...
...
Next Story

OTT Horror: ఓటీటీలోకి నేరుగా డిఫరెంట్ హారర్ థ్రిల్లర్- ఇంట్రెస్టింగ్‌గా 40 దెయ్యాల మిస్టరీ కథ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ali Baba Aur 40 Bhoot OTT Streaming: చిన్నప్పుడు విన్న అలీబాబా 40 దొంగల కథను వినూత్నంగా దెయ్యాల కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. షేన్ నిగమ్, విశాల్ వశిష్ట, ఆశా నేగీ నటించిన అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీలోకి వచ్చేయనుంది. 40 భూతాల కథతో తెరకెక్కిన అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Aug 31, 2026, 05:31:09 IST
Advertisement

Ali Baba Aur 40 Bhoot OTT Release: చిన్నతనంలో ‘అలీబాబా 40 దొంగలు’ కథ వినని వారు ఉండరు. కొండ గుహలు, వింత నిధులు, 'ఖుల్ జా సిమ్ సిమ్' అనే మంత్రం మన చిన్ననాటి జ్ఞాపకాల్లో భాగంగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ టైటిల్‌తో తెలుగులో సినిమాలు కూడా వచ్చాయి.

ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్ సినిమాలు

ఓటీటీలోకి నేరుగా డిఫరెంట్ హారర్ థ్రిల్లర్- ఇంట్రెస్టింగ్‌గా 40 దెయ్యాల మిస్టరీ కథ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నేరుగా డిఫరెంట్ హారర్ థ్రిల్లర్- ఇంట్రెస్టింగ్‌గా 40 దెయ్యాల మిస్టరీ కథ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సీనియర్ ఎన్టీఆర్ హీరోగా అలీబాబా 40 దొంగలు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా అలీబాబా అరడజన్ దొంగలు వంటి టైటిల్స్‌తో తెలుగులో సినిమాలు వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. అయితే, ఇప్పుడే సరికొత్తగా 40 దొంగలు కాకుండా 40 భూతాల కథ నేరుగా ఓటీటీలోకి రానుంది.

‘అలీబాబా ఔర్ 40 భూత్’ అనే టైటిల్‌తో సరికొత్తగా హారర్ కామెడీ మిస్టరీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలో సందడి చేయనుంది. ఇటీవల అలీబాబా ఔర్ 40 భూత్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగానే అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు.

గ్లింప్స్ కేక.. భయం, ఉత్కంఠ కలగలిపి!

ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ తాజాగా విడుదల చేసిన చిన్న వీడియో గ్లింప్స్ హారర్ ప్రియుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అసలు కథను పూర్తిగా చూపించకుండానే ఈ ఓటీటీ సిరీస్ ఎంత థ్రిల్లింగ్‌గా ఉండనుందో ఆ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. హీరోయిన్ తలుపు చాటు నుంచి భయంగా, అనుమానంగా తన తండ్రి కోసం బయటకు చూస్తున్న దృశ్యంతో ఈ గ్లింప్స్ మొదలవుతుంది.

అలీబాబా అంటే ఒక్కరు కాదని హీరో హీరోయిన్ ఇద్దరు అని చెప్పి ఆసక్తి కలిగించారు. ఆ తర్వాత ఇంట్లో 40 బొమ్మలు కనిపించడం, వాటిని వరుస క్రమంలో పెట్టే ఓ చోటు, అనంతరం దెయ్యాల ఎంట్రీ, ఒక్కొక్కరు వింతగా ప్రవర్తించడం వంటి సీన్లు బాగా ఆకట్టుకున్నాయి.

క్లాసిక్ కథకు హారర్ ట్విస్ట్

సాధారణంగా అలీబాబా కథ అనగానే ఖజానా దోపిడీ చేసే దొంగల చుట్టూ తిరుగుతుంది. కానీ, ఈ ఓటీటీ స్పెషల్ సిరీస్‌లో 40 మంది దొంగలకు బదులుగా 40 దెయ్యాలను ప్రవేశపెట్టడం అత్యంత ఆసక్తికరంగా ఉంది. అదృశ్యమైన తండ్రిని వెతికే క్రమంలో హీరోలకు ఎదురయ్యే వింత అనుభవాలు, మిస్టరీ ఘట్టాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న షేన్ నిగమ్‌తో పాటు విశాల్ వశిష్ట, ఆశా నేగీ, దాస్ మృదుల్ రామన్, రామన్ దీప్ యాదవ్, అభయ్ మహాజన్, జాయ్ సేన్‌గుప్తా, మాన్సీ సెహగల్, ఉజ్జ్వల్ చోప్రా వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీలోకి హారర్ ప్రియులను ఎంటర్‌టైన్ చేసేందుకు సెప్టెంబర్ రెండో వారంలో వచ్చేస్తుంది. జియో హాట్‌స్టార్‌లో అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 11 నుంచి హాట్‌స్టార్‌లో అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

"తమ తండ్రి ఆచూకీ కోసం వెతుకుతున్న అలీ, బాబాలు ఈ 40 మంది దెయ్యాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించగలరా?" అని జియో హాట్‌స్టార్ అధికారికంగా ప్రశ్నించడం ప్రేక్షకులలో ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లింది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

దెయ్యాల భయంతో పాటు కాస్త హ్యూమర్, ఎమోషన్ మేళవించి రూపుదిద్దుకున్న ఈ ఓటీటీ సిరీస్ డిజిటల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. 40 దెయ్యాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? హీరోయిన్ తండ్రి ఏమయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి రానున్న అలీబాబా ఔర్ 40 భూత్ కోసం వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks