Purushaha OTT Trending And Release On 2 Platforms: తెలుగులో ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలకు మంచి క్రేజ్ పెరుగుతుంది. ఈ డ్రామాకు కాస్తా కామెడీ యాడ్ చేసి పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కిస్తే హిట్ సంగతి ఎలా ఉన్న బాగా నవ్విస్తాయి. అలాంటి ఇటీవల తెలుగులో వచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రమే పురుషః.
పురుషః హీరో హీరోయిన్లు

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. పురుషః మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ మూడు జంటలుగా ముఖ్య పాత్రలను పోషించారు.
ఐఎమ్‌డీబీ నుంచి 6 రేటింగ్
పురుషః సినిమా ఇదే ఏడాది మే 22న థియేటర్లలో విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం 6 రేటింగ్ సంపాదించుకుని యావరేజ్ హిట్‌గా నిలిచింది పురుషః సినిమా.
హీరోగా పవన్ కళ్యాణ్ బత్తుల
కావాల్సినంత కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ‘పురుషః’ సినిమాతో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి, వెన్నెల కిషోర్ పాత్రలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయన్న సంగతి తెలిసిందే.
ముగ్గురు హీరోయిన్లకు మంచి క్రేజ్
రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ల పాత్రలు సైతం ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోయిన్లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందన దక్కించుకున్న తర్వాత రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చేసింది.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
{{/usCountry}}రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ల పాత్రలు సైతం ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోయిన్లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందన దక్కించుకున్న తర్వాత రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చేసింది.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
{{/usCountry}}అది కూడా రెండింట్లో పురుషః ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో పురుషః ఓటీటీ రిలీజ్ అయింది. అంతేకాకుండా స్ట్రీమింగ్ అయిన కొన్ని రోజులకే పురుషః ఓటీటీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలా అన్ని చోట్లా ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉండటంతో ఓటీటీలోనూ ఈ సినిమాకి విశేషణమైన ఆదరణ లభిస్తోంది.
రెండింటిల్లో ఓటీటీ ట్రెండింగ్
అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి 2 ఓటీటీల్లో టాప్ ప్లేసులో పురుషః ట్రెండింగ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక పురుషః కథ విషయానికొస్తే హీరోలు ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు విడిచి ఉండలేరు. అలాంటి వీరి జీవితాల్లోకి ముగ్గురు హీరోయిన్లు భార్యలుగా వస్తారు.
పురుషః కథ
పెళ్లి తర్వాత గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) నుంచి విడాకులు కావాలని భార్యలు కమల (రాయంచ), లక్ష్మి (హాసిని), గీత (విషిక) కోర్టుకెక్కుతారు. కానీ, విచారణకు మాత్రం రారు. దాంతో జడ్జ్ అసలు గొడవకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు.
అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహా ఓటీటీల్లో
ఆ తర్వాత ఏమైందీ? ఈ ముగ్గురుని భార్యలు విడాకులు కోరడానికి గల పరిణామాలు ఏంటీ? భర్తల గురించి భార్యలకు తెలిసిన నిజాలు ఏంటీ? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో కామెడీ, డ్రామాగా పురుషః సినిమాను రూపుదిద్దారు. ఇలాంటి పురుషః సినిమాను అమెజాన్ ప్రైమ్, ఆహా 2 ఓటీటీల్లో ఎంచక్కా చూసేయొచ్చు.