ఉగాది (మార్చి 20)తో కొత్త తెలుగు సంవత్సరం మొదలైపోయింది. ఇదే న్యూ ఇయర్ రోజున అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో రెండు సినిమాలు భారీ అంచనాలతో థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలే ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాలు నిన్న (మార్చి 20) థియేటర్లలో విడుదలయ్యాయి.
1300 కోట్లు కొల్లగొట్టి మరి

గతేడాది ధురంధర్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.
అంతేకాకుండా ధురంధర్ సినిమాలో యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్లే, లవ్ ట్రాక్ ఇండియన్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. దాంతో ఆ మూవీ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల నడుమ నిన్న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా ధురంధర్ 2 విడుదల అయింది.
ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్
ధురంధర్ 2 కూడా ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజే సుమారు రూ. 146 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అయింది ధురంధర్ 2 మూవీ. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
అయితే, ధురంధర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ, ధురంధర్ సీక్వెల్ మూవీ ధురంధర్ ది రివేంజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మాత్రం మారిపోయింది. సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్న జియో హాట్‌స్టార్‌కు ధురంధర్ 2 ఓటీటీ రైట్స్ ఇచ్చేశారు. దీని ధర సుమారుగా రూ. 150 కోట్లు అని టాక్.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
అంటే, జియో హాట్‌స్టార్‌లో ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ధురంధర్ లాగానే సెకండా పార్ట్ ది రివేంజ్ కూడా సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీ ప్రీమియర్ అవనున్నట్లు సమాచారం. అంటే, మే చివరి వీక్‌లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
{{/usCountry}}అంటే, జియో హాట్‌స్టార్‌లో ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ధురంధర్ లాగానే సెకండా పార్ట్ ది రివేంజ్ కూడా సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీ ప్రీమియర్ అవనున్నట్లు సమాచారం. అంటే, మే చివరి వీక్‌లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
{{/usCountry}}ఇక ఉగాది 2026 రోజున టాలీవుడ్‌లో థియేట్రికల్ రిలీజ్ అయిన అతిపెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల మధ్య మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్
కానీ, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్‌లా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ వివరాలు ఆసక్తిగా మారాయి. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రైట్స్‌ను రూ. 80 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన సుమారు నాలుగు లేదా ఐదు వారాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీలోకి వచ్చేయనుందని సమాచారం.