OTT Telugu Movies: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 4 మాత్రం ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
OTT Telugu Movies: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉన్నాయి. 4 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వివిధ జోనర్లతో, విభిన్న ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.
ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలన్నీ వివిధ జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అవేంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అనగనగా ఒక రాజు (తెలుగు రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 11
కొహ్రా సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12
టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
క్రాస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
లవ్ మీ లవ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13
ఘోస్ట్స్ ఇన్ ట్రబుల్ (జీఎస్‌టీ) (తెలుగు డబ్బింగ్ కన్నడ హారర్ కామెడీ ఫిల్మ్)- ఫిబ్రవరి 13
ఐ యామ్ గాడ్ (తెలుగు డబ్బింగ్ కన్నడ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13
ఈటీవీ విన్ ఓటీటీ
మరువ తరమా (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 14
బామ్మ చెప్పిన కథ (తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 15
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 12
ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13
మన శంకర వరప్రసాద్ గారు (తెలుగు కామెడీ యాక్షన్ డ్రామా సినిమా)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 11
బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 12
ఓటీటీలోకి తెలుగులో 14 సినిమాలు
ఇలా గత వారం (ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు) తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్నీ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 4
అయితే, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, మరువ తరమా, బామ్మ చెప్పిన కథ వంటి నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమాలు మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
సంక్రాంతి సినిమాలు
అయితే, ఈ నాలుగు సినిమాల్లో రెండు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైనవే. జనవరి 12న మన శంకర వర ప్రసాద్ గారు, జనవరి 14న అనగనగా ఒక రాజు థియేటర్లలో విడుదలై మంచి హిట్స్ అందుకున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


