...
...
Next Story

OTT Horror Telugu: ఓటీటీలోకి ది ప్యారడైజ్ హీరోయిన్ రొమాంటిక్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్- హీరోగా సంగీత దర్శకుడు- 9 రేటింగ్!

Romantic Horror Fantasy Thriller Immortal OTT Streaming: ఓటీటీలోకి ది ప్యారడైజ్ హీరోయిన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఇమ్మోర్టల్ వచ్చేయనుంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా చేసిన ఇమ్మోర్టల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 25, 2026, 05:30:59 IST
Advertisement

Romantic Horror Fantasy Thriller Immortal OTT Release: కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, ది ప్యారడైజ్ హీరోయిన్ కయాదు లోహర్ జోడీగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం 'ఇమ్మోర్టల్'.

ఇమ్మోర్టల్ ఐఎమ్‌డీబీ రేటింగ్

ఓటీటీలోకి ది ప్యారడైజ్ హీరోయిన్ రొమాంటిక్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్- హీరోగా సంగీత దర్శకుడు- 9 రేటింగ్!
ఓటీటీలోకి ది ప్యారడైజ్ హీరోయిన్ రొమాంటిక్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్- హీరోగా సంగీత దర్శకుడు- 9 రేటింగ్!

నూతన దర్శకుడు మరియప్పన్ చిన్న తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలై ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 9 రేటింగ్ సంపాదించుకుంది. వెయ్యేళ్ల నాటి జానపద మిస్టరీని, ఆధునిక అపార్ట్‌మెంట్ హారర్ కాన్సెప్ట్‌కు జోడించి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే మెప్పించింది.

5 భాషల్లో ఇమ్మోర్టల్ ఓటీటీ రిలీజ్

అలాంటి ఇమ్మోర్టల్ ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో ఇమ్మోర్టల్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

కథేంటంటే?

మహి (జీవీ ప్రకాష్ కుమార్) ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. ఓనర్ వేధింపులు తట్టుకోలేక తక్కువ అద్దెలో కొత్త గది కోసం వెతుకుతుంటాడు. ఆ సమయంలో సింధు (కయాదు లోహర్) అనే పరిచయం లేని యువతి నుంచి ఊహించని పిలుపు వస్తుంది.

తన అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ షేరింగ్ పద్ధతిలో ఉండటానికి మహికి ఆహ్వానం పలుకుతుంది. విశాలమైన ఆ ప్లాట్‌లోకి మారిన మహి, సింధు అందానికి, ఆమె ఆప్యాయతకు త్వరగానే ఆకర్షితుడవుతాడు. అయితే, ఆ కొద్ది రోజులకే ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి.

ఇమ్మోర్టల్ ట్విస్టులు

ప్రాచీన జానపద మృగం కథను నేటి సిటీ వాతావరణంలోకి తీసుకురావాలనే కాన్సెప్ట్ ఆలోచన బాగుంది. అమాయకుడైన సగటు యువకుడిగా, ప్రాణభయంతో పరుగులు తీసే మహి పాత్రలో జీవీ ప్రకాష్ కుమార్ చాలా సహజంగా నటించారు. భయం, ఆందోళనలను తెరపై చక్కగా పండించారు.

సింధు పాత్రలో కయాదు లోహర్ తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. పస్టాఫ్‌లో వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్, ఆ తర్వాత వచ్చే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని నిలుపుతాయి. కీలక పాత్రల్లో టి.ఎమ్. కార్తీక్, కుమార్ నటరాజన్, ఆదిత్య కతిర్ తమ పరిధి మేర మెప్పించారు.

థ్రిల్లింగ్ సీన్లు, ఊహించని ట్విస్టులు

సాంకేతిక విభాగంలో సామ్ సి.ఎస్ ఇచ్చిన నేపథ్య సంగీతం కొన్ని థ్రిల్లింగ్ సీన్లలో సన్నివేశల ఇంటెన్సిటీని పెంచింది. అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ అపార్ట్‌మెంట్ విజువల్స్‌ను విభిన్నంగా చూపించారు. ఊహించని ట్విస్టులతో, కయాదు టెర్రిఫిక్ పర్ఫామెన్స్‌తో ఇమ్మోర్టల్ మెప్పించింది.

ఇమ్మోర్టల్ ఓటీటీ స్ట్రీమింగ్

జానపద స్టైల్ వంటి హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇమ్మోర్టల్ మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఇలాంటి ఇమ్మోర్టల్ ఓటీటీలో ప్రసారం కానుంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇమ్మోర్టల్ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసింది. కాబట్టి అమెజాన్ ప్రైమ్‌లో ఇమ్మోర్టల్ ఓటీటీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2 నుంచి గాంధీ జయంతి సందర్భంగా ఇమ్మోర్టల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks