Ravi Teja Brother Son Maremma OTT Release: టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజకు ఉండే క్రేజ్ ప్రత్యేకమైంది. ఇటీవలే ఇరుముడి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అలాంటి రవితేజ కుటుంబం నుంచి మరొక వారసుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అలా రవితేజ తమ్ముడు, నటుడు రఘు రాజు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘మారెమ్మ’.
మారెమ్మ ఐఎమ్‌డీబీ రేటింగ్

మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మించిన తెలుగు రూరల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం మారెమ్మ సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చింది. తెలంగాణ పల్లె సంస్కృతి, నమ్మకాల చుట్టూ తిరిగే ఈ సినిమా ఐఎమ్‌డీబీ నుంచి 8.6 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇలాంటి మారెమ్మ ఓటీటీలో దర్శనం ఇవ్వనుంది.
కథేంటంటే..
తెలంగాణలోని మహిషాపురం అనే గ్రామంలో ఈ కథ సాగుతుంది. ఆ ఊరి ప్రజలు తమ ఇలవేల్పు 'మారెమ్మ' దేవతను ఎంతో నిష్ఠతో పూజిస్తారు. ఊరి ఆచారం ప్రకారం అమ్మవారికి ఒక పవిత్రమైన దున్నపోతును బలి ఇవ్వడం ఆనవాయితీ.
'మారి' అనే ఆ దున్నపోతును కర్ణి (మాధవ్ భూపతిరాజు) ఎంతో ప్రేమగా పెంచుతాడు. అమ్మవారికి బలి ఇచ్చే సమయానికి ఆ దున్నపోతు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. దాంతో ఊళ్లో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. అసలు ఆ దున్నపోతు ఎక్కడికి పోయింది? దాన్ని వెతికే క్రమంలో కర్ణికి ఎదురైన పరిణామాలు ఏంటి? ఊరి పెద్దలు, గ్రామస్థులు ఎలా స్పందించారు? గ్రామాన్ని ఆ దున్నపోతు ఎలా కాపాడింది? అనేది మిగతా కథ.
ఇంకాస్తా డెప్త్‌దా జంతు ప్రేమ
తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, మారెమ్మ తల్లి జాతర వాతావరణాన్ని దర్శకుడు బాగానే తెరకెక్కించారు. ప్రశాంత్ విహారి, విప్రదీప్ దత్తా అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఊరి వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, పల్లె వాతావరణం ఆకట్టుకుంటాయి.
{{/usCountry}}తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, మారెమ్మ తల్లి జాతర వాతావరణాన్ని దర్శకుడు బాగానే తెరకెక్కించారు. ప్రశాంత్ విహారి, విప్రదీప్ దత్తా అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఊరి వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, పల్లె వాతావరణం ఆకట్టుకుంటాయి.
{{/usCountry}}అయితే కథలో అసలు ఉద్దేశం ఏంటనేది స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. జంతు బలుల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారా లేదా ఊరి ఆచారాల గురించి చెబుతున్నారా అనే విషయంలో స్పష్టత కరువైంది. కర్ణి తను పెంచుకున్న జంతువుపై చూపే ప్రేమను మరింత లోతుగా చూపించి ఉంటే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేది.
క్షుద్రపూజలు, విలన్ పాత్ర
సెకండ్ హాఫ్‌లో పూర్తిగా కనిపించకుండా పోయిన దున్నపోతును వెతుకులాడటం చుట్టూనే తిరుగుతుంది. ఈ సన్నివేశాలు ఎంతో ఉత్కంఠగా ఉండాల్సింది పోయి, సాగదీతగా మారాయి. క్షుద్రపూజలు, ప్రతినాయకుడి (విలన్) పాత్రలను బలంగా తీర్చిదిద్దకపోవడంతో కథలో సీరియస్‌నెస్ తగ్గిపోయింది.
మాధవ్ హీరోగా మెప్పించాడా
తొలి చిత్రమే అయినప్పటికీ మాధవ్ భూపతిరాజు తన పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. పల్లెటూరి యువకుడిగా అతడి బాడీ లాంగ్వేజ్, ఈజ్ బాగున్నాయి. కథలోని లోపాల వల్ల అతడి ప్రతిభ పూర్తిగా బయటకు రాలేదు. హీరోయిన్‌గా నటించిన దీపా బాలు పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది.
అయితే, సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు. ప్రశాంత్ అంకిరెడ్డి అందించిన విజువల్స్ పల్లెటూరి అందాలను సహజంగా చూపించాయి. దర్శకుడు మంచాల నాగరాజ్ ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా టేకింగ్‌లో ఇంకాస్తా శ్రద్ధ పెట్టాల్సింది.
మారెమ్మ ఓటీటీ స్ట్రీమింగ్
ఇలాంటి మారెమ్మ ఓటీటీలోకి వచ్చేయనుంది. మారెమ్మ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ లెక్కన అమెజాన్ ప్రైమ్‌లో మారెమ్మ ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, అక్టోబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మారెమ్మ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.