ఓటీటీలోకి నిన్న థియేటర్లలో విడుదలైన నారీ నారీ నడుమ మురారి డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఇప్పుడు క్యూరియాసిటీ నెలకొంది. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్‌పై బజ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలోనే నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రిలీజ్‌పై అందరి కన్ను పడింది.
ఐదు సినిమాల కంటే ఎక్కువగా

ఎందుకుంటే 2026 సంక్రాంతికి విడుదలైన ఐదు సినిమాల్లో మిగతా వాటి కంటే ఎక్కువగా పాజిటివ్ టాక్‌ను నారీ నారీ నడుమ మురారి సంపాదించుకుంటోంది. సంక్రాంతి పండుగ చివరి సినిమాగా లేట్‌గా రిలీజ్ అయినప్పటికీ లేటెస్ట్‌గా అదరగొట్టిందంటూ టాక్ నడుస్తోంది.
10కి 8 రేటింగ్
ఇలా అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతున్న నారీ నారీ నడుమ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి కూడా పదికి 8 రేటింగ్ వచ్చింది. జనవరి 14న సాయంత్రం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, బ్యూటిఫుల్ హీరోయిన్స్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య జోడీగా నటించారు.
సామజవరగమన డైరెక్టర్
సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మాతలుగా నిర్మించారు. నారీ నారీ నడుమ మురారిలో హీరో హీరోయిన్లతోపాటు సీనియర్ నటుడు వీకే నరేష్, సునీల్, వెన్నెల కిశోర్, సత్య, సిరి హనుమంత్, సంపత్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
నారీ నారీ నడుమ మురారి రివ్యూ
లవర్, ఎక్స్ మధ్య హీరో నలిగిపోయే కథగా నారీ నారీ నడుమ సినిమా వచ్చినప్పటికీ డిఫరెంట్ ట్రాక్‌తో కామెడీని బాగా హ్యాండిల్ చేశారని రివ్యూలో చెప్పారు. ముఖ్యంగా సినిమా రైటింగ్, డైలాగ్స్, సిచ్యువేషనల్ కామెడీ అదిరిపోయిందని అంటున్నారు.
నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}లవర్, ఎక్స్ మధ్య హీరో నలిగిపోయే కథగా నారీ నారీ నడుమ సినిమా వచ్చినప్పటికీ డిఫరెంట్ ట్రాక్‌తో కామెడీని బాగా హ్యాండిల్ చేశారని రివ్యూలో చెప్పారు. ముఖ్యంగా సినిమా రైటింగ్, డైలాగ్స్, సిచ్యువేషనల్ కామెడీ అదిరిపోయిందని అంటున్నారు.
నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}ఇంత మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్‌పై అమితమైన ఆసక్తి నెలకొంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసిందని సమాచారం.
నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రైట్స్ ధర
థియేట్రికల్ రిలీజ్‌కు ముందే రూ. 17.5 కోట్లు వెచ్చించి నారీ నారీ నడుమ మురారి ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని టాక్. ఈ లెక్కన చూస్తే అమెజాన్ ప్రైమ్‌లోనే నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అయితే, సినిమాకు వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్, రెస్పాన్స్, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటి వరకు అయితే అధికారికంగా నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు.