Serial Actress Shweta Tiwari On Cheating Husbands: బుల్లితెర సీనియర్ నటి, ఫిట్‌నెస్ ఫ్రీక్ శ్వేతా తివారీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో ఓటీటీ రిలీజ్ కానున్న 'ది ట్రేటర్స్ సీజన్ 2' (The Traitors Season 2) ప్రోమో విడుదలైంది.
ఓటీటీ షో ఫస్ట్ లుక్ గ్లింప్స్

బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ఓటీటీ షో ఫస్ట్ లుక్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ది ట్రేటర్స్ 2 ఓటీటీ ప్రోమోలో టీవీ నటి శ్వేతా తివారీ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కరణ్ జోహార్ ముందే భర్తల రహస్యం రట్టు!
గేమ్ కాన్సెప్ట్‌లో భాగంగా కరణ్ జోహార్ శ్వేతాతో మాట్లాడుతూ.. "అబద్ధాలు చెప్పే వారిని నువ్వు అంత తేలిగ్గా ఎలా పసిగట్టగలవు?" అని ప్రశ్నించారు. దానికి శ్వేతా ఏమాత్రం తడబడకుండా సమాధానమిచ్చింది.
"నన్ను మోసం చేస్తున్న సమయంలో నా ఇద్దరు భర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది నేనే. అందుకే నాకు అబద్ధాలు చెప్పే ముఖాలను గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు" అని శ్వేతా తివారీ బాంబు పేల్చారు.
రెండుసార్లు వివాహం చేసుకున్న శ్వేతా తివారీ
శ్వేతా తివారీ గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1998లో నటుడు రాజా చౌదరిని పెళ్లి చేసుకున్న ఆమె, విభేదాల కారణంగా 2007లో విడిపోయి ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అనంతరం 2013లో అభినవ్ కోహ్లీని రెండో వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.
రాజా చౌదరి ఎదురుదాడి.. కొత్త వివాదం
తన ఇద్దరు భర్తల నుంచి గృహహింసతో పాటు నమ్మకద్రోహాన్ని ఎదుర్కొన్నట్లు శ్వేతా గతంలోనూ పలు సందర్భాల్లో ఆరోపించారు. ఇదిలా ఉంటే, శ్వేతా మొదటి భర్త రాజా చౌదరి ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొని ఆమె చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తానేమీ గృహహింసకు పాల్పడలేదని, శ్వేతానే తప్పుడు ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}తన ఇద్దరు భర్తల నుంచి గృహహింసతో పాటు నమ్మకద్రోహాన్ని ఎదుర్కొన్నట్లు శ్వేతా గతంలోనూ పలు సందర్భాల్లో ఆరోపించారు. ఇదిలా ఉంటే, శ్వేతా మొదటి భర్త రాజా చౌదరి ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొని ఆమె చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తానేమీ గృహహింసకు పాల్పడలేదని, శ్వేతానే తప్పుడు ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}అంతేకాకుండా, 'కసౌటీ జిందగీ కే' సీరియల్ సమయంలో శ్వేతా తివారీ తన కో-స్టార్ సేజాన్ ఖాన్‌తో ప్రేమాయణం నడిపిందని, వారిద్దరూ కలిసుండటం తాను స్వయంగా తెలుసుకున్నానని రాజా సంచలన ఆరోపణలు చేశారు. ఈ పాత గొడవలు మళ్లీ ఇప్పుడు రియాలిటీ షో వేదికగా తెరపైకి రావడం గమనార్హం.
నటీనటుల వ్యంగ్యాస్త్రాలు.. గ్లామర్ హంగామా!
ఇక 'ది ట్రేటర్స్ 2' ప్రోమోలోనే మరొక పోటీదారు, నటి పరుల్ గులాటీ మరో కంటెస్టెంట్ కుల్లుతో మాట్లాడుతూ శ్వేతా తివారీపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. "ఆమె టీవీ నటి. ఏడవడానికి గ్లిజరిన్ కూడా వాడాల్సిన పనిలేదు, చాలా సహజంగా ఏడ్చేస్తుంది" అని పరుల్ కామెంట్ చేయడం షోలో డ్రామా తీవ్రతను పెంచేసింది.
20 మంది సెలబ్రిటీలు
ఈసారి అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తున్న ది ట్రేటర్స్ 2 ఓటీటీ షోలో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. శ్వేతా తివారీ, పరుల్ గులాటీలతో పాటు రష్మీ గౌతమ్ తరహాలో గుర్తింపు పొందిన యూట్యూబర్ అభిషేక్ మల్హన్, సీనియర్ హీరోయిన్ మల్లికా షెరావత్, మునావర్ ఫరూకీ, రియా చక్రవర్తి, కృష్ణ శర్మ, దలీప్ తహిల్, కృష్ణ శర్మ మ్యాజిక్ వంటి 20 మంది ప్రముఖులు ఈ మైండ్ గేమ్‌లో పోటీపడుతున్నారు. త్వరలోనే ఈ షో ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.