OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు.. చూసేందుకు అన్నీ స్పెషల్, 4 మరింత ఇంట్రెస్టింగ్.. ఆ రెండింట్లో 4,4!

OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో అన్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీల్లో ఉన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Jul 27, 2026, 06:24:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Telugu New: గతవారం తెలుగు భాషలో 12 సినిమాలు ఓటీటీకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే వంటి 5 ఓటీటీల్లో ఇన్వెస్టిగేటివ్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు.. చూసేందుకు అన్నీ స్పెషల్, 4 మరింత ఇంట్రెస్టింగ్.. ఆ రెండింట్లో 4,4!
ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు.. చూసేందుకు అన్నీ స్పెషల్, 4 మరింత ఇంట్రెస్టింగ్.. ఆ రెండింట్లో 4,4!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది ట్రూతర్స్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 24

72 అవర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూలై 24

ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కాంటెంపరరీ ఫిక్షన్ రొమాంటింక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24

కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ కామెడీ ఫ్యామిలీ హీస్ట్ డ్రామా మూవీ)- జూలై 24

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మాన్‌స్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ (తెలుగు డబ్బింగ్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- జూలై 22

పురుషః (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 24 (ఆహా ఓటీటీలో కూడా)

నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 24

ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24

ఈటీవీ విన్ ఓటీటీ

కేస్ ఆఫ్ కొండాన (తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 23

జాతిరత్నం (తెలుగు ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా సినిమా)- జూలై 26

పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ మలయాళ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 24

ప్రొటెక్టర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 24

ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు

ఇలా గత వారం (జూలై 20 నుంచి 26 వరకు) తెలుగులో 12 సినిమాల వరకు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

4 ఇంట్రెస్టింగ్

అయితే, తెలుగు స్ట్రయిట్ మూవీస్ అయిన జాతిరత్నం, కేస్ ఆఫ్ కొండాన, నాగబంధం, పురుషః వంటి నాలుగు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో చెరోదాంట్లో 4, 4 చొప్పున సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

4 తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఎందుకు ఇంట్రెస్టింగ్ అనేది ఇక్కడ చూద్దాం:

ఆధ్యాత్మిక రహస్యాల 'నాగబంధం'

విరాట్ రాజ్ హీరోగా నటించిన చిత్రం 'నాగబంధం' (ది సీక్రెట్ ట్రెజర్). ప్రాచీన నిధులు, రహస్య నిధిని కాపాడే నాగబంధం అనే ఆధ్యాత్మిక నమ్మకం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అడ్వెంచరస్ డివైన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.

భావన ప్రధాన పాత్రలో 'కేస్ ఆఫ్ కొండాన'

ఒకప్పటి పాపులర్ హీరోయిన్ భావన మీనన్ కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'కేస్ ఆఫ్ కొండాన'. ఒక రాత్రి వేళ కొండాన అనే ప్రాంతంలో జరిగే అనూహ్య నేరం, దాని చుట్టూ తిరిగే పోలీస్ విచారణ ఈ సినిమా సారాంశం. శక్తివంతమైన పోలీస్ అధికారిణి పాత్రలో భావన నటన, క్లైమాక్స్ ట్విస్టులు థ్రిల్లర్ ప్రియులను కట్టిపడేసేలా దర్శకుడు దేవిప్రసాద్ శెట్టి తీర్చిదిద్దారు.

వినోదభరితంగా రాశి-శశాంక్‌ల 'జాతిరత్నం'

పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్ రాశి, నటుడు శశాంక్ అత్త, అల్లుడుగా నటించిన ఓటీటీ సినిమా 'జాతిరత్నం'. పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో సాగే ఈ సినిమాలో నవ్వులతో పాటు కుటుంబ భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నాయి. జాతకాలను విపరీతంగా నమ్మే విక్రమ్ జీవితంలోకి అనుకోకుండా వచ్చిన సవాలు, దానిని ఎదుర్కొనే క్రమంలో పుట్టే హాస్యం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.

విలక్షణమైన కోణంలో 'పురుషః'

సమాజంలో మగవారి జీవితం, వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, సంక్లిష్టమైన బాధ్యతలను విశ్లేషిస్తూ తెరకెక్కిన చిత్రం 'పురుషః'. ఓటీటీ ట్రెండింగ్‌లో నిలుస్తోన్న ఈ చిత్రం ఒక భిన్నమైన ఆలోచనా ధోరణితో వస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవ సంబంధాలలో వచ్చే మార్పులను, భావోద్వేగాలను దర్శకుడు ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More