...
...
Next Story

OTT Movies: ఓటీటీలోకి నిన్న రిలీజైన పాపం ప్రతాప్, భూత్ బంగ్లా- ఒకటి విలేజ్ డ్రామా, మరోటి హారర్ కామెడీ- ఎక్కడంటే?

Bhooth Bangla And Papam Prathap OTT Streaming Platforms: ఓటీటీలోకి నిన్న థియేటర్లలో విడుదలైన పాపం ప్రతాప్, భూత్ బంగ్లా సినిమాల స్ట్రీమింగ్ వివరాలపై ఇంట్రెస్ట్ నెలకొంది. ఒక సినిమా విలేజ్ డ్రామాతో ఉంటే మరోటి హారర్ కామెడీగా తెరకెక్కింది. పాపం ప్రతాప్, భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ వివరాలు చూద్దాం.

Published on: Apr 18, 2026, 14:02:14 IST
Advertisement

Bhooth Bangla Papam Prathap OTT Release Platforms: ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే, థియేటర్లలో విడుదలైన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు మరింత ఆసక్తిగా ఉంటాయి. ప్రతి వారం సరికొత్త మూవీస్ థియేటర్లలో రిలీజ్ కాగానే వాటి ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్ ఏంటా అని వెతుకుతుంటారు.

ఓటీటీలోకి నిన్న రిలీజైన పాపం ప్రతాప్, భూత్ బంగ్లా- ఒకటి విలేజ్ డ్రామా, మరోటి హారర్ కామెడీ- ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన పాపం ప్రతాప్, భూత్ బంగ్లా- ఒకటి విలేజ్ డ్రామా, మరోటి హారర్ కామెడీ- ఎక్కడంటే?

ఈ క్రమంలోనే నిన్న రిలీజ్ అయిన పాపం ప్రతాప్, భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇటు తెలుగు, అటు బాలీవుడ్ ఆడియెన్స్‌లలో ఇంట్రెస్టింగ్ నెలకొంది. మరి పాపం ప్రతాప్, భూత్ బంగ్లా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సిన్ ఓటీటీ సిరీస్‌తో

తెలుగు మంచి కథలతో క్రేజ్ తెచ్చుకుంటున్న యంగ్ హీరో తిరువీర్ సిన్ ఓటీటీ సిరీస్‌తో అట్రాక్ట్ చేసిన తిరువీర్ మసూద, పరేషాన్ మూవీస్‌తో అలరించాడు. తాజాగా తిరువీర్ హీరోగా విలేజ్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన సినిమానే పాపం ప్రతాప్. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తిరువీర్‌కు జోడీగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా చేసింది.

అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ రాశి సైతం కీలక పాత్ర పోషించింది. వీరితోపాటు అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. నిన్న (ఏప్రిల్ 17) థియేటర్లలో విడుదలైన పాపం ప్రతాప్ సినిమాకు టాక్ బాగానే ఉంది. పెళ్లయిన మూడు, నాలుగు రోజులకు భర్తపై భార్య పెట్టే పంచాయితీ కథగా ఈ సినిమా సాగుతుంది.

పాపం ప్రతాప్ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్

అయితే పాపం ప్రతాప్ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మించింది. ఈ లెక్కన ఈటీవీ విన్‌లోనే పాపం ప్రతాప్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే, థియేటర్ విడుదలకు నాలుగు వారాల తర్వాత పాపం ప్రతాప్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

హారర్ కామెడీ జోనర్‌లో భూత్ బంగ్లా

పాపం ప్రతాప్‌తోపాటు నిన్న విడుదలైన మరో సినిమా భూత్ బంగ్లా. హిందీలో హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పాపులర్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, వామికా గబ్బి, టబు, రాజ్‌పాల్ యాదవ్, పరేష్ రావల్, మిథిలా పాల్కర్ తదితరులు నటించారు.

సుమారు 14 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్-ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. దీంతో భూత్ బంగ్లాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 17న విడుదలైన భూత్ బంగ్లాకు కాస్తా మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కానీ, అక్షయ్ కుమార్ నటన బాగుందని, గ్రాఫిక్స్ అదిరిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్

ఈ నేపథ్యంలో భూత్ బంగ్లా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భూత్ బంగ్లా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌లో భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అలాగే, జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో భూత్ బంగ్లా ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని టాక్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe