...
...
Next Story

Cocktail 2 OTT Official: ఓటీటీలోకి రష్మిక మందన్నా, కృతి సనన్ రొమాంటిక్ మూవీ- తిరగబడే లవ్ టెస్ట్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Cocktail 2 OTT Release Official: షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, కృతి సనన్ నటించిన రొమాంటిక్ డ్రామా కాక్‌టెయిల్ 2 ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో రూ. 140 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కాక్‌టెయిల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను సదరు సంస్థ అధికారికంగా తాజాగా ప్రకటించింది.

Published on: Aug 2, 2026, 16:43:36 IST
Advertisement

Cocktail 2 OTT Streaming Official: బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా కాక్‌టెయిల్ 2 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వేదిక సిద్ధం చేసుకుంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, హిందీ భామ కృతి సనన్ తొలిసారి కలిసి నటించిన ఈ మూవీ థియేటర్లలో రికార్డు స్థాయి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

రూ. 140 కోట్ల కలెక్షన్స్ సాధించి

ఓటీటీలోకి రష్మిక మందన్నా, కృతి సనన్ రొమాంటిక్ మూవీ- తిరగబడే లవ్ టెస్ట్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి రష్మిక మందన్నా, కృతి సనన్ రొమాంటిక్ మూవీ- తిరగబడే లవ్ టెస్ట్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

థియేటర్లలో చూడటం మిస్సయిన వారి కోసం ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ప్రముఖ దర్శకుడు హోమీ అదాజానియా తెరకెక్కించిన కాక్‌టెయిల్ 2 జూన్ 19న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఆరో స్థానంలో ఈ సినిమా నిలిచింది.

కాక్‌టెయిల్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగా వసూళ్లతో మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.6 రేటింగ్ కూడా సాధించుకుంది ఈ కాక్‌టెయిల్ 2 సినిమా.

సైఫ్ సినిమా సీక్వెల్‌గా

2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'కాక్‌టెయిల్' సినిమాకు ఇది ప్రత్యక్ష సీక్వెల్ కాదు. ఒకే టైటిల్ బ్రాండ్‌తో సరికొత్త పాత్రలు, ఆధునిక సంబంధాల నేపథ్యంలో రూపొందించిన వినూత్న కథనమిది.

ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో త్రికోణ ప్రేమకథ

అక్కడ దియా పాత స్నేహితురాలు అల్లీ (కృతి సనన్)ని అనుకోకుండా కలుస్తారు. అయితే, తన ప్రియుడు కునాల్‌ నమ్మకాన్ని, నిబద్ధతను పరీక్షించాలని దియా భావిస్తుంది. కునాల్‌తో కొద్దిగా ఫ్లర్ట్ చేయమని అల్లీకి దియా చెప్తుంది. కానీ, ఈ సరదా ప్లాన్ కాస్తా పూర్తిగా తిరగబడుతుంది. కునాల్‌పై అల్లీకి నిజమైన ప్రేమ చిగురించడంతో ఈ ముగ్గురి జీవితాలు ఊహించని సవాళ్లతో, క్లిష్టమైన త్రికోణ ప్రేమకథగా రూపాంతరం చెందుతాయి.

నేషనల్ క్రష్ క్రేజ్.. థియేటర్లలో మ్యాజిక్!

తెలుగు తెరపై తన అద్భుత నటనతో అలరిస్తున్న రష్మిక మందన్నా ఈ సినిమాలో దియా పాత్రలో ఎమోషన్స్, గ్లామర్‌తో అలరించింది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మికల సరికొత్త కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కామెడీతో పాటు గుండెను తాకే భావోద్వేగాలు ఉన్న ఈ సినిమాలో టికూ తల్సానియా కీలక పాత్ర పోషించగా, పుల్కిత్ సమ్రాట్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లపై సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ రొమాంటిక్ డ్రామా, వారాంతంలో ఇంట్లోనే ప్రశాంతంగా కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి చూడటానికి చక్కని ఎంపికగా మారనుంది.

కాక్‌టెయిల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్

థియేట్రికల్ రన్ ముగియడంతో ఇప్పుడు ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా కాక్‌టెయిల్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా కాక్‌టెయిల్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. ఆగస్టు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కాక్‌టెయిల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe