...
...
Next Story

అమ్మమ్మ కోసం ఆందోళన- తిరుమల శ్రీవారిని ఫ్యామిలీతో దర్శించుకున్న శ్రీలీల- మనవరాలిగా బాధ్యత- నెటిజన్స్ ఫిదా!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. అయితే, శ్రీలీలను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య తన అమ్మమ్మకు ఇబ్బంది కలగకుండా హీరోయిన్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

Published on: Dec 30, 2025, 17:32:21 IST
Advertisement

తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. మంగళవారం (డిసెంబర్ 30) తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. వీరిలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అమ్మమ్మ భద్రత కోసం ఆరాటం

అమ్మమ్మ కోసం ఆందోళన- తిరుమల శ్రీవారిని ఫ్యామిలీతో దర్శించుకున్న శ్రీలీల- మనవరాలిగా బాధ్యత- నెటిజన్స్ ఫిదా!
అమ్మమ్మ కోసం ఆందోళన- తిరుమల శ్రీవారిని ఫ్యామిలీతో దర్శించుకున్న శ్రీలీల- మనవరాలిగా బాధ్యత- నెటిజన్స్ ఫిదా!

తల్లి డాక్టర్ స్వర్ణలత, అమ్మమ్మతో కలిసి హీరోయిన్ శ్రీలీల స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీలీల ఆలయానికి చేరుకున్నారని తెలియగానే అభిమానులు ఆమెను చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తన అమ్మమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని శ్రీలీల ఎంతో కంగారు పడ్డారు.

అమ్మమ్మ కింద చూసుకో

"అమ్మమ్మ.. కింద చూసుకో" అంటూ ఆమెను జాగ్రత్తగా పట్టుకుని, జనం మధ్యలో నుంచి భద్రంగా తీసుకువెళ్లారు శ్రీలీల. సెక్యూరిటీ సిబ్బంది ఫ్యాన్స్‌ను పక్కకు తప్పుకోమని కోరుతున్నప్పటికీ శ్రీలీల మాత్రం తన దృష్టినంతా అమ్మమ్మపైనే ఉంచి, బాధ్యతగల మనవరాలిగా అందరి ప్రశంసలు అందుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో ప్రముఖులు

అమ్మమ్మ కోసం శ్రీలీల ఆందోళన చెందడం, ఆమె పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం అభిమానులతోపాటు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఆలయం వెలుపల తీసిన మరో వీడియోలో శ్రీలీల, ఆమె తల్లి పొడవైన క్యూలో నిలబడి తమ దర్శనం కోసం ఎదురు చూస్తూ కనిపించారు.

తెలంగాణ సీఎంతోపాటు

ఇదిలా ఉంటే, శ్రీలీలతో పాటు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, శివాజీ, మాజీ మంత్రి రోజా, టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తదితరులు వైకుంఠ ద్వారం గుండా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.

కెరీర్ పరంగా దూసుకుపోతున్న శ్రీలీల

ఆ తర్వాత 'ధమాకా', 'భగవంత్ కేసరి', 'గుంటూరు కారం' వంటి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు శ్రీలీల. ఇటీవల 'పుష్ప 2'లో ‘కిస్సిక్’ సాంగ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. త్వరలో పవన్ కల్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో కనిపించనున్నారు.

వరుస ఫ్లాప్స్ వచ్చినప్పటికీ

అలాగే శివ కార్తికేయన్ సినిమాతో తమిళంలో, కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్నారు శ్రీలీల. వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నప్పటికీ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది బ్యూటిఫుల్ శ్రీలీల.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks