Top 5 OTT Crime Thrillers Free: వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు ఎక్కువగా ఇష్టపడేది క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలనే. మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు, క్షణం క్షణం ఉత్కంఠ రేపే సన్నివేశాలు ఉంటే ఆ కిక్కే వేరు. అయితే రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండా ప్రైమ్ కంటెంట్‌ను ఉచితంగా చూడగలిగితే అంతకంటే కావలసిందేముంది?

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) తమ వినియోగదారులకు అలాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా జీ5 ఓటీటీలో ఉచితంగా వీక్షించగలిగే ఐదు పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. మిథ్య (Mithya)
సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలను ఇష్టపడేవారికి 'మిథ్య' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ జూహి, ఆమె వద్ద చదివే విద్యార్థిని రియా మధ్య జరిగే మైండ్ గేమ్ ఆధారంగా ఈ ఓటీటీ సిరీస్ సాగుతుంది. రియా తన అసైన్‌మెంట్‌లో కాపీ కొట్టిందని ప్రొఫెసర్ ఆరోపించడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది.
ఆ ఆరోపణను మనసులో పెట్టుకున్న విద్యార్థిని రియా, టీచర్‌పై పగ తీర్చుకోవడానికి ఎలాంటి దారుణానికైనా ఒడిగట్టేందుకు సిద్ధపడుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుని మొత్తం 12 ఎపిసోడ్లతో ప్రేక్షకులను జీ5 ఓటీటీలో అలరిస్తోంది. దీనిని ఉచితంగా వాచ్ చేయొచ్చు.
2. అపరిచితుడు (Anniyan / Aparichithudu)
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్, ప్రకాష్ రాజ్, సదా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సంచలన చిత్రం 'అపరిచితుడు' (2005). సమాజంలోని అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను చూసి భరించే రామానుజం అనే అమాయకమైన న్యాయవాది, తనలోని 'మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్' వల్ల అపరిచితుడిగా మారి తప్పు చేసిన వారిని గరుడ పురాణం ఆధారంగా శిక్షించే తీరు అద్భుతంగా ఉంటుంది.
{{/usCountry}}స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్, ప్రకాష్ రాజ్, సదా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సంచలన చిత్రం 'అపరిచితుడు' (2005). సమాజంలోని అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను చూసి భరించే రామానుజం అనే అమాయకమైన న్యాయవాది, తనలోని 'మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్' వల్ల అపరిచితుడిగా మారి తప్పు చేసిన వారిని గరుడ పురాణం ఆధారంగా శిక్షించే తీరు అద్భుతంగా ఉంటుంది.
{{/usCountry}}ఐఎమ్‌డీబీ (IMDb) లో 8.4 రేటింగ్ సాధించిన ఈ ఎవర్ గ్రీన్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పటికీ ప్రేక్షకులను మైమరిపిస్తుంది. జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న అపరిచితుడు సినిమాను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఇప్పుడు ఫ్రీగా చూడొచ్చు.
3. టేబుల్ నెంబర్ 21 (Table No. 21)
2013లో విడుదలైన ఈ చిత్రం కాలేజీలలో జరిగే ర్యాగింగ్ ఎంతటి దారుణాలకు దారితీస్తుందో కళ్లకు కడుతుంది. పరేష్ రావల్, రాజీవ్ ఖండేల్వాల్, టీనా దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, ఒక తండ్రి తన కొడుకుపై జరిగిన దారుణమైన ర్యాగింగ్‌కు ఎలా పగ తీర్చుకున్నాడో ఊహించని మలుపులతో చూపెట్టారు.
7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న ఈ టేబుల్ నెంబర్ 21 సినిమా చివరి వరకు ప్రేక్షకులను కుర్చీల అంచులపై కూర్చోబెడుతుంది. జీ5లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ మూవీనీ ఎంచక్కా ఫ్రీగా చూడొచ్చు.
4. వేద (Vedha)
2022లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కథ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ అండ్ రివేంజ్ చుట్టూ తిరుగుతుంది. తమ జీవితాన్ని నాశనం చేసిన శత్రువులపై తండ్రీకూతుళ్లు కలిసి పగ తీర్చుకునే క్రమంలో వరుస హత్యలకు పాల్పడతారు.
ఈ దారుణమైన హత్యలను అడ్డుకోవడానికి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీలో 6.7 రేటింగ్ లభించింది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన వేద సినిమాను జీ5 ఓటీటీలో ఫ్రీగా వాచ్ చేయొచ్చు.
5. భైరవం (Bhairavam)
చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య ఒక రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం ఎలా చిచ్చు పెట్టాడనే కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం 'భైరవం'. గుడిలోని పురాతన ఖజానాను హస్తగతం చేసుకోవడానికి ఒక మంత్రి వేసే వ్యూహాలు, ఆ ఇద్దరి మిత్రుల జీవితాలను ఎలా మార్చేశాయో ఇందులో చూడవచ్చు.
కథనంలో వచ్చే ట్విస్టులు చివరి దాకా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించిన భైరవంను జీ5 ఓటీటీలో ఉచితంగా వీక్షించవచ్చు.