Sign in

ఏపీ - తెలంగాణ : ముహుర్తం ఫిక్స్ - కాబోయే కమల దళపతులు ఎవరు..?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం కార్యాచరణను షురూ చేసింది. జూలై 1వ తేదీన పార్టీ నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.

Published on: Jun 28, 2025, 16:00:41 IST
By , , Telangana, Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాలకు కొత్త కమల దళపతులు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దాదాపు కసరత్తు పూర్తి కావొచ్చింది. అయితే ఆ పార్టీ నియమాల ప్రకారం… నామినేషన్లను స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి… పేర్లను ప్రకటిస్తారు.

బీజేపీ పార్టీ - ఏపీ, తెలంగాణకు కొత్త అధ్యక్షులు...!
బీజేపీ పార్టీ - ఏపీ, తెలంగాణకు కొత్త అధ్యక్షులు...!

నిజానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై చాలా రోజులుగా కసరత్తు కొనసాగుతూ వస్తోంది. పలువురు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఎట్టకేలకు జాతీయ నాయకత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. అయితే ఒక్క తెలంగాణనే కాకుండా… ఏపీకి కూడా కొత్త అధ్యక్షుడిని ఖరారు చేయనుంది. ఒకే రోజు అధ్యక్షుల పేర్లను ప్రకటించనుంది.

ఏపీలో నోటిఫికేషన్…..

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 3 రోజుల్లోనే ప్రక్రియంతా పూర్తి చేయనున్నారు. జూలై 1వ తేదీన పార్టీ కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 30వ తేదీన నామినేషన్లను స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రంలోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఏపీ బీజేపీరాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉన్నారు. ఈమె స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావించింది. పైగా పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో…ఆమె స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకోసం పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో ఇలా…?

ఏపీతో పోల్చితే…తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో చాలామంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా డీకే అరుణ, ఈటలరాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా.. రఘునందన్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా అధ్యక్ష పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. గతంలో బండి సంజయ్ పని చేశారు. ఆయన కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వీరు కాకుండా… కొత్త వాళ్లకే పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా జూలై 1వ తేదీన తెలుగు రాష్ట్రాల కొత్త కమల దళపతులు ఎవరనేది తేలిపోనుంది…!

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More