ఓటీటీలో ప్రతి వారం వివిధ జోనర్లలో, డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ, ఈ వారం ఏకంగా 50 వరకు మూవీస్ ఓటీటీలోకి వచ్చేశాయి. అందులోనూ ఇవాళ అంటే మార్చి 5న ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా

వాటిలో చూడాల్సిన కొన్ని తెలుగు మూవీస్ ఓటీటీ ఆడియెన్స్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. అలాంటి వాటిలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన తెలుగు సినిమా ఒకటి ఉంది. ఆ మూవీ పేరే అనగనగా ఆస్ట్రేలియాలో. పూర్తిగా కొత్త నటీనటులతో ఈ సినిమాను రూపొందించారు.
అంతేకాకుండా టైటిల్‌కు తగినట్లుగానే సినిమా షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలోనే చేశారు. అంతా కొత్తవారితో, పూర్తిగా ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అంతా కొత్త వాళ్లు కావడంతో ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదల అయిందో, వెళ్లిపోయిందో ఆడియెన్స్‌కు తెలియకుండా పోయింది.
అనగనగా ఆస్ట్రేలియాలో హీరోహీరోయిన్లు
గతేడాది 2025 మార్చిలో అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ థియేటర్లలో విడుదల అయింది. జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు అనగనగా ఆస్ట్రేలియాలో మూవీలో అగ్రజ లక్ష్మీ, చంద్ర కొమ్మల్‌పేట్, జేడీఆర్ చెరుకూరు, ప్రభ అగ్రజ, సందీప్ బెల్లంకొండ, మణి దీపక్ కదిమిసెట్టి ఇతర కీలక పాత్రలు పోషించారు.
అనగనగా ఆస్ట్రేలియాలో మూవీకి తారకరామ దర్శకత్వం వహించారు. యూవీ నిరంజన్ సంగీతం అందించిన ఈ సినిమాను క్రైమ్, బోల్డ్, సస్పెన్స్ అంశాలతో థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా అంతా ఓ సీక్రెట్ చుట్టూ సాగుతుంది. ఆ సీక్రెట్ హీరోయిన్‌కు దొరుకుతుంది. ఆ దొరికిన సీక్రెట్‌తో హీరోయిన్ ఏం చేసిందన్నదే అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా కథ.
ఐఎమ్‌డీబీ రేటింగ్
గతేడాది మార్చిలో విడుదలైన అనగనగా ఆస్ట్రేలియాలో సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.9 రేటింగ్ వచ్చింది. ఏడాది తర్వాత అనగనగా ఆస్ట్రేలియాలో ఓటీటీలోకి ఇవాళ (మార్చి 6) వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేటి నుంచి అనగనగా ఆస్ట్రేలియాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}గతేడాది మార్చిలో విడుదలైన అనగనగా ఆస్ట్రేలియాలో సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.9 రేటింగ్ వచ్చింది. ఏడాది తర్వాత అనగనగా ఆస్ట్రేలియాలో ఓటీటీలోకి ఇవాళ (మార్చి 6) వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేటి నుంచి అనగనగా ఆస్ట్రేలియాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}బోల్డ్, లవ్, క్రైమ్ సీన్స్‌తో పాటు కొద్దిగా బూతులు ఉన్న అనగనగా ఆస్ట్రేలియాలో సినిమాలో హీరో క్యాబ్ డ్రైవర్‌గా చేస్తుంటే హీరోయిన్ అక్కడే చదువుకుంటూ పాకెట్ మనీ సంపాదిస్తుంది.
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్
మరోవైపు భారత్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు తన కుమారుడుని పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఆ పొలిటిషియన్ సీక్రెట్ ఒకటి తన దగ్గర ఉందని ఆస్ట్రేలియా నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసుకుని, వారిని చంపేయమని ఓ కిల్లర్‌కు కాంట్రాక్ట్ అప్పగిస్తాడు సదరు రాజకీయ వేత్త.
ఈ క్రమంలో ఆ సీక్రెట్ హీరోయిన్‌కు దొరుకుతుంది. ఆ సీక్రెట్‌తో హీరోయిన్ ఓ ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ఏంటీ?, అందుకు హీరో ఎలా సహాయం చేశాడు?, అసలు ఆ సీక్రెట్ ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఆహాలో ఓటీటీ రిలీజ్ అయిన అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ చూడాల్సిందే.