Podarillu Serial Actress And Suhasini Janani OTT Release Review: డిజిటల్ మీడియా యుగంలో కుటుంబ బంధాలు, ఆత్మీయతల నేపథ్యంలో వచ్చే ఓటీటీ కథలకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 27) వచ్చిన లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా జనని.
సీనియర్ హీరోయిన్ సుహాసిని-పొదరిల్లు జయంతి

సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం, రాజా చెంబోలు, పొదరిల్లు సీరియల్‌లో జయంతిగా అలరించిన నటి మంజుల పరిటాల ప్రధాన పాత్రల్లో నటించిన జనని సినిమా అత్తా వర్సెస్ కోడలుగా అన్నట్లుగా సాగుతుందని, గుండెలు పిండేసే కథగా ఈ మూవీ ఉంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
జనని సినిమాలో అత్తగా సుహాసిని చేయగా, కోడలుగా మంజుల నటించారు. అంటే, వీరిద్దరి మధ్య పోటా పోటీ ఉండనుంది. అంతేకాకుండా జనని సినిమాతోనే అటు ఒకప్పటి వెండితెర బ్యూటీ సుహాసిని, ఇటు బుల్లితెర నటి మంజుల ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
జనని సినిమా కథ, ట్విస్టులు
జనని కథ విషయానికొస్తే.. రాము (రాజా చెంబోలు), సుధ (మంజుల పరిటాల) దంపతులు తమ ఏడేళ్ల కుమారుడు అనిరుధ్‌తో కలిసి సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుంటారు. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో రాము తల్లి పార్వతమ్మ (సుహాసిని మణిరత్నం) వారితో కలిసి ఉండటానికి వస్తుంది.
పాతకాలపు ఆలోచనలు, సంప్రదాయాలు పాటించే పార్వతమ్మ ఆశలు, అలవాట్లు ఆ కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడిని పెంచుతాయి. ఇంట్లో వస్తువులను వాస్తు పద్ధతిలో ఉంచడం నుంచి కూతురును కనాలని బలవంతం పెట్టడం వరకు పార్వతమ్మ పనులు కోడలికి తంటాలు తీసుకొస్తాయి.
దాగి ఉన్న ఊహించని నిజం
దీంతో కుమారుడు, కోడలు పార్వతమ్మ పట్ల కఠినంగా, ఆప్యాయత లేనట్లు ప్రవర్తించడం ప్రారంభిస్తారు. తనను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నపిల్లలే హఠాత్తుగా ఎందుకు పరాయివారిగా మారారో అర్థంకాక పార్వతమ్మ తీవ్ర వేదనకు గురవుతుంది. పిల్లలు చూపిస్తున్నది రాక్షసత్వమని ఆమె భావిస్తుంది.
{{/usCountry}}దీంతో కుమారుడు, కోడలు పార్వతమ్మ పట్ల కఠినంగా, ఆప్యాయత లేనట్లు ప్రవర్తించడం ప్రారంభిస్తారు. తనను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నపిల్లలే హఠాత్తుగా ఎందుకు పరాయివారిగా మారారో అర్థంకాక పార్వతమ్మ తీవ్ర వేదనకు గురవుతుంది. పిల్లలు చూపిస్తున్నది రాక్షసత్వమని ఆమె భావిస్తుంది.
{{/usCountry}}అయితే ఈ నిష్ఠురమైన ప్రవర్తన వెనుక ఊహించని నిజం దాగి ఉంది. పార్వతమ్మ చివరి దశ క్యాన్సర్‌తో బాధపడుతోందన్న చేదు నిజం కుటుంబానికి తెలుస్తుంది. ఆమెను కాపాడుకోవడానికి, ఎక్కువ రోజులు తమతో ఉంచుకోవడానికి పిల్లలు కావాలనే ఆమెపై ఆంక్షలు విధిస్తారు.
యాక్టర్స్ నటన, టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయంటే?
ప్రేమించిన వారిని ప్రాణంగా నిలుపుకోవడానికి ఒక్కోసారి నిందలు భరిస్తూ కఠినంగా మారాల్సి వస్తుందనే భావోద్వేగ సత్యాన్ని ఈ కథ ఆవిష్కరిస్తుంది. తల్లి పాత్రలో సుహాసిని మణిరత్నం జీవించేశారు. రాజా చెంబోలు, మంజుల పరిటాల తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు.
వై. శ్రీరామ్ చౌదరి ఈ జనని కథకు దర్శకత్వం వహించడమే కాకుండా రచన బాధ్యతలు నిర్వర్తించారు. పైడి బాబు కోరుకొండ, ప్రసాద్ బాబు దొనెపూడి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరించగా, సుష్ కోరుకొండ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు చేపట్టారు.
డీఓపీ డి. ప్రసాద్ బాబు అందించిన విజువల్స్ కథలోని తీవ్రతను ప్రతిబింబిస్తాయి. సుభాష్ ఆనంద్ ఇచ్చిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఆర్ద్రతను పెంచింది. నలిన్ బడే ఎడిటింగ్, సూర్య కిరణ్ అసోసియేట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
జనని ఓటీటీ స్ట్రీమింగ్
ఇప్పటికే విడుదలైన జనని ట్రైలర్ సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది. ఇకపోతే సెప్టెంబర్ 27 అంటే నేటి నుంచి ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో జనని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా నేడు జనని ఓటీటీ రిలీజ్ అయింది. మనసుకు హత్తుకునే కుటుంబ కథా చిత్రాలను కోరుకునే ఓటీటీ ఆడియెన్స్‌కి ఇది ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.