ఓటీటీలోకి ఈ వారం తెలుగులో 4 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒకేరోజు 3- హారర్, సైకో థ్రిల్లర్, రొమాంటిక్, కామెడీ జోనర్లలో!
ఓటీటీలోకి ఈ వారం మరిన్ని సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చాలా ఇంట్రెస్ట్రింగ్‌గా నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో ఒకేరోజు 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా.. హారర్, సైకో క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, ఎమోషనల్ జోనర్లలో సినిమాలు ఉన్నాయి.
ప్రతివారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, వాటిలో ఈ వారం చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్‌గా నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

ఒకేరోజు 3 స్ట్రీమింగ్
అందులో 3 ఒకే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా.. హారర్, సైకో క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, లవ్ ఎమోషనల్ జోనర్లలో సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ
తెలుగులో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా వచ్చిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. న్యూ డైరెక్టర్ సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ ఉద్దెమారి, తేజస్విని రావు హీరో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా క్లైమాక్స్ తెలుగు ఆడియెన్స్‌ను షాక్‌కు గురి చేసింది.
రస్టిక్ ట్రాజిక్ లవ్ స్టోరీగా, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి ఈ వారమే ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈటీవీ విన్‌లో డిసెంబర్ 18 నుంచి రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ప్రేమంటే ఓటీటీ
ప్రియదర్శి, ఆనందిల రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమంటే. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్‌లైన్. యాంకర్ సుమ, వెన్నెల కిశోర్, హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రలు పోషించిన ప్రేమంటే సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట వివాహం తర్వాత ఎలా ఉన్నారనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.
ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్ తెచ్చుకున్న ప్రేమంటే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. డిసెంబర్ 19న ప్రేమంటే ఓటీటీ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలోకి రానుంది ప్రేమంటే సినిమా.
నయనం ఓటీటీ
వరుణ్ సందేశ్ హీరోగా బిగ్ బాస్ బ్యూటి ప్రియాంక జైన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఓటీటీ సిరీస్ నయనం. స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సైకో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రానుంది.
పక్క వారి జీవితంలో నాలుగు నిమిషాలు తెలుసుకునేందుకు డాక్టర్ నయన్ చేసిన ప్రయోగం చుట్టూ సిరీస్ సాగుతుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ నయనం జీ5 ఓటీటీలో నేరుగా డిజిటల్ ప్రీమియర్ కానుంది.
దివ్య దృష్టి ఓటీటీ
తెలుగు హారర్, ఫాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన మూవీ దివ్య దృష్టి (Divya Drishti). ప్రేమ కావాలి హీరోయిన్ ఇషా చావ్లా, సునీల్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు కబీర్ లాల్ దర్శకత్వం వహించారు.
డిసెంబర్ 19 నుంచి సన్ నెక్ట్స్‌లో దివ్య దృష్టి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా దివ్య దృష్టి ఓటీటీ రిలీజ్ కావడం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


