ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 24 సినిమాలు- 16 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఏది ఎక్కడ చూడాలో తెలుసుకోండి!
ఓటీటీలోకి గత రెండు రోజుల్లో ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అందులో బాలకృష్ణ అఖండ 2, కానిస్టేబుల్ కనకం 2, రకుల్ ప్రీత్ దే దే ప్యార్ దే 2, కాళరాత్రి 2తో అన్ని జోనర్ సినిమాలు ఉన్నాయి.
ఓటీటీలోకి గత రెండు రోజుల్లో ఏకంగా 24 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

అఖండ 2 ఓటీటీ: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా అఖండ 2 తాండవం. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసిన అఖండ 2 నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9 నుంచి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
దే దే ప్యార్ దే 2 ఓటీటీ: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఇది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9న దే దే ప్యార్ దే 2 ఓటీటీ రిలీజ్ అయింది.
ఏకం ఓటీటీ: ప్రకాష్ రాజ్, రాజ్ బి శెట్టి తదితరులు నటించిన కన్నడ అంథాలజీ డ్రామా సిరీస్ ఏకం జీ5 ఓటీటీలో జనవరి 9 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
కానిస్టేబుల్ కనకం 2 ఓటీటీ: తెలుగులో హిట్ అయిన మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం సిరీస్ నుంచి వచ్చిన రెండో సీజన్ ఈటీవీ విన్‌లో జనవరి 8 నుంచి అందుబాటులో ఉంది.
డ్యుయల్ ఓటీటీ: జాంబీ హారర్ నేపథ్యంలో సర్వైవల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తెలుగు మూవీ డ్యుయల్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
వీటితోపాటు మరిన్ని:
| ఓటీటీ ప్లాట్‌ఫామ్ | చిత్రం/సిరీస్ పేరు | విభాగం (Genre) | విడుదల తేదీ |
|---|---|---|---|
| నెట్‌ఫ్లిక్స్ | హిజ్ అండ్ హర్ | ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ (తెలుగు డబ్బింగ్) | జనవరి 8 |
| నెట్‌ఫ్లిక్స్ | ది రూకీ | అమెరికన్ పోలీస్ క్రైమ్ డ్రామా | జనవరి 8 |
| నెట్‌ఫ్లిక్స్ | ఆల్ఫా మేల్స్ (సీజన్ 4) | స్పానిష్ కామెడీ డ్రామా | జనవరి 9 |
| నెట్‌ఫ్లిక్స్ | పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ | ఇంగ్లీష్ రొమాంటిక్ మూవీ (తెలుగు డబ్బింగ్) | జనవరి 9 |
| జీ5 (ZEE5) | మాస్క్ | తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ | జనవరి 9 |
| జీ5 (ZEE5) | జోతో కండో కోల్‌కత్తాయి | బెంగాలీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ | జనవరి 9 |
| జీ5 (ZEE5) | హనీమూన్ సే హత్య | హిందీ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ | జనవరి 9 |
| జీ5 (ZEE5) | రానీ: ది రూలర్ | కన్నడ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా | జనవరి 9 |
| సన్ నెక్ట్స్ | సైలెంట్ స్క్రీమ్స్ | తెలుగు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ | జనవరి 8 |
| సన్ నెక్ట్స్ | రాధేయ | కన్నడ క్రైమ్ మిస్టరీ (తెలుగు డబ్బింగ్) | జనవరి 8 |
| సన్ నెక్ట్స్ | అంగమ్మళ్ | తమిళ రూరల్ ఫ్యామిలీ డ్రామా | జనవరి 9 |
| జియో హాట్‌స్టార్ | వెపన్స్ | ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ | జనవరి 8 |
| జియో హాట్‌స్టార్ | ఏ థౌజండ్ బ్లోస్ (సీజన్ 2) | ఇంగ్లీష్ హిస్టారికల్ క్రైమ్ డ్రామా | జనవరి 9 |
| జియో హాట్‌స్టార్ | ది పిట్ (సీజన్ 2) | ఇంగ్లీష్ మెడికల్ డ్రామా (తెలుగు డబ్బింగ్) | జనవరి 9 |
| సోనీ లివ్ | ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ (S2) | హిందీ బయోగ్రఫీ హిస్టారికల్ ఫిక్షన్ | జనవరి 9 |
| సోనీ లివ్ | కాలంకావల్: ది వెనమ్ బినీత్ | మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ | జనవరి 9 |
| అమెజాన్ ప్రైమ్ | బాల్టి | తమిళ్/మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా | జనవరి 9 |
| చౌపల్ | ఛల్లా మడ్ కే నహీ ఆయా | పంజాబీ ఫ్యామిలీ డ్రామా | జనవరి 8 |
| లయన్స్ గేట్ ప్లే | కాళరాత్రి (సీజన్ 2) | బెంగాలీ సైకలాజికల్ మిస్టరీ (హోయ్‌చోయ్) | జనవరి 9 |
ఓటీటీలోకి 2 రోజుల్లో 24
ఇలా గత రెండు రోజుల్లోనే (జనవరి 7, 8) ఏకంగా 24 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో అఖండ 2, దే దే ప్యార్ దే 2, కానిస్టేబుల్ కనకం 2, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ 2, ది పిట్ సీజన్ 2, కాళరాత్రి 2, కాలంకావల్, డ్యుయల్, హిజ్ అండ్ హర్, రాధేయ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్, మాస్క్, వెపన్స్, సైలెంట్ స్క్రీమ్స్, ఏకం, హనీమూన్ సే హత్యతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


