...
...
Next Story

Chennai Love Story OTT: ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ- ఊహించని ఓటీటీలో స్ట్రీమింగ్- ఎక్కడ, ఎప్పుడంటే?

Chennai Love Story OTT Streaming Details: కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా చేసిన బాక్సాఫీస్ వద్ద బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ ఎక్కడ, ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 27, 2026, 12:16:31 IST
Advertisement

Chennai Love Story OTT Release Details: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఖాతాలో మరొక మంచి విజయం నమోదైనట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో

ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ- ఊహించని ఓటీటీలో స్ట్రీమింగ్- ఎక్కడ, ఎప్పుడంటే?
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ- ఊహించని ఓటీటీలో స్ట్రీమింగ్- ఎక్కడ, ఎప్పుడంటే?

జూలై 24న థియేటర్లలో విడుదలైన చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు వచ్చే కిరణ్ అబ్బవరం ఈసారి యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నారు.

చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం నటన బాగుందని అంటున్నారు. అలాగే హీరోయిన్ చేసిన శ్రీ గౌరి ప్రియ యాక్టింగ్ సినిమాకే మెయిన్ హైలెట్ అంటూ రివ్యూలు వచ్చాయి. ఫస్టాఫ్ అంతా లవ్ డ్రామాతో సాగితే సెకండాఫ్‌లో ఆత్మలు వంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారని ఆడియెన్స్ చెబుతున్నారు.

భారీ ధరకు ఓటీటీ హక్కులు సొంతం

ఇలా బిగ్ స్క్రీన్‌పై గ్రాండ్ సక్సెస్ సాధించిన చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వివరాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్ (Sony LIV) చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ హక్కులను చేజిక్కించుకుంది.

అయితే, దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేట్రికల్ రన్, రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను బట్టి కూడా చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే, సాధారణంగా తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటాయి.

కానీ, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ మాత్రం ఎవరు ఊహించినివిధంగా సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. మరోవైపు డిజిటల్ హక్కుల రూపంలో భారీ మొత్తం రావడంతో చెన్నై లవ్ స్టోరీ నిర్మాతలు పెట్టిన పెట్టుబడిలో అత్యధిక భాగం రికవరీ అయినట్లు తెలుస్తోంది.

సోనీ లివ్ ఓటీటీలోకి

థియేట్రికల్ వసూళ్లతో పాటు ఈ ఓటీటీ బిజినెస్ కూడా తోడవడంతో 'చెన్నై లవ్ స్టోరీ' ప్రాజెక్ట్ బయ్యర్లకు, నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టినట్లయింది. "థియేటర్ కలెక్షన్లతో పాటు నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా ఈ సినిమాకు చాలా బాగా జరిగింది" అని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

థియేటర్లలో గ్రాండ్ రన్ ముగించుకున్న తర్వాత, ఆగస్టు చివరి వారంలో చెన్నై లవ్ స్టోరీ సినిమా సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది. మంచి లవ్ రొమాంటిక్ డ్రామాను ఎంజాయ్ చేయాలనుకునేవారు ఓటీటీలో కాకుండా బిగ్ స్క్రీన్‌పై చెన్నై లవ్ స్టోరీ సినిమాను చూడటం బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks