...
...
Next Story

Amyra Dastur: నా కెరీర్‌ని ముంచే టైటానిక్ నువ్వే.. లేడి డైరెక్టర్ కామెంట్స్‌పై తెలుగు హీరోయిన్ అమైరా దస్తూర్

Amyra Dastur Recalls Farah Khan Comments: బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ షూటింగ్ సెట్‌లో తనను ఏడిపించినంత పని చేశారని తెలుగు హీరోయిన్ అమైరా దస్తుర్ వెల్లడించారు. 2017లో వచ్చిన 'కుంగ్‌ఫూ యోగా' సినిమా నాటి ఆసక్తికర విషయాలను ఫరా ఖాన్ నిర్వహించే యూట్యూబ్ షోలో ఇద్దరూ సరదాగా పంచుకున్నారు.

Published on: Nov 10, 2026, 14:36:55 IST
Advertisement

Amyra Dastur Recalls Farah Khan Comments: బాలీవుడ్‌లో కఠినమైన క్రమశిక్షణ, ముక్కుసూటితనానికి పేరుగాంచిన దర్శకురాలు ఫరా ఖాన్. సెట్‌లో ఆమె కోపానికి గురైన నటీనటులు తర్వాతి కాలంలో స్టార్ యాక్టర్స్‌గా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఫరా ఖాన్ యూట్యూబ్ వంటల షో

నా కెరీర్‌ని ముంచే టైటానిక్ నువ్వే.. లేడి డైరెక్టర్ కామెంట్స్‌పై తెలుగు హీరోయిన్ అమైరా దస్తూర్
నా కెరీర్‌ని ముంచే టైటానిక్ నువ్వే.. లేడి డైరెక్టర్ కామెంట్స్‌పై తెలుగు హీరోయిన్ అమైరా దస్తూర్

తాజాగా నటి, తెలుగులోనూ హీరోయిన్‌గా చేసిన అమైరా దస్తూర్ ముంబైలోని తన నివాసంలో ఫరా ఖాన్‌కు స్వాగతం పలికారు. ఫరా ఖాన్ నిర్వహిస్తున్న పాపులర్ యూట్యూబ్ వంటకాల షోలో అమైరా పాల్గొని, 'కుంగ్‌ఫూ యోగా' చిత్ర షూటింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

సెట్‌లో ఏడిపించినంత పని చేసిన ఫరా!

‘కుంగ్‌ఫూ యోగా’ సినిమాలో ‘గూస్‌బంప్’ పాట చిత్రీకరణ సమయాన్ని అమైరా దస్తూర్ ప్రస్తావించారు. "ఫరా ఖాన్ గారికి మంచి హాస్యచతురత ఉందనే విషయం నాకు అప్పట్లో తెలియదు. సెట్‌లో ఆమె అందరిపై అరుస్తుంటారని, తప్పులు చేస్తే ఊరుకోరని మాత్రమే విన్నాను. అందుకే ఆమెను చూడగానే చాలా భయపడ్డాను" అని అమైరా దస్తూర్ గుర్తు చేసుకున్నారు.

"ఒకసారి నా డ్యాన్స్ చూశాక ఆమె నా దగ్గరకు వచ్చి 'కంగ్రాచులేషన్స్! నువ్వు నా కెరీర్‌ను ముంచేసే టైటానిక్‌వి కాబోతున్నావ్' అని అన్నారు. ఆ మాట వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగినంత పని అయింది" అని అమైరా దస్తూర్ నవ్వుతూ చెప్పారు.

నటిస్తావా లేక కోమాలోనే ఉంటావా?

ఈ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఫరా ఖాన్ కూడా గట్టిగా నవ్వేశారు. "నా దగ్గర తిట్లు తిన్న ప్రతీ ఒక్కరూ కెరీర్‌లో మంచి స్థాయికి ఎదిగారు" అని ఫరా ఖాన్ చమత్కరించారు. అమైరా ఈ మాటతో ఏకీభవిస్తూ, ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలో నటుడు బొమన్ ఇరానీపై కూడా ఫరా అరిచిన వైనాన్ని గుర్తుచేశారు.

2017 లో విడుదలైన ‘కుంగ్‌ఫూ యోగా’ భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక ప్రాజెక్ట్. భారతదేశం, చైనాల మధ్య కుదిరిన చలనచిత్ర భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా తెరకెక్కిన మొదటి సినిమా ఇది.

ప్రముఖ దర్శకుడు స్టాన్లీ టోంగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్-అడ్వెంచర్ కామెడీ చిత్రంలో హాలీవుడ్ లెజెండ్ జాకీ చాన్, భారతీయ నటుడు సోనూ సూద్, దిశా పటానీ, అమైరా దస్తుర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని పాటలకు ఫరా ఖాన్ చేసిన కొరియోగ్రఫీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

డిజిటల్ రంగంలో ఫరా ఖాన్ హవా

2014 లో షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ తర్వాత ఫరా ఖాన్ మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. బుల్లితెరపై ‘సెలబ్రిటీ మాస్టర్ షెఫ్’ వంటి ప్రసిద్ధ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆమె, ప్రస్తుతం తన వంట మనిషి దిలీప్‌తో కలసి యూట్యూబ్‌లో చేస్తున్న సెలబ్రిటీ కుకింగ్ వీడియోలు మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.

ఇక నటి అమైరా దస్తూర్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ‘చుంబక్’ వెబ్ సిరీస్‌లో హుతోక్సీ తరపోర్‌వాలా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ ఓటీటీ సిరీస్‌లో నీనా గుప్తా, దేవేన్ భోజానీ, సుమీత్ వ్యాస్ కీలక పాత్రల్లో కనిపించారు.

అమైరా దస్తూర్ తెలుగు సినిమాలు

ఇక తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా చేసిన రాజు గాడు, సందీప్ కిషన్, బిగ్ బాస్ త్రిగుణ్ యాక్ట్ చేసిన మనసుకు నచ్చింది మూవీస్‌లో హీరోయిన్‌గా చేసింది బ్యూటిఫుల్ అమైరా దస్తూర్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks