Huma Qureshi On Kiara Advani Intimate Scenes: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్'. కేజీఎఫ్ సిరీస్ విజయాల తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో టాక్సిక్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
కియారా అద్వానీ ఇంటిమేట్ సీన్స్

ఈ క్రమంలో ఇటీవల టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన 'తబాహీ' పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఈ పాటలో హీరో యశ్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య ఉన్న కొన్ని ఇంటిమేట్ సీన్స్ (Intimate Scenes) ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి.
పెళ్లయిన నటిపైనే నిందలా? నెటిజన్ల ద్వంద్వ వైఖరి
'తబాహీ' పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో కియారా అద్వానీని లక్ష్యంగా చేసుకుని దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. వివాహమై, తల్లి అయిన తర్వాత కూడా ఇలాంటి దృశ్యాల్లో నటించడం ఏంటంటూ కొందరు కియారాను విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా ఆమె భర్త, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్లి అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు. ఒక నటిగా ఆమె ఎంచుకున్న పాత్రను వదిలేసి, ఆమె వ్యక్తిగత జీవితాన్ని, వైవాహిక బంధాన్ని ప్రశ్నించే స్థాయికి ఈ వేధింపులు చేరాయి.
వేరు వేరు న్యాయం
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ పాటలో నటించిన హీరో యశ్‌కు కూడా పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ ఆయనను ఎవరూ ప్రశ్నించకపోగా, ప్రశంసలు కురిపిస్తున్నారు. పురుషుడికి ఒక న్యాయం, మహిళకు మరో న్యాయం అమలు చేయడంపై చిత్ర పరిశ్రమ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ నటి హుమా ఖురేషి ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు.
రోతగా ఉంది.. సినిమానే సమాధానం చెబుతుంది!
{{/usCountry}}ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ పాటలో నటించిన హీరో యశ్‌కు కూడా పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ ఆయనను ఎవరూ ప్రశ్నించకపోగా, ప్రశంసలు కురిపిస్తున్నారు. పురుషుడికి ఒక న్యాయం, మహిళకు మరో న్యాయం అమలు చేయడంపై చిత్ర పరిశ్రమ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ నటి హుమా ఖురేషి ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు.
రోతగా ఉంది.. సినిమానే సమాధానం చెబుతుంది!
{{/usCountry}}"మహిళలను మాత్రమే ఇలా వేధించడం చాలా అసహ్యకరంగా ఉంది. రోత పుట్టిస్తోంది. సమాధానాలు చెప్పుకుంటూ పోవడం వల్ల జనుల మానసిక ధోరణి మారదు. ఈ సినిమాలో నటించిన నటీమణులు, దర్శక నిర్మాతలే చివరికి గెలుస్తారు. మా మాటల కంటే ఈ సినిమా వచ్చే ఆగస్టు 26న థియేటర్లలో ఇచ్చే సమాధానమే గట్టిగా ఉంటుంది" అని టాక్సిక్ మరో హీరోయిన్ హుమా ఖురేషి స్పష్టం చేశారు.
అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మరో నటుడు సాకిబ్ సలీమ్ కూడా స్పందిస్తూ.. "అసలు వీళ్లంతా ఎవరు? బయటి ప్రపంచం ఎంతో దయతో ఉంటే, ఈ సోషల్ మీడియా ప్రపంచం మాత్రం అత్యంత దారుణంగా మారింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశీ నటుడి ఘాటు వ్యాఖ్యలు
ఈ వివాదంపై బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా స్పందించారు. నటుల పని కేవలం పాత్రల్లో జీవించడమేనని గుర్తుచేశారు. "యశ్‌కు పెళ్లై పిల్లలు ఉన్నారు. అతనికి రాని అభ్యంతరం కియారాకు మాత్రమే ఎందుకు ఎదురవుతోంది? పురుషుడికి చప్పట్లు, స్త్రీకి తిట్లు దక్కడం మన సమాజంలోని వికృత ఆలోచనా విధానానికి నిదర్శనం. వారు నటులు, తెరపై ప్రేమను పండించడం వారి వృత్తి బాధ్యత" అని బెనెడిక్ట్ హితవు పలికారు.
టాక్సిక్ హీరోయిన్స్
'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రంలో నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, కియారా అద్వానీ వంటి ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.