JioHotstar OTT Horror Thrillers To Watch: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు జియోహాట్‌స్టార్ అదిరిపోయే సినిమాలను తీసుకొచ్చింది. సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో వరుసగా నాలుగు ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లర్ హారర్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
వేర్వేరు కాన్సెప్ట్‌లతో

నాలుగు కూడా వణుకుపుట్టించేలా వేర్వేరు కాన్సెప్ట్‌లతో అలరించేలా ఉన్నాయి. సైకలాజికల్ హారర్ నుంచి ఫాంటసీ అడ్వెంచర్ వరకు జియో హాట్‌స్టార్ ఓటీటీలో చూడాల్సినవిగా 4 టాప్ సినిమాలు ఇవి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటిని ఎందుకు చూడాలో చెప్పే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ను ఇక్కడ చూద్దాం.
విజిల్ (Whistle)
టీనేజ్ స్లాషర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'విజిల్' చిత్రం సెప్టెంబర్ 4 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ సినిమాను చూసే వెసులుబాటు ఉంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.2/10
కథ: కొందరు హైస్కూల్ విద్యార్థులకు ప్రమాదకరమైన ఒక పురాతన డెత్ విజిల్ (ఈల) దొరుకుతుంది. ఆ ఈలను ఊదడంతో వారి భవిష్యత్తు చావులకు సంబంధించిన దెయ్యాల శక్తులు వారిపై దాడి చేయడం ప్రారంభిస్తాయి.
ఎందుకు చూడాలంటే?: 'ఫైనల్ డెస్టినేషన్' చిత్రాల తరహాలో సాగే భయానక హత్యలు, రక్తం ఏరులైపారే సీన్లు, డెఫ్నే కీన్ ప్రదర్శించిన ఉత్కంఠభరిత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వయోలెంట్‌గా ఉంటే హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్.
ది ఫ్రంట్ రూమ్ (The Front Room)
సైకలాజికల్ బాడీ హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సినిమా ది ఫ్రంట్ రూమ్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో సెప్టెంబర్ 7న జియో హాట్‌స్టార్‌లో ది ఫ్రంట్ రూమ్ ఓటీటీ రిలీజ్ అయింది.
{{/usCountry}}సైకలాజికల్ బాడీ హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సినిమా ది ఫ్రంట్ రూమ్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో సెప్టెంబర్ 7న జియో హాట్‌స్టార్‌లో ది ఫ్రంట్ రూమ్ ఓటీటీ రిలీజ్ అయింది.
{{/usCountry}}స్టోరీ: గర్భవతి అయిన ఒక మహిళ ఇంటికి ఆమె అత్తగారు నివసించేందుకు వస్తుంది. ఆరోజు నుంచి ఆ ఇంట్లో మొదలైన ఆధ్యాత్మిక మతోన్మాదం, మానసిక వేధింపులు ఆ గర్భవతి జీవితాన్ని ఎలా నరకంగా మార్చాయో ఈ కథలో చూడొచ్చు.
చూసేందుకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్: పాప్ సింగర్ బ్రాండీ నార్వుడ్, క్యాథరిన్ హంటర్ మధ్య సాగే మైండ్ గేమ్స్, భయాందోళనలకు గురిచేసే సైకలాజికల్ సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. అంతకుమించి సినిమాలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి.
గెట్ అవుట్ (Get Out)
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఊపేసిన ఆస్కార్ విన్నింగ్ సైకలాజికల్ హారర్ డ్రామా 'గెట్ అవుట్'. సెప్టెంబర్ 8 నుంచి ఇంగ్లీష్, హిందీ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో గెట్ అవుట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.7/10
కథాంశం: ఒక నల్లజాతి యువకుడు తన శ్వేతజాతి ప్రియురాలి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఎదురయ్యే వింత అనుభవాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ కుటుంబం నల్లజాతి యువకుల మెదడును నియంత్రించే భయానక ప్రయోగాలు చేస్తున్నట్లు అతడు గుర్తిస్తాడు. ఆ తర్వాత ఏమైందనేదే మిగతా కథ.
చూసేందుకు కారణాలు: జార్డన్ పీలే దర్శకత్వ నైపుణ్యం, సమాజంలో ఉన్న వర్ణ వివక్షపై పదునైన విమర్శ, క్లైమాక్స్ వరకు నిలబెట్టే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిన మాస్టర్‌పీస్‌గా నిలబెట్టాయి.
అలీ బాబా ఔర్ 40 భూత్ (Ali Baba Aur 40 Bhoot)
రెగ్యులర్‌గా వచ్చే అలీ బాబా కథకు సరికొత్త ట్విస్ట్ ఇస్తూ రూపొందించిన ఓటీటీ సిరీస్ 'అలీ బాబా ఔర్ 40 భూత్'. తెలుగు, హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లో సెప్టెంబర్ 11 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో అలీ బాబా ఔర్ 40 భూత్ అందుబాటులోకి వచ్చేసింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.5/10
ప్లాట్: ఒక యువతి తండ్రి ఆకస్మికంగా అదృశ్యమవుతాడు. అతడి అచూకీ కోసం బయలుదేరిన ఆ యువతికి 40 శపించబడిన విగ్రహాలు, దెయ్యాల ప్రపంచంతో సంబంధం ఉందని తెలుస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్, పారానార్మల్ రీసెర్చర్‌తో కలిసి ఆమె ఆ రహస్యాన్ని ఎలా ఛేదించిందనేదే ఈ సిరీస్ కథ.
ఎందుకు చూడాలంటే?: హారర్, ఫాంటసీలకు కామెడీని జోడించి తీసిన తీరు, ఆశా నేగి, విశాల్ వశిష్ట జోడీ నటన, 40 విగ్రహాల వెనుకున్న రహస్యం ఉత్కంఠ రేకెత్తిస్తాయి. మనం ఎప్పుడు వినే 40 దొంగల కథ కాకుండా 40 భూతాల కథ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. 40 దెయ్యాలు ఇతరుల్లో దూరి ఏం చేశాయన్నది చాలా ఇంట్రెస్టింగ్‌గా, కామెడీగా నవ్విస్తుంది, భయపెడుతుంది.
తెలుగులో 2
ఇలా హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు జియో హాట్‌స్టార్ ఓటీటీలోని ఈ 4 సినిమాలను ఎంచక్కా చూసేయొచ్చు. వీటిలో రెండు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం.