గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా వల్లే రోహిణి తండ్రి అరెస్ట్- శ్రుతిపై దొంగతనం- మరదలిని కాపాడిన బాలు!
గుండె నిండా గుడి గంటలు జూలై 17 ఎపిసోడ్‌లో రోహిణి తండ్రి అరెస్ట్ అవడం మీనా వల్లే అంటూ ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది ప్రభావతి. దాంతో అత్త ప్రభావతిపై మీనా రివర్స్ అవుతుంది. రోహిణిని లక్ష ఇవ్వమని, తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. శ్రుతికి దొంగతనం అంటగడతారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మలేషియా మామయ్య, రోహిణితో వెళ్లి ఆస్తులు విడిపించుర మనోజ్ అని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి సైగ చేయడంతో వద్దు, మనోజ్ రావడానికి వీళ్లేదు అని మటన్ కొట్టు మాణిక్యం అంటాడు. మనోజ్ అక్కడికి వస్తే మలేషియా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో మా బావకు సంబంధించిన వాళ్లు కనిపిస్తే అరెస్ట్ చేస్తున్నారు. నేను పారిపోయి ఇండియా వచ్చానంటాడు మాణిక్యం.

ప్రభావతి గొడవ
పాప ఆరోగ్యం బాగా చూసుకో. వీళ్లంతా నిన్ను బాగా చూసుకుంటారు. మీ నాన్న గురించి ఏం తెలిసిన నేను వచ్చి చెబుతాను అని మాణిక్యం వెళ్లిపోతాడు. తర్వాత బాలు డౌట్ పడితే ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెబుతారా. రోహిణి అసలే ఏడుస్తుందని మీనా అంటుంది. ఇంతలో ప్రభావతి వస్తే మీనా కాఫీ ఇస్తుంది. కానీ, కాఫీ తీసుకోకుండా నెట్టేస్తుంది ప్రభావతి.
ఏ దెయ్యం పట్టిందా నీకు అని సత్యం అంటాడు. ఇప్పుడు కాఫీ గ్లాస్ ఎందుకు విసరగొట్టారు అని మీనా అడుగుతుంది. నువ్ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని అశుభాలే. నువ్వు ఎవరు సంతోషంగా ఉన్న ఓర్చుకోలేవు. శ్రుతి నీ వల్లే బయటకు వెళ్లింది, ఇప్పుడు రోహిణి వాళ్ల నాన్న అరెస్ట్ అయ్యారు. నీ దృష్టే అలాంటిది అని గొడవ చేస్తుంది ప్రభావతి.
దాంతో బాలు అడ్డుకుంటాడు. నువ్ మాట్లాడకు పైసాకు పనికిరాని వాళ్లు ఇంట్లో పడి ఉంటున్నారని ప్రభావతి అంటుంది. ఎవరు పైసా పనిచేయట్లేదు. ఎవరి అనాల్సిన మాట ఎవరినంటున్నారు. నా భర్త పని చేయట్లేదా, నేను పూలమ్మట్లేదా. ఇంటి పని చేయట్లేదా. ఇప్పుడు ఎవరిని అన్నారో చెప్పాల్సిందే అని ప్రభావతిపై రివర్స్ అవుతుంది మీనా. ఇంట్లో అందరిని పంపించి మహారాణిలా కూర్చుందామనుకుంటున్నావా, ఇంటి కోడలు వెళ్తే ఎవరైనా ఏమైనా చేస్తున్నారా అని ప్రభావతి అంటుంది.
అసలు విషయం చెప్పిన మీనా
నేను అందరు కలిసి ఉండాలనే అనుకుంటాను. మీరేం చేశారు. మీరెళ్లి శ్రుతికి నచ్చజెప్పి తీసుకురావచ్చుగా. మీ పని నేను చేశాను. శ్రుతిని వెళ్లి కలిసి నచ్చజెప్పాను. అంతా ఏం జరిగిందో అంతా చెప్పాను. అదంతా వాళ్లు చెప్పలేదట. శ్రుతి అర్థం చేసుకుంది. కచ్చితంగా మనసు మార్చుకుని ఇంటికి వస్తుందని మీనా అంటుంది. అక్కడికి వెళ్లి ఇది ఏం మాట్లాడిందో అని ప్రభావతి అంటుంది.
రోహిణి కూడా బాలు, శ్రుతివాళ్లను అని వెళ్లిపోతారు. అందరిని పంపించి వాళ్లనే ఉండమని ఇంటిని పూలకొట్టులా ఉంచేయండి అని ప్రభావతి వెళ్లిపోతుంది. తర్వాత మీనాను వెళ్లి శ్రుతి దగ్గరికి ఎవరు వెళ్లమన్నారు అని బాలు అంటాడు. శ్రుతికి నీ మీద కోపం. శ్రుతికి నచ్చజెప్పాను. ఇద్దరిని ఇంటికి రమ్మన్నాను. అత్తయ్య గారు బెంగపెట్టుకొన్నారని అని మీనా అంటుంది.
ఇద్దరం ఇద్దరితో మాట్లాడం కాబట్టి వాళ్లే వస్తారు. అప్పటివరకు ఏ గొడవ చేయకండి అని బాలుతో మీనా అంటుంది. మరోవైపు పార్లర్‌కు విద్య ఎంత చెప్పిన అగకుండా లోపలికి వెళ్తాడు దినేష్. హాయ్ కల్యాణి అంటూ రోహిణిని పలకరిస్తాడు దినేష్. నేను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాను. సింపుల్‌గా చేసుకుంటున్నాను. నాకు ఒక లక్ష ఇవ్వు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి నా మొదటిపెళ్లి గురించి చెప్పాను. కానీ, నువ్వేం చేశావ్. నువ్వు చెప్పేవి అన్ని అబద్ధాలే అని దినేష్ బ్లాక్ మెయిల్ చేస్తాడు.
డబ్బు గోల
ఇంతలో పార్లర్‌కి మనోజ్ వస్తాడు. అది రోహిణి చూస్తుంది. నేను డబ్బిలిస్తాను అని రోహిణి బతిమిలాడుకుంటుంది. దాంతో దినేష్ వెళ్లిపోతాడు. మనోజ్ వచ్చి రోహిణితో మాట్లాడుతాడు. కెనడాకు వెళ్లాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. మీ మావయ్యను అడిగి అరెంజ్ చేయమని మనోజ్ అంటాడు. అందరు ఎందుకు డబ్బు డబ్బు అని టార్చర్ పెడుతున్నారు అని నోరు జారుతుంది రోహిణి.
ఇంకెవరు నిన్ను అడిగారు అని మనోజ్ అంటాడు. మొన్న బ్యాంక్ వాళ్ల గురించి అని విద్య అంటుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బు అరెంజ్ చేయమని అడుగు. మీ అమ్మకు నువ్వంటే అందరికంటే ఎక్కువ ప్రేమ అని రోహిణి సలహా ఇస్తుంది. దాంతో మనోజ్ సైలెంట్ అవుతాడు. ఇంటికెళ్లి సత్యం, ప్రభావతిని కూర్చోబెట్టి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టమని అడుగుతాడు.
శ్రుతిని కాపాడిన బాలు
తర్వాత శ్రుతిని వెళ్లి బాలు కలుస్తాడు. అక్కడ శ్రుతిని ఎవరో దొంగ అంటారు. దాంతో వాళ్లను కొడుతుంది శ్రుతి. వాళ్ల నుంచి శ్రుతిని బాలు కాపాడుతాడు. అప్పుడు శ్రుతి తండ్రి సురేంద్ర ప్లాన్ గురించి తనకు చెబుతాడు బాలు. రవి అవస్థలు పడుతున్నాడని, మీ అత్త, మామ బెంగ పెట్టుకున్నారని నచ్చజెబుతాడు బాలు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



