Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ కొత్త ఇల్లు.. విడిపోనున్న కుటుంబం.. ప్రభావతికి గాజులు.. పట్టలేని సంతోషం
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో మనోజ్ కొత్త ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తాడు. దీంతో ఉమ్మడి కుటుంబం విడిపోతుందని మీనా బాధపడుతుంది. అటు సత్యం కొత్త ఉద్యోగానికి బయలు దేరుతాడు.
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనాలో తన తల్లిని చూసుకొని ఎమోషనల్ అవుతాడు సత్యం. అటు బిజినెస్ లో లాభాలు అంటూ తల్లికి బంగారు గాజులు తీసుకొచ్చిన మనోజ్.. కొత్త ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతాడు.

శిష్యుడిని ఇంట్లో చూసి బాలు షాక్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 24) ఎపిసోడ్ మీనాను పెళ్లి చేసుకుంటానంటూ బాలు శిష్యుడు ఇంటికి వచ్చే సీన్ తో మొదలవుతుంది. అతన్ని చూసి మీనా నానా రచ్చ చేస్తుంది. అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. అతన్ని చూసి షాకవుతాడు.
బాలుని చూసి మీనా నీ చెల్లెలా.. అయితే నువ్వు నాకు బావ అని అంటాడు. అంటే ఇన్నాళ్లూ నా భార్యకు లైన్ వేయడానికి నీకు సలహాలు ఇచ్చానా అని బాలు అంటాడు. అతనికి క్లాస్ పీకుతాడు. మీనా తన భార్య అని, మెడలో తాళి కనిపించలేదా అని క్లాస్ పీకుతాడు. మీనా మరింత రెచ్చిపోతుంది. అతని ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది.
బాలుకి క్లాస్ పీకిన మీనా
ఆ తర్వాత మేడపైకి వెళ్లిన బాలు దగ్గరికి మీనా వెళ్తుంది. ఆమెను చూసి మొహం చాటేస్తాడు బాలు. అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటూ క్లాస్ తీసుకోవడం మొదలు పెడుతుంది. అతనికి సలహాలు ఇచ్చే ముందు ఎవరిని ప్రేమిస్తున్నాడో ఏంటో తెలుసుకోవద్దా.. మన సలహాలు మన చెల్లి, అక్క, భార్యలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుందో ఇప్పటికైనా తెలిసిందా అని బాలుని తిడుతుంది. బాలు సిగ్గుతో తలదించుకుంటాడు.
అయితే ఇప్పటికే నువ్వు కాలేజీకి వెళ్లే అమ్మాయిలా కనిపించావని అన్నాడు అని బాలు అనడంతో మీనా సిగ్గు పడుతుంది. అంటే ఇప్పటికీ నేను అలా ఉన్నానా అని అనుకుంటుంది. అటు బాలు కూడా నీకే కాదు.. నా ఫొటో పెడితే నా వెంట కూడా మా బాలు అంటూ అమ్మాయిలు పడతారని అంటాడు. ఇద్దరూ ఒకరికొకరు సవాలు చేసుకుంటారు.
బిజినెస్‌లో లాభాలు అంటూ స్వీట్లు పంచిన మనోజ్, రోహిణి
ఆ తర్వాత ఇంటికి మనోజ్, రోహిణి వస్తారు. స్వీట్లు తీసుకొస్తారు. ముంబై ముకేష్ తో బిజినెస్ వల్ల తనకు రూ.10 లక్షల లాభం వచ్చిందంటూ స్వీట్లు పంచుతాడు. అంత లాభమా అంటూ ప్రభావతి తెగ సంతోషిస్తుంది. అసలు గుడ్ న్యూస్ ఇంకొకటి ఉందంటాడు మనోజ్.
ప్రభావతికి బంగారు గాజులు
తల్లి ప్రభావతి కోసం అతడు బంగారు గాజులు తీసుకొస్తాడు. అది చూసి ప్రభావతి ఎక్కడికో వెళ్లిపోతుంది. రోహిణి, మనోజ్ ను ప్రేమగా ముద్దాడుతుంది. నా అసలుసిసలు వారసుడివి నువ్వే అంటూ తెగ మురిసిపోతుంది. మరి నాన్నకు ఏమీ తేలేదా అని బాలు అంటూ.. తెచ్చానంటూ కొత్త డ్రెస్ ఇస్తాడు. అమ్మకి గాజులు, నాన్నకు కేవలం బట్టలేనా అని బాలు అంటాడు. ఆయనకు కూడా బంగారం తెస్తే ఆ రూ.10 లక్షలు ఇద్దరికే సరిపోతాయని అనడంతో సత్యం నొచ్చుకుంటాడు.
ఇల్లు కొనాలనుకుంటున్నామన్న మనోజ్
ఆ తర్వాత మనోజ్ తన అసలు ప్లాన్ చెబుతాడు. తాను, రోహిణి కలిసి ఓ కొత్త ఇల్లు కొందామనుకుంటున్నామని అంటాడు. అది విని ప్రభావతి మరింత మురిసిపోతుంది. పట్టరాని సంతోషంతో తేలిపోతుంది. కానీ సత్యం ముఖంలో మాత్రం కాస్త బాధ కనిపిస్తుంది.
ఉమ్మడి కుటుంబం విడిపోతుందని మీనా బాధ
అటు మీనా కూడా మేడపైకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. ఏమైందని బాలు అడిగితే.. మనోజ్ ఇల్లు కొంటే వాళ్లు వెళ్లిపోతారు.. వాళ్లను వదిలి ఉండలేదు కాబట్టి అత్తయ్య వెళ్లిపోతుంది.. అప్పుడు ఉమ్మడి కుటుంబం విడిపోతుంది కదా.. ఇదే జరగకూడదని మామయ్య ఇన్నాళ్లూ అనుకున్నారు కదా అని అంటుంది. అవును కదా.. నాకు అసలు ఇది తట్టనే లేదు.. వెంటనే మనోజ్ గాడికి కొత్త ఇల్లు వద్దని చెబుతాను అని బాలు అంటాడు. కానీ మీనా అతన్ని ఆపుతుంది. ఆ తర్వాత అతనికి ఓ ముద్దు కూడా ఇస్తుంది.
ఉద్యోగానికి బయలుదేరిన సత్యం.. వద్దని వారించిన బాలు
మరుసటి రోజు సత్యం కొత్త ఉద్యోగానికి బయలుదేరుతాడు. బాలు మాత్రం వద్దని వారిస్తాడు. ఈ వయసులో అవసరమా అని అంటాడు. స్కూల్లో ఉద్యోగం అనేసరికి మనోజ్ చీప్ గా మాట్లాడతాడు. అక్కడేమీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగం అయి ఉండదే అని అంటాడు. దీంతో అతనికి బాలు క్లాస్ పీకుతాడు. నీకు, మీ ఆయనకు మీ ఇద్దరు తప్ప మిగిలిన అందరూ చీప్ గానే కనిపిస్తారా అని రోహిణిని కూడా అంటాడు. ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆయనకు కూడా కాలక్షేపంగా ఉంటుంది కదా అని రవి, శృతి కూడా అంటారు.
మీనాను చూసి తల్లిని గుర్తు చేసుకున్న సత్యం
అటు మామయ్య కోసం లంచ్ బాక్స్ తీసుకొచ్చిన మీనా కూడా అదే అంటుంది. నువ్వు తప్ప అందరూ ఉద్యోగానికి ఓకేనే అంటున్నారని బాలుతో సత్యం అంటాడు. అయినా ఉద్యోగానికి వెళ్తోంది మీకు తండ్రిగా కాదు.. నా భార్యకు భర్తగా.. ఆమె చేసిన తప్పును దిద్దడానికి వెళ్తున్నానని ప్రభావతిని ఉద్దేశించి అనడంతో ఆమె మొహం మాడిపోతుంది.
మీనా లంచ్ బాక్స్ తేవడం చూసి చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే స్కూలుకి వెళ్తుంటే బాక్స్ ఇచ్చేది.. మా అమ్మ గుర్తుకు వచ్చిందని ఎమోషనల్ అవుతాడు. అతన్ని చూసి బాలు, మీనా కూడా ఎమోషనల్ అవుతారు. చివరికి బాలు కూడా సత్యం ఉద్యోగానికి వెళ్లడానికి అంగీకరిస్తాడు. తానే దిగబెడతానని కారులో తీసుకెళ్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


