Jana Nayagan OTT Release Details: తమిళ స్టార్ హీరో, సీఎం దళపతి విజయ్ నటించిన లాస్ట్ సినిమా ‘జన నాయగన్’. తెలుగులో ‘జన నాయకుడు’. విజయ్ పూర్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నటించిన ఈ సినిమా 7 నెలల ఆలస్యంతో ఎట్టకేలకు నిన్న (జూలై 23) థియేటర్లలో విడుదల అయింది.
తక్కువగా జన నాయగన్ కలెక్షన్స్

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తమిళనాడులో విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ శ్రేణులు, అభిమానుల పండుగ వాతావరణం నడుమ ఈ సినిమా కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి.
తెలుగులో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చి సంచలన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి ఇది అధికారిక తమిళ రీమేక్. బాలయ్య పోషించిన పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా విజయ్ పాత్రను దర్శకుడు హెచ్. వినోద్ రూపుదిద్దారు.
జన నాయగన్ కథ
విజయ్ ఇందులో 'దళపతి వెట్రి కొండన్' అనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించారు. తన దివంగత మిత్రుడి కుమార్తె విజ్జీ (మమితా బైజు)ని ఇండియన్ ఆర్మీలో చేర్పించేందుకు, ఆమె గతాన్ని జయించేలా చేసే తండ్రి లాంటి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, విలన్‌గా బాబీ డియోల్, ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, ప్రియమణి మెరిసారు.
జన నాయగన్ సినిమా పక్కా విజయ్ అభిమానుల సినిమాలా అనిపించిందని టాక్ వచ్చింది. విజయ్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ విజిల్స్ కొట్టించేలా ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే, చాలా వరకు సీన్లు సాగదీతలా, అనవసరమైన యాక్షన్ జొప్పించారని కాస్తా నెగెటివిటీ కూడా వస్తోంది.
జన నాయగన్ ఐఎమ్‌డీబీ రేటింగ్
{{/usCountry}}జన నాయగన్ సినిమా పక్కా విజయ్ అభిమానుల సినిమాలా అనిపించిందని టాక్ వచ్చింది. విజయ్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ విజిల్స్ కొట్టించేలా ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే, చాలా వరకు సీన్లు సాగదీతలా, అనవసరమైన యాక్షన్ జొప్పించారని కాస్తా నెగెటివిటీ కూడా వస్తోంది.
జన నాయగన్ ఐఎమ్‌డీబీ రేటింగ్
{{/usCountry}}ఇలాంటి భిన్నమైన అభిప్రాయాల మధ్య జన నాయకుడు సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.1 రేటింగ్ వచ్చింది. ఇక థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన ప్రతి సినిమా ఓటీటీ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ క్రమంలోనే జన నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డీటేల్స్‌పై క్యూరియాసిటీ పెరిగింది.
మొదట్లో జన నాయకుడు సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 110 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరిపిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే సినిమా విడుదల ఆలస్యం కావడం, పైరసీ లీకుల భయాల కారణంగా ఆ ఒప్పందం ముందుకు సాగలేదని వార్తలు వచ్చాయి.
జన నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్
ఆ తర్వాత ప్రసిద్ధ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) ఈ హక్కుల కోసం దాదాపు రూ. 50 కోట్ల భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, రూ. 60 కోట్లతో జన నాయగన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారిపోయిందని తెలుస్తోంది. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం జీ5లోనే జన నాయగన్ ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది.
ఆగస్ట్ 21 నుంచి జీ5లో జన నాయకుడు ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని టాక్. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో జీ5 ఓటీటీలో జన నాయగన్ అందుబాటులో ఉండనుందట. విజయ్ లాస్ట్ సినిమాను మంచి అనిభూతితో చూడాలనుకునే అభిమానులు, ఆడియెన్స్ జన నాయగన్ మూవీని థియేటర్లలో చూడటం ఉత్తమం.