...
...
Next Story

OTT Trending: ఓటీటీ రిలీజ్ నుంచే టాప్ 1 ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ప్రేమ కావాలి హీరోయిన్ రీ ఎంట్రీ-ఎక్కడంటే?

OTT Trending Telugu Crime Thriller: ఓటీటీ రిలీజ్ నుంచే టాప్ 1 స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చిన లేటెస్ట్ మూవీ చీకటిలో. ప్రేమ కావాలి హీరోయిన్ ఇషా చావ్లా చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చీకటిలో ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 24, 2026, 13:54:16 IST
Advertisement

ఓటీటీలోకి ఇప్పటివరకు ఎన్నో రకాల మర్డర్ మిస్టరీలు, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చి అలరించాయి. ప్రతి వారం ఇలాంటి తరహా జోనర్లలతో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అయితే, పాడ్‌కాస్ట్ నేపథ్యంతో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్రైమ్ థ్రిల్లర్ రాలేదు.

నాగ చైతన్య భార్య

ఓటీటీ రిలీజ్ నుంచే టాప్ 1 ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ప్రేమ కావాలి హీరోయిన్ రీ ఎంట్రీ-ఎక్కడంటే?
ఓటీటీ రిలీజ్ నుంచే టాప్ 1 ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ప్రేమ కావాలి హీరోయిన్ రీ ఎంట్రీ-ఎక్కడంటే?

ఒక యూనిక్ పాయింట్‌తో లేటెస్ట్ ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీనే చీకటిలో. హీరో నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.

టాలీవుడ్ హీరోయిన్

చీకటిలో సినిమాలో శోభితతోపాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య, విశాల లక్ష్మీ, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఇషా చావ్లా కూడా కీ రోల్ పోషించింది.

ఇషా చావ్లా రీ ఎంట్రీ

ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి సినిమాలో హీరోయిన్‌గా ఎంతోందికి హాట్ ఫేవరేట్‌గా నిలిచిన ఇషా చావ్లా చాలా కాలం తర్వాత ఓటీటీ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

ట్రైలర్ నుంచే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చీకటిలో మూవీలో శోభిత ధూళిపాళ సంధ్య నెల్లూరు పాత్రలో కనిపించింది.

క్రైమ్ స్టోరీస్ చెప్పే పాడ్ కాస్ట్

ఆ తర్వాత ఏమైంది? సంధ్యను వెంటాడిన కిల్లర్ ఎవరు? సిటీలో వరుస అత్యాచారాలు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?, ఎవరు చేస్తున్నారు? అనేది తెలియాలంటే చీకటిలో చూడాల్సిందే.

చీకటిలో ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చీకటిలో ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నటి (జనవరి 23) నుంచే అమెజాన్ ప్రైమ్‌లో చీకటిలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగుతోపాటు తమిళం, హిందీ వంటి 3 భాషల్లో చీకటిలో ఓటీటీ రిలీజ్ అయింది.

అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ ట్రెండింగ్

అయితే, ఓటీటీ రిలీజ్ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకు వచ్చేసింది చీకటిలో మూవీ. జనవరి 23 నుంచే టాప్ 1 ట్రెండింగ్ ప్లేసులో శోభిత ధూళిపాళ చీకటిలో మూవీ ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచింది. నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన నాటి నుంచే ఇలా మొదటి స్థానంలో చీకటిలో ట్రెండింగ్ అవడంతో మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe