Sunil Grover Uncanny Ajay Devgn In Great Indian Kapil Show 5: నవ్వులు పూయించే ఓటీటీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' ఐదో సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఈ షో మొదటి ఎపిసోడ్‌లోనే సరికొత్త హంగామా సృష్టించింది.
దృశ్యం 3 ప్రమోషన్స్

త్వరలోనే థియేటర్లలోకి రానున్న అత్యంత ఇంట్రెస్టింగ్ హిందీ చిత్రం 'దృశ్యం 3' ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తన చిత్రబృందంతో కలిసి ఈ ఓటీటీ కామెడీ షో వేదికపై సందడి చేశారు. తెలుగులో వెంకటేష్ 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే హిందీలో వస్తున్న ఈ మూడో భాగానికి కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అజయ్ దేవగన్‌ను దించేసిన సునీల్ గ్రోవర్!
ఈ ఎపిసోడ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం కమెడియన్ సునీల్ గ్రోవర్ పెర్ఫార్మెన్స్. అజయ్ దేవగన్ లాగే దుస్తులు ధరించి, ఆయన బాడీ లాంగ్వేజ్, గొంతును అచ్చంగా అనుకరిస్తూ సునీల్ చేసిన హంగామా సెట్‌లోని వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది.
'సింగం' పోజ్ ఇస్తూ ఆయన పండించిన కామెడీ కిక్కు ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా పంచుకున్న ఈ ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సునీల్ నటనను చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మనుషుల రూపాన్ని మార్చే
"ఒరిజినల్ అజయ్ దేవగన్ కంటే సునీల్ గ్రోవరే చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తున్నారు" అని ఒక నెటిజన్ ప్రశంసించగా, "సునీల్ నటన ముందు రియల్ యాక్టర్స్ కూడా కాస్త ఇబ్బంది పడక తప్పదు" అని మరొకరు చమత్కరించారు. మరికొందరైతే ఆయనను మనుషుల రూపాన్ని మార్చే 'షేప్‌షిఫ్టర్' అని, 'రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)' అని ఆకాశానికెత్తేశారు.
అనుకరణ వెనుక సునీల్ సీక్రెట్ అదే!
{{/usCountry}}"ఒరిజినల్ అజయ్ దేవగన్ కంటే సునీల్ గ్రోవరే చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తున్నారు" అని ఒక నెటిజన్ ప్రశంసించగా, "సునీల్ నటన ముందు రియల్ యాక్టర్స్ కూడా కాస్త ఇబ్బంది పడక తప్పదు" అని మరొకరు చమత్కరించారు. మరికొందరైతే ఆయనను మనుషుల రూపాన్ని మార్చే 'షేప్‌షిఫ్టర్' అని, 'రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)' అని ఆకాశానికెత్తేశారు.
అనుకరణ వెనుక సునీల్ సీక్రెట్ అదే!
{{/usCountry}}కేవలం అజయ్ దేవగన్ మాత్రమే కాకుండా గతంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, గుల్జార్ వంటి ప్రముఖుల పాత్రలను కూడా సునీల్ అత్యంత సహజంగా పోషించారు. ఒక వ్యక్తిని అనుకరించే ముందు వారి మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడమే తన విజయరహస్యమని సునీల్ చెబుతుంటారు.
"నా దృష్టిలో ఒకరిలా నటించడం అంటే కొంతసేపు ఆ వ్యక్తిగా మారిపోవడమే. వారి కోణంలో ఆలోచిస్తూ, వారి అనుభూతులను ఆస్వాదిస్తాను. ఈ ప్రక్రియ నాకు ఒక ధ్యానం లాంటిది. నాకు మనస్ఫూర్తిగా నచ్చిన వారిని మాత్రమే నేను అనుకరిస్తాను" అని గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సునీల్ గ్రోవర్ వెల్లడించారు.
జైదీప్ అహ్లావత్ డ్యాన్స్.. కపిల్ గ్యాంగ్ రచ్చ!
'పాతాళ్ లోక్', 'దృశ్యం' సిరీస్‌లలో గంభీరమైన పాత్రలకు పేరుగాంచిన నటుడు జైదీప్ అహ్లావత్ ఈ షోలో సరికొత్తగా కనిపించారు. కృష్ణ అభిషేక్, కికు శార్దాలతో కలిసి ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. దర్శకుడు అభిషేక్ పాఠక్, హీరోయిన్లు శ్రియా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ యాదవ్ కూడా ఈ సరదా సంభాషణల్లో పాలుపంచుకున్నారు.
ఆరు నెలల విరామం తర్వాత కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్, కృష్ణ అభిషేక్, కికు శార్దా, అర్చన పూరన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ ఒకే వేదికపైకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ప్రతి శనివారం స్ట్రీమింగ్
సెప్టెంబర్ 26 నుంచి ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఈ షో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కానుంది. విజయ్ సల్గాంకర్ పాత్రలో అజయ్ దేవగన్ చివరిసారిగా కనిపించనున్న 'దృశ్యం 3' చిత్రంలో టబు, రజత్ కపూర్‌లతో పాటు ప్రకాష్ రాజ్, జైదీప్ అహ్లావత్ కొత్తగా చేరారు.