...
...
Next Story

TV & OTT: టీవీలో వీకెండ్‌కు దసరా డబుల్ ధమాకా- ఒకేరోజు 2 గ్రాండ్ షోలు- అనుపమ పరమేశ్వరన్ టు సాయి పల్లవి- ఓటీటీలో కూడా!

Zee Telugu Anupama Parameswaran Sai Pallavi: బుల్లితెర ఛానెల్ జీ తెలుగులో దసరా పండుగ సందర్భంగా డబుల్ ధామాకా ఆడియెన్స్‌కు ఇవ్వనున్నారు. అనుపమ పరమేశ్వరన్ బతుకమ్మ ఆటతోపాటు ఇంట్రెస్టింగ్ ఓటీటీ టాక్ షోతో జీ తెలుగు, జీ5 అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ షోలు ఏంటీ, ఎప్పుడు ప్రసారం అనే వివరాలు చూద్దాం.

Published on: Oct 16, 2026, 14:56:41 IST
Advertisement

Zee Telugu Dussehra Double Dhamaka Anupama Parameswaran Sai Pallavi: పండుగంటే సంబరం.. ఆ సంబరానికి వినోదం తోడైతే ఆ ఆనందమే వేరు! ఈ దసరా సందర్భంగా జీ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన వినోదాల విందును సిద్ధం చేసింది.

సంస్కృతి సాంప్రదాయాలతో

టీవీలో వీకెండ్‌కు దసరా డబుల్ ధమాకా- ఒకేరోజు 2 గ్రాండ్ షోలు- అనుపమ పరమేశ్వరన్ టు సాయి పల్లవి- ఓటీటీలో కూడా!
టీవీలో వీకెండ్‌కు దసరా డబుల్ ధమాకా- ఒకేరోజు 2 గ్రాండ్ షోలు- అనుపమ పరమేశ్వరన్ టు సాయి పల్లవి- ఓటీటీలో కూడా!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబించే ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’ ప్రత్యేక కార్యక్రమంతో పాటు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2ను ఒకే రోజు అందించనుంది జీ తెలుగు.

ఓటీటీ, బుల్లితెర ప్రేక్షకుల ముందుకు

అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటలకు దసరా వేడుకలు జీ తెలుగులో ప్రారంభం కాగా.. రాత్రి 7:30 గంటలకు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 ఓటీటీ, బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 10న మహబూబ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించిన ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని, తెలుగు సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేలా సాగింది.

క్రేజీ కళ్యాణం సినిమా టీమ్ సందడి

యాంకర్ రవి ఎనర్జిటిక్ ఎంట్రీతో మొదలైన ఈ వేడుకలో జీ తెలుగుకి చెందిన పాపులర్ సీరియల్ జంటల సందడి, వినోదభరితమైన ఛాలెంజ్‌లు, సంగీతం, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ‘క్రేజీ కళ్యాణం’ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్, ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

స్థానిక మహిళలతో అనుపమ బతుకమ్మ

బతుకమ్మ పండగ సందర్భంగా జీ తెలుగు నిర్వహించిన ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’ కార్యక్రమం అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది. దసరా ప్రత్యేక కార్యక్రమం అనంతరం ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2తో మరో ఆసక్తికరమైన వినోద ప్రయాణం ప్రారంభం కానుంది.

తొలి అతిథిగా సాయి పల్లవి

సీనియర్ హీరో, నటుడు, విలన్‌గా చేసిన జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో తొలి అతిథిగా స్టార్ హీరోయిన్​ సాయి పల్లవి పాల్గొననున్నారు. ఆమెతో జరిగే సంభాషణలు, వ్యక్తిగత అనుభవాలు, ఆసక్తికరమైన విశేషాలు ఈ కొత్త సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

జీ5 ఓటీటీలో, జీ తెలుగు ఛానెల్‌లో

ఈ కార్యక్రమం అక్టోబర్ 16న జీ5లో ఓటీటీ రిలీజ్ కానుండగా, అక్టోబర్ 18న రాత్రి 7:30 గంటలకు జీ తెలుగులో టీవీ ప్రీమియర్ అవనుంది. ప్రతి శుక్రవారం జీ5 తెలుగులో కొత్త ఎపిసోడ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా, ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

జగపతి బాబు హోస్టింగ్

జగపతి బాబు ప్రత్యేక హోస్టింగ్ స్టైల్, సాయి పల్లవి తొలి ఎపిసోడ్‌తో ఈ సీజన్ ప్రేక్షకులకు ఆసక్తికరమైన అనుభూతిని అందించనుంది. సంప్రదాయాలు, సంబరాలతో నిండిన ‘దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా 2026’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2తో జీ తెలుగు ఈ ఆదివారాన్ని మరింత వినోదంగా మార్చనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks