ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవి హారర్ కామెడీ, యాక్షన్, మిస్టరీ, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు రిలీజ్ అయిన ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ధురంధర్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 30
మిరాకిల్: ది బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- జనవరి 30
టేక్ దట్ (ఇంగ్లీష్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్)- జనవరి 30
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
దల్ దల్ (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30
జియో హాట్‌స్టార్ ఓటీటీ
సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ ఫాంటసీ డ్రామా సినిమా)- జనవరి 30
సన్ నెక్ట్స్ ఓటీటీ
పతంగ్ (తెలుగు రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం)- జనవరి 30
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ లైవ్ యాక్షన్ పప్పెట్ చిల్డ్రన్ మ్యూజికల్ ఎడ్యుకేషనల్ సిరీస్)- జనవరి 30
జీ5 ఓటీటీ
దేవ్‌కేళ్ (మరాఠీ మైథలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
ఇలా ఇవాళ (జనవరి 30) 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ధురంధర్, సర్వం మాయ, దేవ్‌కేళ్, దల్ దల్, పతంగ్‌తో ఐదు సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఆ 3 సినిమాల విశేషాలు ఓసారి చూద్దాం.
ధురంధర్ ఓటీటీ
రూ. 1300 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన హిందీ సినిమా ధురంధర్. అన్ని కోట్లు కలెక్ట్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా దురంధర్ నిలిచింది. రణ్వీర్ సింగ్ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా సారా అర్జున్ అడుగు పెట్టింది.
పతంగ్ ఓటీటీ
{{/usCountry}}రూ. 1300 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన హిందీ సినిమా ధురంధర్. అన్ని కోట్లు కలెక్ట్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా దురంధర్ నిలిచింది. రణ్వీర్ సింగ్ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా సారా అర్జున్ అడుగు పెట్టింది.
పతంగ్ ఓటీటీ
{{/usCountry}}తెలుగులో తెరకెక్కిన రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా పతంగ్. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ప్రీతి పగడాల హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.
సర్వం మాయ ఓటీటీ
మలయాళంలో హారర్ ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన సర్వం మాయ ఓటీటీలోకి తెలుగులో కూడా వచ్చేసింది. నవీన్ పౌలి, ప్రీతి ముకుందన్, రియా శిబు నటించిన ఈ మూవీ తెలుగులో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయింది.