Weekend TV Premieres Telugu: తెలుగువారి ఇళ్లలో పండుగ వాతావరణం వచ్చిందంటే చాలు బుల్లితెర ఛానళ్లు సరికొత్త వినోదాల విందుతో ముస్తాబవుతాయి. గణేష్ నవరాత్రుల శుభసందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ 'జీ తెలుగు' ప్రేక్షకులకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
బుల్లితెర సెలబ్రిటీల సందడితో

ఈ సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం నాడు అంటే రేపు భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకవైపు సరికొత్త సినిమా టీవీ ప్రీమియర్, మరోవైపు బుల్లితెర సెలబ్రిటీల కోలాహలంతో కూడిన ప్రత్యేక కార్యక్రమంతో పండుగ శోభను ప్రతి ఇంటికీ తీసుకురానుంది.
వడ్డే నవీన్ రీ-ఎంట్రీ: 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' వరల్డ్ ప్రీమియర్
ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరో వడ్డే నవీన్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ చిత్రంతో అదిరిపోయే రీ-ఎంట్రీ ఇచ్చారు. కమల్ తేజ నర్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' చిత్రం కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునే పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో రూపొందింది.
తొలిసారిగా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు టీవీ ప్రీమియర్
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి సింగ్ నటించిన ఈ చిత్రాన్ని మొదటిసారిగా బుల్లితెరపై ప్రసారం చేస్తున్నారు. సెప్టెంబర్ 20, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. వినాయక చవితి సెలవు దినాన కుటుంబ సమేతంగా ఆస్వాదించడానికి ఈ సినిమా సరైన ఎంపికగా నిలవనుంది.
సెలబ్రిటీల హంగామా: 'జై బోలో గణేష్ మహారాజ్ కీ జై'
సినిమా వినోదం ముగిసిన వెంటనే, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి గణేష్ నవరాత్రుల ప్రత్యేక సంబరం షురూ కానుంది. 'జై బోలో గణేష్ మహారాజ్ కీ జై' పేరిట పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.
స్టార్ యాంకర్, సీనియర్ హీరోయిన్లు
{{/usCountry}}సినిమా వినోదం ముగిసిన వెంటనే, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి గణేష్ నవరాత్రుల ప్రత్యేక సంబరం షురూ కానుంది. 'జై బోలో గణేష్ మహారాజ్ కీ జై' పేరిట పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.
స్టార్ యాంకర్, సీనియర్ హీరోయిన్లు
{{/usCountry}}బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తనదైన టైమింగ్, చురుకైన యాంకరింగ్‌తో ఈ టీవీ షోను నడిపించనున్నారు. ఈ వేడుకలో సీనియర్ హీరోయిన్ రోజా, సదా మధ్య సాగే పోటీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీరిద్దరి నేతృత్వంలో జరిగే సరదా గేమ్‌లు, టీజింగ్‌లు ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచనున్నాయి.
బుల్లితెర తారల వినోదాల విందు
కేవలం వెండితెర నటీనటులే కాకుండా జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రజాదరణ పొందిన సీరియల్స్ హీరోహీరోయిన్లు ఈ వేడుకలో భాగమయ్యారు. కలర్‌ఫుల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు, కామెడీ స్కిట్లు, నవ్వులు పూయించే ఛాలెంజ్‌లతో ఈ కార్యక్రమం సాగనుంది.
డబుల్ వినోదం, డబుల్ సంబరం
ప్రతీ ఏటా ఉత్సవాల వేళ ప్రత్యేక కార్యక్రమాలతో ఆకట్టుకునే జీ తెలుగు, ఈసారి కూడా డబుల్ వినోదం, డబుల్ సంబరంతో తెలుగు ఇళ్లలో పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేయడానికి సిద్ధమైంది.