...
...
Next Story

OTT Horror: ఓటీటీలో తెలుగులో గుండేజారిపోయే హారర్ థ్రిల్లర్- ఒక్కరికే ముగ్గురు భార్యలు, అత్తారింట్లో కోడళ్లు, మామ చావు!

Ayyana Mane OTT Streaming In Telugu: ముగ్గురు కోడళ్ల విచిత్ర మరణాలు, అడుగుపెట్టగానే అత్తారింట్లో ఘోరం.. ఊహించని మలుపులతో సాగే హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ అయ్యన మనే ఓటీటీలో భయపెడుతోంది. ప్రతి నిమిషం ఉత్కంఠ రేపే సిరీస్ అయ్యన మనే ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఐఎమ్‌డీబీ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 25, 2026, 14:58:46 IST
Advertisement

Ayyana Mane OTT Release In Telugu: హర్రర్, సస్పెన్స్, మిస్టరీ జోనర్ కథలను ఇష్టపడే సినీ ప్రియులకు ఓటీటీల్లో కంటెంట్‌కు కొదవలేదు. ఇటీవల డిజిటల్ వేదికలపై సరికొత్త కథాంశాలతో వస్తున్న హర్రర్ చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే బాటలో సీటు అంచున కూర్చోబెడుతూనే భయపెట్టే హారర్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ ఒకటి ఆకట్టుకుంటోంది.

ఓటీటీలో అయ్యన మనే

ఓటీటీలో తెలుగులో గుండేజారిపోయే హారర్ థ్రిల్లర్- ఒక్కరికే ముగ్గురు భార్యలు, అత్తారింట్లో కోడళ్లు, మామ చావు!
ఓటీటీలో తెలుగులో గుండేజారిపోయే హారర్ థ్రిల్లర్- ఒక్కరికే ముగ్గురు భార్యలు, అత్తారింట్లో కోడళ్లు, మామ చావు!

అదే 'అయ్యన మనే' (Ayyana Mane) వెబ్ సిరీస్. కన్నడలో రూపొందిన ఈ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, అర్ధరాత్రి ఒంటరిగా చూస్తే మాత్రం గుండె ఆగినంత భయాన్ని కలిగించేలా ఉందని ఈ ఓటీటీ సిరీస్‌పై ఇప్పటికే ప్రశంసలు వచ్చాయి.

అత్తారింట్లో అడుగుపెట్టగానే విపత్తు..

అయ్యన మనే కథలోకి వెళితే.. జాజి అనే యువతికి దుష్యంత్ అనే వ్యక్తితో వివాహమవుతుంది. దుష్యంత్‌కు ఇదివరకే పెళ్లయిందని, అతని మొదటి భార్య అనుమానాస్పద రీతిలో మరణించిందనే విషయాన్ని అతడి కుటుంబ సభ్యులు జాజి దగ్గర దాచిపెడతారు.

పెళ్లయ్యాక జాజి తన అత్తారిల్లైన 'అయ్యన మనే' అనే రాజభవనం లాంటి ఇంటికి చేరుకుంటుంది. ఆశ్చర్యకరంగా, ఆమె ఆ ఇంట్లో కాలు పెట్టిన మరుక్షణమే మామగారు ప్రాణాలు కోల్పోతారు. ఈ విషాదం తర్వాత నుంచి అత్తారింట్లో పరిస్థితులు విచిత్రంగా మారతాయి. అలాగే, కుటుంబ సభ్యుల వింతగా ప్రవర్తిస్తుంటారు.

ఆ మూడు చావుల వెనుక నిగూఢ రహస్యం!

అదంతా జాజి గమనిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంట్లో పనిచేసే పనిమనిషి ద్వారా జాజికి ఒక దిగ్భ్రాంతికర విషయం తెలుస్తుంది. ఆ ఇంటికి కోడలిగా వచ్చిన మొదటి ముగ్గురు మహిళలు కూడా వింత పరిస్థితుల్లోనే మరణించారని తెలుస్తుంది.

ప్రతి ఎపిసోడ్‌లోనూ దర్శకుడు రమేష్ ఇందిరా ఊహించని మలుపులు జోడించి కథనాన్ని వేగంగా నడిపించారు. భయంకరమైన సన్నివేశాలు, ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి. కేవలం 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ నిడివి 18 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉండడం విశేషం. తక్కువ సమయంలోనే నాన్‌స్టాప్ భయాన్ని అందించడంలో మేకర్స్ విజయం సాధించారు.

ఈ సిరీస్‌లో ఖుషి రవి (జాజి పాత్రలో), అక్షయ్ నాయక్ (దుష్యంత్ పాత్రలో), మానసి సుధీర్ (అత్తగారి పాత్రలో) తమ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. అనిరుద్ధ ఆచార్య, రమేష్ ఇందిరా, హిత చంద్రశేఖర్, విజయ్ శోభరాజ్ తదితరులు తమ పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేశారు.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ఎల్.వి. ముత్తు, గణేష్ అందించిన నేపథ్య సంగీతం (Background Score) హారర్ సన్నివేశాలకు ప్రాణం పోసింది. సన్నివేశాల్లోని భయానక వాతావరణాన్ని సంగీతం రెట్టింపు చేసింది. శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ హర్రర్ మిస్టరీ సిరీస్‌కి ప్రముఖ రివ్యూ ప్లాట్‌ఫామ్ ఐఎమ్‌డీబీ (IMDb)లో 6.8/10 రేటింగ్ లభించింది.

అయ్యన మనే ఓటీటీ స్ట్రీమింగ్

ప్రస్తుతం జీ5 (ZEE5)లో అయ్యన మనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో జీ5లో అయ్యన మనే ఓటీటీ రిలీజ్ అయింది. క్లాసిక్ హారర్ ఎలిమెంట్స్, మిస్టరీ డ్రామాను ఇష్టపడేవారు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'అయ్యన మనే' బెస్ట్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks