...
...
Next Story

OTT: 2 ఓటీటీల్లోకి తెలుగులో 100 కోట్ల రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- నెక్ట్స్ లెవెల్ బీజీఎమ్- హీరోగా దర్శకుడు- ఎక్కడ?

Lokesh Kanagaraj DC OTT Streaming Platforms: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మైలురాయిని దాటిన డీసీ ఓటీటీలోకి వచ్చేయనుంది. 8.3 రేటింగ్ సంపాదించుకున్న డీసీ 2 ఓటీటీల్లో తెలుగులో అందుబాటులోకి రానుంది. మరి డీసీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 29, 2026, 12:05:04 IST
Advertisement

Lokesh Kanagaraj DC OTT Release Platforms: కోలీవుడ్‌లో తిరుగులేని మాస్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్, కెమెరా ముందుకు హీరోగా వస్తే ఎలా ఉంటుందో నిరూపించిన చిత్రం 'డీసీ' (DC). 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి సంచలన విజయాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన లోకేష్, మొదటిసారి కథానాయకుడిగా చేసిన ఈ ప్రయోగం థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించింది.

రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్స్

2 ఓటీటీల్లోకి తెలుగులో 100 కోట్ల రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- నెక్ట్స్ లెవెల్ బీజీఎమ్- హీరోగా దర్శకుడు- ఎక్కడ?
2 ఓటీటీల్లోకి తెలుగులో 100 కోట్ల రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- నెక్ట్స్ లెవెల్ బీజీఎమ్- హీరోగా దర్శకుడు- ఎక్కడ?

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది. రొమాంటిక్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డీసీ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

లోకేష్ నటన.. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్!

అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 8.3 రేటింగ్ కూడా సంపాదించుకుంది ఈ డీసీ మూవీ. ప్రసిద్ధ 'దేవదాస్' నవలను ఆధునిక గ్యాంగ్‌స్టర్ కథాంశంగా మలచి దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ సరసన వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి ప్రధాన పాత్రల్లో నటించారు.

లోకేష్ కనగరాజ్‌కు మొదటి సినిమాయే అయినా, డెప్త్ ఎమోషన్స్ ఉన్న గ్యాంగ్‌స్టర్ పాత్రలో లోకేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. కథలోని ఎమోషన్, అరుణ్ టేకింగ్‌కు తోడు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయని నెటిజన్ల నుంచి రివ్యూలు కూడా వచ్చాయి.

డీసీ కథ

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ లాడ్జీలో దాక్కుంటాడు దేవదాస్. అక్కడి బార్‌లో పరిచయమైన పాటలు పాడే యువతి పార్వతి (సంజనా కృష్ణమూర్తి)తో ప్రేమలో పడతాడు దేవదాస్. ఆ తర్వాత ఏమైంది? పార్వతికి ఏమైంది? దేవదాస్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు? వేశ్య వాటికలో చిక్కుకుపోయిన చంద్రిక (వామికా గబ్బి) కథ ఏంటీ? దేవదాస్, చంద్రిక కలిసి ఏం చేశారు? పోలీస్‌ను దేవదాస్ ఎందుకు చంపాడు? అనేదే డీసీ కథ.

ఓటీటీలోకి డీసీ మూవీ

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన పాటలు, ఆర్ఆర్ అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లతో సందడి చేసిన డీసీ ఓటీటీలోకి వచ్చేసేందుకు సిద్ధంగా ఉంది. అది కూడా రెండు ఓటీటీల్లో డీసీ రిలీజ్ కానుంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 4 నుంచి డీసీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అదే రోజు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

2 ఓటీటీల్లో డీసీ స్ట్రీమింగ్

డీసీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'సన్ నెక్ట్స్' (Sun NXT) సొంతం చేసుకుంది. దీనికి తోడు 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) లోనూ డీసీ ఒకేసారి ప్రసారం కానుందని సమాచారం. సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్‌లో డీసీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe