...
...
Next Story

ఓటీటీకి ఇవాళ మూవీగా వచ్చిన తెలుగు బొల్డ్ రొమాంటిక్ సిరీస్- ముగ్గురు స్టార్ హీరోయిన్ల ముద్దులాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్

ఓటీటీలోకి ఇవాళ మూవీగా వచ్చేసిందు తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 3 రోజెస్. 2021లో నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన త్రీ రోజెస్ సిరీస్ ఇప్పుడు చిత్రంగా మారి డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ నటించిన 3 రోజెస్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై లుక్కేద్దాం.

Published on: Oct 23, 2025, 11:24:44 IST
Advertisement

రెండు పార్ట్స్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాహుబలి సిరీస్ ఒక్క మూవీగా మారి ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి ది ఎపిక్ చిత్రాన్ని అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నా విషయం తెలిసిందే.

3 రోజెస్ మరో ట్రెండ్

ఓటీటీకి ఇవాళ మూవీగా వచ్చిన తెలుగు బొల్డ్ రొమాంటిక్ సిరీస్- ముగ్గురు స్టార్ హీరోయిన్ల ముద్దులాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్
ఓటీటీకి ఇవాళ మూవీగా వచ్చిన తెలుగు బొల్డ్ రొమాంటిక్ సిరీస్- ముగ్గురు స్టార్ హీరోయిన్ల ముద్దులాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్

అయితే, రెండు పార్ట్స్‌గా రిలీజ్ అయిన సినిమాలు ఒక్కటిగా మారుతున్న ఈ ట్రెండ్‌లో తాజాగా 3 రోజెస్ సిరీస్ మరో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇదివరకే ఓటీటీ వెబ్ సిరీస్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఒక్క మూవీగా మారి డిజిటల్ ప్రీమియర్ కానుంది.

ఓటీటీ సినిమాగా

అవును, వెబ్ సిరీస్ అయిన త్రీ రోజెస్ ఒకే చిత్రంగా ఓటీటీ సినిమాగా ఆడియెన్స్ ముందుకు ఇవాళ (అక్టోబర్ 23) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 2021లో నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన త్రీ రోజెస్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. ముగ్గురు స్టార్ హీరోయిన్లు ముద్దులాటలు, డబుల్ మీనింగ్ డైలెగ్స్‌తో బోల్డ్ కామెడీ సిరీస్‌గా ఆకట్టుకుంది.

ముగ్గురు బ్యూటిపుల్ హీరోయిన్స్

బ్యూటిఫుల్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 3 రోజెస్ సిరీస్‌కు రవి నంబూరి కథ అందించగా.. మ్యాగీ దర్శకత్వం వహించారు. స్టార్ డైరెక్టర్ మారుతి క్రియేటర్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‌ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) నిర్మించారు.

8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్

రెండు గంటల 14 నిమిషాల రన్‌టైమ్‌తో త్రీ రోజెస్ మూవీగా ఓటీటీ రిలీజ్ అయింది. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆహాలోనే 3 రోజెస్ ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి ఆహాలో సిరీస్‌తోపాటు త్రీ రోజెస్ మూవీ కూడా ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. అంటే, అటు సిరీస్, ఇటు సినిమా రెండు ఆహా ఓటీటీలో అలరించనున్నాయి.

3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ

మరి ఇప్పటివరకు త్రీ రోజెస్ సిరీస్‌ను చూడనివాళ్లు మూవీగా ఎంచక్కా వీక్షించవచ్చు. ఇదిలా ఉంటే, రీసెంట్‌గానే త్రీ రోజెస్ సీజన్ 2ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలో 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని ఆహా ప్రకటించింది. అయితే, ఈ సెకండ్ సీజన్‌లో హీరోయిన్లు, డైరెక్టర్, రచయిత మారిపోయారు.

మారినవాళ్లు

3 రోజెస్ సీజన్ 2లో ఈషా రెబ్బాతోపాటు కొత్తగా హీరోయిన్ రాశి సింగ్, సోషల్ మీడియా స్టార్ కుషిత కల్లపు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక త్రీ రోజెస్ 2కి రవి నంబూరితోపాటు సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe