Sneha Ullal Comparisons With Aishwarya Rai And Re Entry: 2000వ దశకం మధ్యలో భారతీయ సినీ పరిశ్రమలో ఒక పేరు మార్మోగిపోయింది. ఆ పేరే స్నేహా ఉల్లాల్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' సినిమాతో స్నేహ ఉల్లాల్ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది.
ఐశ్వర్య రాయ్‌కి ప్రతి రూపం

దానికి కారణం కేవలం సల్మాన్ ఖాన్ సినిమా కావడం మాత్రమే కాదు.. అప్పట్లో స్నేహా ఉల్లాల్ అచ్చం స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ లాగే ఉండటం. మీడియాలో, ప్రేక్షకుల్లో స్నేహా ఉల్లాల్‌ను అంతా ఐశ్వర్య రాయ్‌కి ప్రతి రూపం (లుక్ ఎలైక్) అని పిలవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ పోలికల వలయం నుంచి బయటపడి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి స్నేహా ఉల్లాల్ గట్టిగానే కృషి చేసింది.
కాలేజీ అమ్మాయి నుంచి సెన్సేషన్ వరకు
స్నేహా ఉల్లాల్ నిజానికి నటి కావాలని ఎప్పుడూ కలగనలేదట. కాలేజీలో చదువుకుంటున్న సమయంలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ ద్వారా ఆమెకు సినీ రంగంతో పరిచయం ఏర్పడింది. అప్పటికే సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా కోసం ఒక సరికొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. స్నేహాలోని అమాయకత్వం, ఐశ్వర్య రాయ్‌ను పోలి ఉండే ఆమె కళ్లు సల్మాన్‌ను ఆకట్టుకున్నాయి. దాంతో హీరోయిన్‌గా స్నేహాకు అవకాశం వచ్చింది.
లక్కీ సినిమా విడుదలయ్యాక స్నేహాపై వచ్చిన కథనాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలోనే తనకు, ఐశ్వర్య రాయ్‌కు మధ్య ఉన్న పోలికల వల్ల ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని భయపడినట్లు స్నేహా ఉల్లాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
సారీ, నన్ను ద్వేషించకండి
"ఐశ్వర్య రాయ్‌ని కలిసినప్పుడు.. 'సారీ, నన్ను ద్వేషించకండి' అని ఆమెను కోరాను. మీడియా చేస్తున్న ఈ పోలికల వల్ల ఆమె ఎక్కడ ఫీల్ అవుతుందో అని నాకు భయం వేసింది" అని స్నేహా ఉల్లాల్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అయితే, ఐశ్వర్య రాయ్ చాలా హుందాగా స్పందిస్తూ.. "బాలీవుడ్ కుటుంబంలోకి స్వాగతం" అంటూ తనను ఆహ్వానించిందని స్నేహా ఉల్లాల్ తెలిపింది.
తెలుగు తెరపై జైత్రయాత్ర..
{{/usCountry}}"ఐశ్వర్య రాయ్‌ని కలిసినప్పుడు.. 'సారీ, నన్ను ద్వేషించకండి' అని ఆమెను కోరాను. మీడియా చేస్తున్న ఈ పోలికల వల్ల ఆమె ఎక్కడ ఫీల్ అవుతుందో అని నాకు భయం వేసింది" అని స్నేహా ఉల్లాల్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అయితే, ఐశ్వర్య రాయ్ చాలా హుందాగా స్పందిస్తూ.. "బాలీవుడ్ కుటుంబంలోకి స్వాగతం" అంటూ తనను ఆహ్వానించిందని స్నేహా ఉల్లాల్ తెలిపింది.
తెలుగు తెరపై జైత్రయాత్ర..
{{/usCountry}}బాలీవుడ్‌లో వరుస పోలికల వల్ల తన సొంత గుర్తింపు దెబ్బతింటోందని భావించిన స్నేహా ఉల్లాల్ తన మకాంను దక్షిణాదికి మార్చింది. 2008లో వచ్చిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆమెను అమితంగా ఆదరించారు.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన 'సింహా' (2010) వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది స్నేహా ఉల్లాల్. అవే కాకుండా కరెంట్, మడత కాజా, మంచు మనోజ్ నేను మీకు తెలుసా, అంతా నీ మాయలోనే వంటి సినిమాల్లో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసింది. నాగార్జున కింగ్, నాని అలా మొదలైంది, అల్లరి నరేష్ యాక్షన్ 3డీ సినిమాల్లో గెస్ట్ అప్పిరియన్స్ కూడా ఇచ్చింది స్నేహా ఉల్లాల్.
అనారోగ్యం వల్ల దూరం
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే స్నేహ ఉల్లాల్ అదృశ్యమైంది. దీనికి కారణం స్నేహా ఉల్లాల్‌కు సోకిన 'ఆటో ఇమ్యూన్ డిజార్డర్'. ఈ వ్యాధి వల్ల ఆమె తీవ్రమైన నీరసానికి గురయ్యేవారు. గంటల తరబడి షూటింగ్‌లలో పాల్గొనడం ఆమెకు అసాధ్యంగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలకు విరామం ప్రకటించి, తన ఆరోగ్యంపై దృష్టి సారించింది.
ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ ఏం చేస్తోంది?
కొన్నేళ్ల విరామం తర్వాత స్నేహా ఉల్లాల్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతోంది. అయితే గతంలోలా కేవలం గ్లామర్ పాత్రల వెంట పడకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. 2020లో 'ఎక్స్‌పైరీ డేట్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్ ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లో మెరిసింది.
మళ్లీ తెలుగు తెరపైకి
2025లో 'సాకో 363'లో భాగమైన స్నేహా ఉల్లాల్, రీసెంట్‌గా తెలుగులో 'నీలకంఠ' (2026) సినిమాతో మళ్లీ తెలుగు తెరపైకి పునరాగమనం చేసింది. ఇప్పుడు స్నేహా ఉల్లాల్ తన జీవితాన్ని చాలా ప్రశాంతంగా, లో-ప్రొఫైల్‌లో గడుపుతూ మంచి కథల కోసం ఎదురుచూస్తోంది.