...
...
Next Story

Nani: వయోలెన్స్-లవ్ స్టోరీ- రిపీట్.. బ్లడీ రోమియో తర్వాత 96 డైరెక్టర్‌తో నాని ఫీల్ గుడ్ మూవీ- హీరోయిన్‌గా రుక్మిణి వసంత్

Nani Rukmini Vasanth C Prem Kumar Movie: మాస్ యాక్షన్ చిత్రాల తర్వాత నేచురల్ స్టార్ నాని మళ్లీ ప్రేమకథల వైపు మొగ్గు చూపుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న 'బ్లడీ రోమియో' పూర్తి కాగానే '96', 'సత్యం సుందరం' సినిమా దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌తో ఓ క్లాసిక్ రొమాంటిక్ డ్రామాతో అలరించనున్నాడని సమాచారం.

Published on: Oct 15, 2026, 13:26:00 IST
Advertisement

Nani Movie With Rukmini Vasanth C Prem Kumar: వరుస యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న నేచురల్ స్టార్ నాని, తన తదుపరి నెక్ట్స్ చేసే సినిమాలను సరికొత్త రూట్‌తో ఎంచుకుంటున్నాడు. ఇటీవలే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాతో నాని ఆకట్టుకున్నాడు.

బ్లడీ రోమియో తర్వాత ఫీల్ గుడ్ లవ్ స్టోరీ

వయోలెన్స్-లవ్ స్టోరీ- రిపీట్.. బ్లడీ రోమియో తర్వాత 96 డైరెక్టర్‌తో నాని ఫీల్ గుడ్ మూవీ- హీరోయిన్‌గా రుక్మిణి వసంత్
వయోలెన్స్-లవ్ స్టోరీ- రిపీట్.. బ్లడీ రోమియో తర్వాత 96 డైరెక్టర్‌తో నాని ఫీల్ గుడ్ మూవీ- హీరోయిన్‌గా రుక్మిణి వసంత్

ప్రస్తుతం ఓజీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' సినిమాతో నాని బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఒక మనసుకు హత్తుకునే ఫీల్-గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించేందుకు నాని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిషలతో '96', కార్తి-అరవింద్ స్వామిలతో 'మెయ్యళగన్' (తెలుగులో 'సత్యం సుందరం') వంటి అద్భుతమైన క్లాసిక్ చిత్రాలను అందించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌తో నాని ఒక సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాంతార 2 హీరోయిన్‌తో

విభిన్నమైన ఎమోషన్లతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రేమకథలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఈ పాత్ర కోసం సప్త సాగరాలు దాటి, కాంతార 2 ఫేమ్ రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కాంబినేషన్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇకపోతే ప్రస్తుతం నాని దృష్టి అంతా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్లడీ రోమియో'పైనే ఉంది. 'సాహో', 'ఓజీ' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సుజీత్, ఈ చిత్రాన్ని ఒక స్టైలిష్ యాక్షన్ కామెడీగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. లండన్‌లోని ఒక హోటల్‌లో షెఫ్‌గా పనిచేస్తూనే, మరోవైపు గ్యాంగ్‌స్టర్‌గా సాగే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నాని అలరించనున్నాడు.

బ్లడీ రోమియోలో ప్రీతి ముకుందన్

ఇటీవలే బ్లడీ రోమియో సినిమా కోసం నాని సరికొత్త మేకోవర్ అయిన వర్కింగ్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ పర్యవేక్షణలో సరికొత్త లుక్‌తో నాని ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

వరుస యాక్షన్ చిత్రాల ఊపు తర్వాత, మళ్లీ కుటుంబ ప్రేక్షకులు, యూత్‌ను ఆకట్టుకునేలా ఒక హృదయానికి హత్తుకునే లవ్ స్టోరీని అందించాలని నాని నిర్ణయించుకున్నాడు. "బ్లడీ రోమియో తర్వాత అందరినీ అలరించే ఒక హాయిగా సాగే ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నాను" అని నాని ఇటీవల ఒక మీడియా సమావేశంలో నాని వ్యాఖ్యానించాడు.

నాని గ్రీన్ సిగ్నల్

ప్రయోగాలకు స్వస్తి చెప్పకుండానే, పాత రోజులను గుర్తుచేసే రొమాంటిక్ డ్రామాతో అలరించేందుకు నాని సిద్ధమవుతున్నాడు. ప్రేమ్ కుమార్ చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks