OTT Movies This Week: వేసవి సెలవుల వేళ థియేటర్లతో పాటు ఓటీటీ సంస్థలు కూడా నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ మధ్యలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న వాటిలో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న 10 సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం.
శర్వానంద్ బైకర్ (నెట్‌ఫ్లిక్స్ - మే 1)

హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన బైకర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1న ఓటీటీ రిలీజ్ అవనుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, తండ్రి కలను నెరవేర్చి అంతర్జాతీయ వేదికపై భారత్‌ను గర్వపడేలా చేసే ఒక రేసర్ కథ. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. రేసింగ్ ప్రియులకు ఇది పక్కా విజువల్ ట్రీట్.
సంగీత్ శోభన్ రాకాస ఓటీటీ
తెలుగులో సూపర్ హిట్ అయిన హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఓ బ్రహ్మరాక్షసుడిని అంతం చేసేందుకు యువకుడి చుట్టూ జరిగే కథ ఇది.
లారెన్స్ ఆఫ్ పంజాబ్ (జీ5)
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ఓటీటీ సిరీస్ 'లారెన్స్ ఆఫ్ పంజాబ్'. పంజాబ్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా మొదలై, జైలు నుంచే 700 మందికి పైగా సభ్యులతో గ్లోబల్ క్రైమ్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న గ్యాంగ్ బాస్‌గా అతడు ఎలా ఎదిగాడనేది ఇందులో చూపించనున్నారు. జీ5లో లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
ఉత్కంఠ రేపే అంతర్జాతీయ కంటెంట్
స్ట్రెయిట్ టు హెల్ (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 27): జపాన్ సోదెగత్తె కజుకో హోసోకి జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ఇది. పేదరికం నుంచి టీవీ సెలబ్రిటీగా ఎదిగిన ఆమె ప్రయాణంలోని వివాదాలు, అండర్‌వరల్డ్ లింకుల చుట్టూ ఈ డ్రామా సాగుతుంది.
{{/usCountry}}స్ట్రెయిట్ టు హెల్ (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 27): జపాన్ సోదెగత్తె కజుకో హోసోకి జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ఇది. పేదరికం నుంచి టీవీ సెలబ్రిటీగా ఎదిగిన ఆమె ప్రయాణంలోని వివాదాలు, అండర్‌వరల్డ్ లింకుల చుట్టూ ఈ డ్రామా సాగుతుంది.
{{/usCountry}}మ్యాన్ ఆన్ ఫైర్ (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 30): ఏజే క్విన్నెల్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఓటీటీ సిరీస్, ఒక మాజీ సైనికుడి ప్రతీకార గాథ. యాహ్యా అబ్దుల్-మతీన్ II ప్రధాన పాత్రలో నటించారు.
షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్? (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 29): ఒక హత్య కేసులో ప్రధాన సాక్షిగా మారిన కాబోయే భార్య కథ ఇది. తన కాబోయే భర్త హంతకుడని తెలిసి అతడికి వ్యతిరేకంగా ఆమె సాక్ష్యాలను ఎలా సేకరించిందో చూపించే థ్రిల్లింగ్ డాక్యుమెంటరీ.
విడోస్ బే (ఆపిల్ టీవీ+ - ఏప్రిల్ 29): ఒక వింత ద్వీపం చుట్టూ అల్లుకున్న ఓటీటీ మిస్టరీ థ్రిల్లర్. వైఫై, సిగ్నల్ కూడా లేని ఆ ఊరిని టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలనుకున్న మేయర్ ఎలాంటి గండాలను ఎదుర్కొన్నాడో ఇందులో చూడొచ్చు.
రీజనల్ అండ్ ఇండియన్ ఒరిజినల్స్
హిందీలో సూపర్ హిట్ అయిన 'ఉందెఖి' సీజన్ 4 మే 1 నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అత్వాల్ కుటుంబంలోని అధికార పోరాటం ఈ సీజన్‌లో పతాక స్థాయికి చేరనుంది.
అలాగే హర్యానా బాక్సింగ్ నేపథ్యంలో దివ్యేందు, పుల్కిత్ సామ్రాట్ నటించిన 'గ్లోరీ' కూడా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఒక్కదాంట్లోనే 6
మలయాళీ స్టార్ జయసూర్య నటించిన ఫాంటసీ కామెడీ 'ఆడు 3' కూడా అదే రోజు అంటే మే 1 నుంచి జీ5 ఓటీటీలో సందడి చేయనుంది. ఇలా ఈ వారం చూసేందుకు 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రానుండగా.. వాటిలో ఏకంగా 6 ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అలాగే, ఒక్క మే 1 రోజున 5 మూవీస్, స్పెషల్‌గా 2 తెలుగులో ఓటీటీ ప్రీమియర్ కానున్నాయి.