ఏపీ జేఎల్ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి
ఏపీ జేఎల్ ఉద్యోగ నియామక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన వారి జాబితాను https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందుపరిచారు.
ఏపీ జూనియర్ లెక్చరర్ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచింది.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియపై కూడా ఏపీపీఎస్సీ ప్రకటన చేసింది. డిసెంబర్ 16, 17 తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. ఏపీపీఎస్సీ బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్, ఎంజీ రోడ్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ - 520010 చిరునామాకు రావాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని పేర్కొంది.
ఎంపికైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి చెక్ లిస్ట్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకొని వివరాలను నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా ఒరిజినల్ ధ్రువపత్రాలను అటెస్టేషన్ చేసుకొని ఉండాలి. కాల్ లెటర్ కూడా ఏపీపీఎస్సీ నుంచి అందనుంది. కాల్ లెటర్ అందని అభ్యర్థులు… https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లే అభ్యర్థులు చెక్ లిస్ట్ లో పేర్కొన్న విధంగా మెమోలు, ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణపత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమిషన్ వెబ్ సైట్ లో సూచించిన విధంగా తగిన పత్రాలను సమర్పించాలి.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
- అభ్యర్థులు https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- హోంపేజీలో కనిపించే జూనియర్ లెక్చరర్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
- రిజల్ట్ నోటిఫికేషన్ పై క్లిక్ చేస్తే ఎంపికైన వారి హాల్ టికెట్లతో పాటు పీడీఎఫ్ ఉంటుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

