సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్‌పై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపిస్తూనే, సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయటపెట్టారు.

ఆదిత్య ధర్ ఎదుగుదల చూసి ఇండస్ట్రీలో చాలామంది అసూయతో రగిలిపోతున్నారని, ఆయన, అతని భార్య యామీ గౌతమ్ ఎప్పుడు ఫెయిల్ అవుతారా అని అందరూ కాచుకుని కూర్చున్నారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
"కథా గమనాన్ని మార్చేశారు.. అందుకే వారంటే ద్వేషం!"
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. "ఆదిత్య ధర్ సినిమా బిజినెస్‌ను ఎంతలా ప్రభావితం చేశారో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన వెండితెరపై కథ చెప్పే విధానాన్ని (గ్రామర్) పూర్తిగా మార్చేశారు" అని అన్నారు.
"హిందీలోనే కాదు, ఇకపై ఏ భాషలోనూ సినిమాలు పాత పద్ధతిలో ఉండవు. ఆదిత్య సృష్టించిన బెంచ్ మార్క్ చూసి తెలుగులో కూడా చాలా పెద్ద బడ్జెట్ యాక్షన్ సినిమాలు ప్రస్తుతం రీ-షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీనివల్ల నిర్మాతలపై కోట్ల రూపాయల భారం పడుతోంది. అందుకే ఇండస్ట్రీకి ఆయనంటే కోపం. అందరినీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగారు, దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది" అని ఆర్జీవీ విశ్లేషించారు.
జంటగా జాగ్రత్తగా ఉండాలి!
ఆదిత్య భార్య, నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ గురించి కూడా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హక్’ సినిమాతో యామీ నటిగా తన విశ్వరూపం చూపించారని, ఆ దంపతులు ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించారు రామ్ గోపాల్ వర్మ.
{{/usCountry}}ఆదిత్య భార్య, నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ గురించి కూడా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హక్’ సినిమాతో యామీ నటిగా తన విశ్వరూపం చూపించారని, ఆ దంపతులు ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించారు రామ్ గోపాల్ వర్మ.
{{/usCountry}}"ఆదిత్య ధర్, యామీ గౌతమ్ జంట ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, వారు ఎప్పుడు పొరపాటు చేస్తారా, ఎప్పుడు కింద పడతారా అని చిత్ర పరిశ్రమ మొత్తం వేచి చూస్తోంది" అని ఆర్జీవీ హెచ్చరించారు. అంటే దర్శకుడిగా ఆదిత్య ధర్, నటిగా యామీ గౌతమ్ ఇద్దరు మంచి సక్సెస్‌లో ఉన్నారు. వారెప్పుడు ఫెయిల్ అవుతారా అని అసూయతో ఇండస్ట్రీ వేచి చూస్తుందన్న అర్థంలో ఆర్జీవీ అలా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
'ధురంధర్ 2' వర్సెస్ 'ఉస్తాద్ భగత్ సింగ్'
ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ రూపొందిస్తున్న ‘ధురంధర్ 2’ (ధురంధర్: ది రివెంజ్) కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఏకంగా రూ. 1300 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.
మార్చి 19న విడుదల కానున్న ధురంధర్ 2 సినిమా సుమారు నాలుగు గంటల (3 గంటల 55 నిమిషాలు) నిడివితో విడుదల కానుంది. అయితే, ధురంధర్ ది రివేంజ్ సినిమాకు యశ్ మూవీ టాక్సిక్ నుంచి బాక్సాఫీస్ పోటీ తప్పింది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మాత్రం ధురంధర్ 2కి గట్టి పోటీ ఎదురవుతోంది.
అసలైన యుద్ధం
హరీష్ శంకర్ దర్శకత్వంలో వహించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అదే రోజున (మార్చి 19) థియేటర్లలోకి రానుంది. మార్చి 18 సాయంత్రమే ఈ రెండు సినిమాలకు పెయిడ్ ప్రివ్యూలు పడనుండటంతో బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధం మొదలుకానుంది.