Brahmamudi Serial Actor Maanas Nagulapalli Bollywood OTT Debut: బుల్లితెరపై స్టార్ మా సీరియల్స్ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటున్నాయి. స్టార్ మాలోని నాలుగైదు సీరియల్స్ టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్నాయి. వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి.
చైల్డ్ ఆర్టిస్ట్ రామ్ తేజగా మానస్

బ్రహ్మముడి సీరియల్ అంత హిట్ కావడానికి అందులోని హీరో రాజు (ఒకప్పుడు స్వరాజ్), హీరోయిన్ ఇందు (ఒకప్పుడు కావ్య) పాత్రలే. రాజుగా, స్వరాజ్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ సీరియల్ హీరో మానస్ నాగులపల్లి.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మానస్ తొలి మూవీకే ప్రతిష్టాత్మక నంది అవార్డ్ అందుకోవడంతోపాటు బాలకృష్ణ, మహేశ్ బాబు, రవితేజ వంటి స్టార్స్‌తో సినిమాలు చేశాడు.
బాలకృష్ణ సినిమాకు నంది అవార్డ్
1990 ఆగస్ట్ 2 విశాఖపట్నంలో జన్మించిన మానస్ నాగులపల్లి అసలు పేరు మాస్టర్ రామ్ తేజ. 2001లో బాలకృష్ణ సూపర్ హిట్ ఫిల్మ్ నరసింహ నాయుడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ స్టార్ట్ చేశాడు మానస్. ఈ సినిమాలో మానస్ పర్ఫామెన్స్‌కు ఉత్తమ బాలనటుడిగా తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్ లభించింది.
ఆ సినిమా తర్వాత 2003లో మాస్ మహారాజా రవితేజ, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన వీడే సినిమాలో కూడా మానస్ నాగులపల్లి యాక్ట్ చేశాడు. అనంతరం 2004లో సూపర్ స్టార్ మహేశ్ బాబు-గుణ శేఖర్ కాంబినేషన్‌లోని అర్జున్ మూవీలో యాక్ట్ చేశాడు మానస్ అలియాస్ రామ్ తేజ.
స్టార్ మా అవార్డ్ కూడా
ఈ సినిమాలో నటనకుగానూ ఉత్తమ బాల నటుడిగా మానస్ స్టార్ మా అవార్డ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత చదువు కొనసాగించి బీటెక్ చేసిన మానస్ మోడల్‌గా, నటుడిగా రాణించాడు. కట్ చేస్తే.. 2011లో ఝలక్ అనే మూవీతో తెలుగులో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు మానస్ నాగులపల్లి.
{{/usCountry}}ఈ సినిమాలో నటనకుగానూ ఉత్తమ బాల నటుడిగా మానస్ స్టార్ మా అవార్డ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత చదువు కొనసాగించి బీటెక్ చేసిన మానస్ మోడల్‌గా, నటుడిగా రాణించాడు. కట్ చేస్తే.. 2011లో ఝలక్ అనే మూవీతో తెలుగులో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు మానస్ నాగులపల్లి.
{{/usCountry}}ఆ తర్వాత ఆకుపచ్చ సంకేతం, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, సోడా గోలి సోడా, క్షీర సాగర మధనం వంటి సినిమాలతో అలరించాడు బ్రహ్మముడి మానస్. ఈ సినిమాల తర్వాత 2021లో బుల్లితెరపై కోయిలమ్మ సీరియల్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మించడం విశేషం.
బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా
ఆ తర్వాత 2023లో స్టార్ట్ అయిన బ్రహ్మముడితో ఇప్పటివరకు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇవే కాకుండా 2021లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్‌గా కూడా మానస్ పాల్గొన్నాడు. అప్పటి నుంచే బిగ్ బాస్ మానస్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఇంతేకాకుండా 2003 సంవత్సరంలో బాలీవుడ్‌లో కూడా హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు ఈ బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి. ఈ సినిమా పేరే ప్యారా కుల్హాద్. హిందీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అభిషేక్ చద్దా దర్శకత్వం వహించారు. బోల్డ్ బ్యూటీ అప్సర రాణి హీరోయిన్‌గా చేసింది.
ఓటీటీలోనూ ఎంట్రీ
గుల్షన్ గ్రోవర్, ముఖేష్ ఖన్నా కీలక పాత్రలు పోషించిన ప్యారా కుల్హాద్ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్ ఉండటం విశేషం. సీరియల్స్, టాలీవుడ్, బాలీవుడ్‌లలో హీరోగానే కాకుండా ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు మానస్ నాగులపల్లి.
డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించిన ఓటీటీ హారర్ థ్రిల్లర్ సిరీస్ మ్యాన్షన్ 24లో ఒక ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషించాడు మానస్ నాగులపల్లి. 2023 అక్టోబర్ 17 నుంచి జియోహాట్‌స్టార్‌లో మ్యాన్షన్ 24 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా సీరియల్స్, తెలుగు, హిందీ, ఓటీటీ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసి ముందుకు వెళ్తున్నాడు బ్రహ్మముడి రాజ్ అలియాస్ మానస్ నాగులపల్లి.