...
...
Next Story

Gautam Ratings Mahesh Babu: తండ్రి మహేశ్ బాబు సినిమాలకు గౌతమ్ షాకింగ్ రేటింగ్స్- 1 నేనొక్కడినే మూవీకి ఎంతిచ్చాడో తెలుసా?

Gautam Ghattamaneni Ratings To Mahesh Babu Movies: ఇటీవల సినిమాలకు గౌతమ్ ఘట్టమనేని ఇస్తున్న రేటింగ్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. తండ్రి మహేశ్ బాబు సినిమాలకు గౌతమ్ ఇచ్చిన రేటింగ్స్ సోషల్ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ప్లాట్‌ఫామ్ లెటర్‌బాక్స్‌లో మహేశ్ సినిమాలకు గౌతమ్ ఎలాంటి రేటింగ్స్ ఇచ్చాడో చూద్దాం.

Published on: Oct 31, 2026, 12:52:23 IST
Advertisement

Gautam Ghattamaneni Ratings To Mahesh Babu Movies: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటాడు. విదేశాల్లో చదువుకుంటున్న గౌతమ్‌కు సినిమాలపై మంచి అభిరుచి ఉందనే విషయం తెలిసిందే.

హాట్ టాపిక్‌గా గౌతమ్ రేటింగ్స్

తండ్రి మహేశ్ బాబు సినిమాలకు గౌతమ్ షాకింగ్ రేటింగ్స్- 1 నేనొక్కడినే మూవీకి ఎంతిచ్చాడో తెలుసా?
తండ్రి మహేశ్ బాబు సినిమాలకు గౌతమ్ షాకింగ్ రేటింగ్స్- 1 నేనొక్కడినే మూవీకి ఎంతిచ్చాడో తెలుసా?

అయితే.. ప్రముఖ సినీ రివ్యూ, రేటింగ్ వేదిక 'లెటర్‌బాక్స్' (Letterboxd)లో గౌతమ్ ఇటీవల విడుదలైన సినిమాలకు రేటింగ్స్ ఇస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా తన తండ్రి మహేశ్ బాబు నటించిన సినిమాలకు గౌతమ్ ఘట్టమనేని ఇచ్చిన రేటింగ్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఒక సినీ అభిమానిగా ఏ మాత్రం పక్షపాతం లేకుండా, ఒక నిష్పాక్షికమైన ప్రేక్షకుడిలా గౌతమ్ ఈ రేటింగ్స్ ఇవ్వడం విశేషం. మహేశ్ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి కేవలం 1/5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు గౌతమ్. అలాగే 'వంశీ', 'నాని', 'నిజం', 'సర్కారు వారి పాట' సినిమాలకు 2/5 రేటింగ్‌కే పరిమితం చేశాడు.

క్లాసిక్ సినిమాలకే పట్టాభిషేకం

గౌతమ్ ఇచ్చిన రేటింగ్స్ చూస్తే ఆయనకు ఎలాంటి సినిమాలు ఇష్టమో స్పష్టమవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అతడు' చిత్రానికి 4.5/5 ఇవ్వగా.. 'పోకిరి', 'ఒక్కడు', 'మురారి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలకు 4/5 రేటింగ్ ఇచ్చాడు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ '1 నేనొక్కడినే' సినిమాకు ఏకంగా 5/5 రేటింగ్ ఇచ్చి తన టాప్ ఫేవరెట్‌గా నిలిపాడు గౌతమ్ ఘట్టమనేని.

అయితే, థియేటర్లలో వన్ నేనొక్కడినే సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా విషయంలో టాలీవుడ్ ఆడియెన్స్ ఫెయిల్ అయ్యారని సోషల్ మీడియాలో మీమ్స్ వస్తుంటాయి. ఇందులో గౌతమ్ కూడా నటించడం విశేషం.

'స్పైడర్' తర్వాత మహేశ్ బాక్సాఫీస్ ప్రయాణం

2017లో వచ్చిన 'స్పైడర్' సినిమా తర్వాత మహేశ్ బాబు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌ను ఎదుర్కొన్న అనంతరం వచ్చిన పొలిటికల్ డ్రామా 'భరత్ అనే నేను', సామాజిక కథాంశంతో వచ్చిన 'మహర్షి', మాస్ ఎంటర్‌టైనర్ 'సరిలేరు నీకెవ్వరు' కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించాయి. 'సర్కారు వారి పాట', 'గుంటూరు కారం' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పర్వాలేదనిపించాయి.

అయితే కమర్షియల్ విజయాలు సాధిస్తున్నప్పటికీ, 'భరత్ అనే నేను' తర్వాత మహేశ్ బాబు నుంచి అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచే క్లాసిక్ చిత్రం రాలేదనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో ఉంది. రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే 'వన్ నేనొక్కడినే' లాంటి విలక్షణమైన కథలనే గౌతమ్ లాంటి నేటితరం ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటున్నారని ఈ రేటింగ్స్ ద్వారా అర్థం అవుతోంది.

రాజమౌళి ‘వారణాసి’పైనే అందరి ఆశలు

ప్రస్తుతం మహేశ్ బాబు అభిమానుల చూపు అంతా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ టైమ్ ట్రావెల్ యాక్షన్ థ్రిల్లర్ 'వారణాసి' (SSMB29) పైనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేశ్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమాతో మహేశ్ ఖాతాలో మరో ఆల్ టైమ్ క్లాసిక్ పడటం ఖాయమని ఇటు ఫ్యాన్స్, అటు గౌతమ్ లాంటి సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి తారలు నటిస్తోన్న వారణాసి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks