Rashmika Mandanna Cocktail 2 OTT Release Details: బాలీవుడ్ లవ్ అండ్ రోమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక సూపర్ అప్‌డేట్ వచ్చేసింది. 2012లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కాక్‌టెయిల్' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'కాక్‌టెయిల్ 2' ఎట్టకేలకు జూన్ 19న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రష్మిక రొమాంటిక్ డ్రామా

షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముగ్గురు జంటగా నటించిన కాక్‌టెయిల్ 2 చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. హోమీ అదజానియా దర్శకత్వంలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న ఈ మోడరన్ లవ్ స్టోరీని చూసేందుకు సినీ ప్రియులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ క్రేజీ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగానే ఓటీటీ లవర్స్ అప్పుడే దీని డిజిటల్ రిలీజ్ ప్లాట్‌ఫామ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో కాక్‌టెయిల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
కాక్‌టెయిల్ 2 ఓటీటీ రైట్స్
అయితే, కాక్‌టెయిల్ 2 ఓటీటీ హక్కులను డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. అంటే, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో కాక్‌టెయిల్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది.
సినిమా థియేటర్ల విడుదల ఒప్పందంతోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు ఈ కాక్‌టెయిల్ 2 డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే స్ట్రీమింగ్ తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
{{/usCountry}}సినిమా థియేటర్ల విడుదల ఒప్పందంతోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు ఈ కాక్‌టెయిల్ 2 డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే స్ట్రీమింగ్ తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
{{/usCountry}}సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తాయి కాబట్టి, ఆగస్టు మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి కాక్‌టెయిల్ 2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
బాక్సాఫీస్ వద్ద సమంతతో రష్మిక ఫైట్!
ఈ వారం బాక్సాఫీస్ రేసు చాలా ఆసక్తికరంగా మారింది. తెలుగు ప్రేక్షకులకు ఇది ఇద్దరు మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ల మధ్య జరుగుతున్న పోరులా కనిపిస్తోంది. షాహిద్, రష్మికల ‘కాక్‌టెయిల్ 2’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే ఎదురవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) కూడా ఇదే సమయంలో థియేటర్లలోకి వచ్చింది. రష్మిక బాలీవుడ్ మార్కెట్‌లో తన సత్తా చాటాలని చూస్తుంటే, సమంత తన ప్రాంతీయ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైంది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తి రేపుతోంది.
తెరవెనుక స్టార్ టెక్నీషియన్స్
కాగా కాక్‌టెయిల్ 2 చిత్రానికి మొదటి భాగమైన 'కాక్‌టెయిల్'తో పాటు 'అంగ్రేజీ మీడియం' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హోమీ అదజానియా దర్శకత్వం వహించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మాడ్‌డాక్ ఫిలిమ్స్, లవ్ ఫిలిమ్స్ బ్యానర్లపై దినేష్ విజన్, లవ్ రంజన్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.
బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ప్రీతమ్ చక్రవర్తి అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అక్షర ప్రభాకర్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోగా, సంతాన కృష్ణన్ రవిచంద్రన్ తన కెమెరా పనితనంతో విజువల్స్‌ను రిచ్‌గా ఆవిష్కరించారు.