. నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్..
బయట దొరికే బజ్జీలు, సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ల వంటి జంక్ ఫుడ్‌ను ఆమె ముట్టుకోలేదు. వీటిలోని అధిక కొవ్వు పదార్థాలు మనిషిని బద్ధకంగా మారుస్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తయారు చేసుకునే హెల్తీ వెజిటబుల్ రోల్స్, పనీర్ లేదా చికెన్ టిక్కా, మన పాతకాలపు పద్ధతిలో వండుకునే సాధారణ ఇంటి భోజనాన్ని ఆమె ప్రిఫర్ చేశారు.
5. అర్ధరాత్రి చిరుతిళ్లు..
చాలామందికి రాత్రిపూట నిద్రపోయే ముందు లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూ ఏదో ఒకటి నమలడం అలవాటు ఉంటుంది. ఈ మైండ్ లెస్ ఈటింగ్ (ఆలోచన లేకుండా తినడం) వల్ల శరీరానికి అవసరం లేని అదనపు క్యాలరీలు చేరిపోతాయి. ఈ అలవాటును మానుకుని, రాత్రి వేళల్లో ఆకలిగా అనిపిస్తే హెర్బల్ టీ తాగాలని దీప్తి సూచిస్తున్నారు.
హోమ్ మేడ్ ఫుడ్ - 45 నిమిషాల వర్కవుట్..
మరొక వీడియోలో దీప్తి తన దినచర్యను వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. "నేను ఎలాంటి ఫ్యాన్సీ డైట్ ప్లాన్లను ఫాలో అవ్వలేదు, ఏ డైటీషియన్ దగ్గరకూ వెళ్లలేదు. నా వెయిట్ లాస్ అంతా కేవలం ఇంట్లో వండిన సాధారణ భోజనం, రోజుకు 45 నిమిషాల పాటు చేసిన వ్యాయామం వల్లే సాధ్యమైంది," అని దీప్తి చెబుతున్నారు.
మన చుట్టూ ఉన్న స్థానిక వాతావరణానికి, మన సంస్కృతికి సరిపోయే ఇంటి భోజనమే ఆరోగ్యానికి ఉత్తమమైనదని ఈమె ప్రయాణం నిరూపిస్తోంది. క్రమశిక్షణ, సరైన ఆహార నియమాలు ఉంటే జిమ్‌లకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి బరువు తగ్గొచ్చని దీప్తి హర్షానా గృహిణులకు సరికొత్త స్ఫూర్తినిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


