Sign in

తునిలో కీచకపర్వం - బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం..!

మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని తుని పరిధిలో వెలుగు చూసింది.  8వ తరగతి చదువుతున్న బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఓ స్థానికుడి కంటపడగా.. నిందితుడు నారాయణరావును నిలదీశాడు. దీంతో అతడు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

Published on: Oct 22, 2025, 14:54:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాకినాడ జిల్లాలో తునిలో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్‌ బాలిక పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. 8వ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లి తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఓ స్థానికుడు అతడిని ప్రశ్నించగా… వెంటనే సదరు వ్యక్తి అక్కడ్నుంచి జారుకున్నాడు.

మైనర్ బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం (Representational image)
మైనర్ బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం (Representational image)

తుని రూరల్‌ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలికను నారాయణ రావు అనే వ్యక్తి హాస్టల్ నుంచి స్కూటీపై తీసుకెళ్లాడు. సమీపంలోని హంసవరం సపోటా తోటల్లో తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా తాకాడు. అత్యాచారం చేసేందుకు యత్నించబోయినట్లు తెలిసింది.

ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని ఓ స్థానికుడు గమనించాడు. అతని వద్దకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. బాలికను తోటలోకి తీసుకొచ్చి అత్యాచారం చేస్తున్నావా అని నిలదీశాడు. అలాంటిదేమీ లేదు… బాలికను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని దబాయించాడు. అంతటితో ఆగని నారాయణరావు… తాను ఓ పార్టీ కౌన్సిలర్‌ను అంటూ చెప్పుకొచ్చాడు. పలు అంశాలపై ప్రశ్నిస్తుండగానే… స్కూటీపై సదరు బాలికను ఎక్కించుకోని నారాయణరావు వెళ్లిపోయాడు. ఇదంతా కూడా వీడియోల రికార్డు అయింది.

హాస్టల్ నుంచి మైనర్‌ బాలికను నారాయణ రావు బయటకు తీసుకువెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ ఓ ట్వీట్ టేసింది. తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి.. హంసవరం సపోటా తోటలో టీడీపీ నేత నారాయణ రావు అత్యాచారయత్నం చేశాడని పేర్కొంది. కీచకుడి బాగోతాన్ని గుర్తించి బాలికను స్థానికుడు రక్షించాడని తెలిపింది. రాష్ట్రంలో ఆడబిడ్డలపై టీడీపీ నేతల వేధింపులకి ఇంతకంటే సాక్ష్యం కావాలా అంటూ ప్రశ్నించింది. వీడియోను కూడా ఇందుకు జత చేసింది.

పార్టీలో అతనికి ఏ పదవీ లేదు - టీడీపీ

ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. “సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయి. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు” అని స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More